• facebook
  • whatsapp
  • telegram

ఏప్రిల్‌కు 10 పాఠాల పూర్తి

* మే నెలలో పునశ్చరణ తరగతులు

* 35-40 శాతం పాఠ్యాంశాల తగ్గింపు

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో పదో తరగతి విద్యార్థులకు ఏప్రిల్‌ చివరి నాటికి పాఠాలను పూర్తి చేసి.. మే నుంచి పునశ్చరణ తరగతులను నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ భావిస్తోంది. నవంబరు 2 నుంచి పాఠశాలల్లో పూర్తి స్థాయి తరగతులు కొనసాగుతున్నాయి. కొన్ని ప్రైవేటు బడులు ఏప్రిల్‌ నుంచే పునశ్చరణకు సిద్ధమవుతున్నాయి. ప్రభుత్వ బడుల్లో మార్చి మూడో వారం నుంచి అదనపు తరగతులు నిర్వహించేందుకు జిల్లాలవారీగా ప్రణాళికలను రూపొందించారు. విద్యార్థులు నష్టపోకుండా ఉండేందుకు ఏపీ ప్రభుత్వం పదో తరగతి పాఠ్యాంశాలను 35-40 శాతం కుదిస్తూ వార్షిక ప్రణాళికను విడుదల చేసింది. వార్షిక ప్రణాళికలోని అధ్యాయాలు, పాఠ్యాంశాలను మూడు కేటగిరీలుగా విభజించింది. విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకునేవి, ఇంటి వద్ద చదువుకునేవి, ఐచ్ఛికంగా నేర్చుకునేవిగా గుర్తించింది. ఇందులో ఐచ్ఛికంగా నేర్చుకునేవి పరీక్షల్లో ఇవ్వరు. మొదటి రెండు విభాగాల్లో నేర్చుకునే అంశాలనే పబ్లిక్‌ పరీక్షలకు ఇచ్చేందుకు నిర్ణయించారు. విద్యార్థులకు 7 పరీక్షలను నిర్వహించనున్నారు. 
 

Published Date : 01-03-2021 20:23:10

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం