• facebook
  • whatsapp
  • telegram

యూజీ, పీజీ పరీక్షలపై పూర్తి వివరాలతో రండి

* అధికారులకు సీఎం జగన్‌ సూచన

ఈనాడు, అమరావతి: అండర్‌ గ్రాడ్యుయేషన్‌(యూజీ), పోస్టుగ్రాడ్యుయేషన్‌(పీజీ) పరీక్షలపై సమగ్ర వివరాలతో రావాలని అధికారులకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సూచించినట్లు తెలిసింది. పరీక్షల నిర్వహణపై క్యాంపు కార్యాలయంలో సీఎం జూన్ 25న  సమీక్షించారు. మంత్రి ఆదిమూలపు సురేష్‌, ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్‌చంద్ర, ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌ హేమచంద్రారెడ్డి హాజరయ్యారు. పరీక్షలు నిర్వహిస్తే ఎలా నిర్వహించాలి? ఎలాంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి? రద్దు చేస్తే ఎలాంటి సమస్యలు వస్తాయి? లాంటి పూర్తి వివరాలతో రావాలని ముఖ్యమంత్రి ఆదేశించినట్లు తెలిసింది.  ఈ నేపథ్యంలో యూజీ, పీజీ పరీక్షలపై ఉన్నత విద్యామండలి మరోసారి ప్రత్యేక సమావేశం నిర్వహించి, రెండు, మూడు రోజుల్లో నివేదిక రూపొందించనుంది.
 

Published Date : 26-06-2020 10:43:52

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం