• facebook
  • whatsapp
  • telegram

ఎన్‌టీఎస్ఈ దరఖాస్తుల స్వీకరణ

ఈనాడు, అమరావతి: జాతీయ ప్రతిభాన్వేషణ పరీక్ష(ఎన్‌టీఎస్‌ఈ)కు పదోతరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని ప్రభుత్వ పరీక్షల విభాగం సంచాలకులు ఎ.సుబ్బారెడ్డి సూచించారు. దూరవిద్య విధానంలో మొదటిసారి పదోతరగతి పరీక్షలకు హాజరవుతున్న వారు కూడా అర్హులేనని తెలిపారు. పరీక్ష రుసుము కింద రూ.200 ఏపీసీఎఫ్‌ఎంఎస్‌ ద్వారా చెల్లించి ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. నవంబరు 6 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని, నవంబరు 9 లోపు పరీక్ష రుసుము చెల్లించాలని సూచించారు. డిసెంబరు 13న పరీక్ష ఉంటుందని వెల్లడించారు. పూర్తి వివరాలు వెబ్‌సైట్‌  http://www.bseap.org/ లో పొందుపర్చినట్లు తెలిపారు. 

Updated Date : 13-10-2020 18:49:11

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం