• facebook
  • whatsapp
  • telegram

జూన్ 18 నుంచి బాసర ఆర్జీయూకేటీ పీయూసీ-2 పరీక్షలు 

ఈనాడు డిజిటల్‌, ఆదిలాబాద్‌: నిర్మల్‌ జిల్లా బాసరలోని రాజీవ్‌ గాంధీ వైజ్ఞానిక, సాంకేతిక విశ్వవిద్యాలయం (ఆర్జీయూకేటీ) ప్రీ యూనివర్సిటీ కోర్సు (పీయూసీ) రెండో సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించాలన్న అధికారుల నిర్ణయం విద్యార్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. కరోనా నేపథ్యంలో ఆర్జీయూకేటీకి మార్చి 17 నుంచి యాజమాన్యం సెలవులు ప్రకటించడంతో విద్యార్థులు ఇళ్లకు వెళ్లిపోయారు. అప్పటికి సిలబస్‌ పూర్తి కాలేదు. పీయూసీ-1 విద్యార్థులతో పాటు ఈ1 ఈ2, ఈ3 విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేసే అవకాశం ఉంది. కానీ పీయూసీ-2, ఈ-4 విద్యార్థులకు విశ్వవిద్యాలయం నిబంధనల ప్రకారం తప్పకుండా పరీక్షలు నిర్వహించాల్సి ఉంటుంది. పీయూసీ-2 చదివే విద్యార్థులు వార్షిక పరీక్షల్లో ఉత్తీర్ణులైతేనే జేఈఈ, ట్రిపుల్‌ఐటీ-హెచ్‌, ఎంసెట్‌, బిట్్స పిలానీ అర్హత పరీక్షలు రాయడానికి అర్హత పొందుతారు. ఈ నేపథ్యంలో పీయూసీ-2 పరీక్షలను జూన్‌ 18 నుంచి 27 వరకు నిర్వహించాలని నిర్ణయించారు. 1543 మంది విద్యార్థులు జూన్‌ 15 నాటికి రావాలని అధికారులు ప్రకటించారు.
క్యాంపస్‌లో ఉండేదెలా?
రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో ఉన్న పీయూసీ-2 విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉంటుంది. విద్యార్థులు జూన్‌ 15 నుంచి 27 వరకు క్యాంపస్‌లోనే ఉండాల్సి వస్తుంది. అందరికీ కలిపి స్నానపు గదులు, మరుగుదొడ్లు ఉండటం వల్ల కూడా కరోనా వైరస్‌ సోకే ప్రమాదం ఉంటుందని విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.

Published Date : 10-06-2020 14:29:30

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం