• facebook
  • whatsapp
  • telegram

వైద్య ఆరోగ్య శాఖలో పోస్టుల భర్తీకి ఉత్తర్వులు

ఈనాడు, అమరావతి: వైద్య ఆరోగ్య శాఖలో వైద్యులు, ఇతర పోస్టుల భర్తీకి వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జవహర్‌రెడ్డి జీఓ 60, 61, 62, 63, 64, 65లను జారీచేశారు. ఈ ఉత్తర్వుల ద్వారా మొత్తం 9,712 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 5,701 పోస్టులను కొత్తగా సృష్టించారు. ప్రొబేషనరీ పీరియడ్‌ను రెండేళ్ల నుంచి మూడేళ్లకు పెంచారు. ప్రైవేటు ప్రాక్టీస్‌ను నిషేధించారు. దీనికి బదులు నాన్‌-ప్రాక్టీస్‌ అలవెన్స్‌ కింద బేసిక్‌-పేలో 15శాతం మొత్తాన్ని చెల్లిస్తామని ప్రకటించారు.
* అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, డెంటల్‌ అసిస్టెంట్‌ సర్జన్లు, ఇతర పోస్టులు వైద్యుల పోస్టుల భర్తీ జాబితాలో ఉన్నాయి. ఇందులో 1,349 పోస్టులు కొత్తగా మంజూరు చేశారు. ఇవి కాకుండా 804 ఖాళీలు భర్తీచేస్తారు.
* బోధనాసుపత్రుల అవసరాలకు వేర్వేరు కేటగిరీల్లో 218 ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు.
* వైద్య విధాన పరిషత్తు ఆధ్వర్యంలోని సామాజిక, ప్రాంతీయ, జిల్లా ఆస్పత్రుల్లో అవసరాలకు 46 పారా మెడికల్‌, నర్సింగ్‌ ఆర్డర్లీ వంటి 411 పోస్టులను భర్తీచేస్తారు.
* ప్రజారోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల అవసరాలకు 41 పారా మెడికల్‌, 174 ఎంఎన్‌ఓ, 131 ఎఫ్‌ఎన్‌ఓ పోస్టుల భర్తీకి ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
* ఒప్పంద విధానంలో 5,574 నర్సులు, ఫార్మసిస్టులు, ల్యాబ్‌ టెక్నీషియన్‌ పోస్టుల భర్తీ చేస్తారు.
* పొరుగు సేవల విధానంలో 964 డేటా ఎంట్రీ ఆపరేటర్‌, పారా మెడికల్‌ పోస్టులను భర్తీచేస్తారు.

Published Date : 12-06-2020 11:08:14

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం