• facebook
  • whatsapp
  • telegram

పది విద్యార్థులకు నేరుగా తుది పరీక్షలు

* ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ప్రతాప్రెడ్డి 

ప్రత్తిపాడు, న్యూస్టుడే: పది విద్యార్థులకు నేరుగా తుది పరీక్షలు మాత్రమే ఉంటాయని రాష్ట్ర విద్య పరిశోధన, శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) డైరెక్టరు ప్రతాప్రెడ్డి తెలిపారు. గుంటూరు జిల్లా ప్రత్తిపాడులోని బీవీఆర్జడ్పీ ఉన్నత పాఠశాలను నవంబరు 25నఆయన గుంటూరు డీఈవో గంగాభవానితో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ.. పదో తరగతి విద్యార్థులకు మధ్యలో ఎలాంటి పరీక్షలు ఉండవని స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా మినహా రాష్ట్రంలోని పాఠశాలల్లో 25నవిద్యార్థుల హాజరు 70 శాతం వరకు నమోదైందన్నారు. నెల్లూరు జిల్లాలో తుపాను నేపథ్యంలో మూడు రోజులపాటు సెలవులు ప్రకటించినట్లు తెలిపారు. కొవిడ్నేపథ్యంలో పదో తరగతి విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మూడు రకాల అంశాలతో అకడమిక్క్యాలెండర్రూపొందించామని వివరించారు. తరగతి గదిలో మాత్రమే బోధించేవి, ఇంటి దగ్గర నేర్చుకునేవి, స్వతహాగా ఐచ్ఛికంగా నేర్చుకునే అంశాలున్నాయని తెలిపారు. ఐచ్ఛికంగా నేర్చుకునే 35 శాతం అంశాలను పరీక్షల్లో ఇవ్వబోమని, భవిష్యత్తులో వారు రాసే పోటీ పరీక్షలకు ఈ సిలబస్ఉపయోగపడుతుందని వివరించారు. పది విద్యార్థుల్లో మనోధైర్యాన్ని నింపేందుకు మధ్యాహ్నం నుంచి ఆన్లైన్తరగతుల నిర్వహణకు రాష్ట్రస్థాయిలో ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. ఇందుకు అనుగుణంగా పాఠశాల స్థాయిలోనే ప్రధానోపాధ్యాయులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల సమన్వయంతో ప్రణాళికలు తయారుచేయాలని చెప్పారు. సెమిస్టర్పద్ధతిలో పాఠ్యపుస్తకాలు ఇచ్చినందున అవసరమైన సెమిస్టర్పుస్తకాలనే విద్యార్థులు పాఠశాలకు తెచ్చుకోవాలని సూచించారు. ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా ప్రవేశాలు పొందిన విద్యార్థులకు త్వరలోనే విద్యాకానుక కిట్లు అందిస్తామని తెలిపారు.
 

Published Date : 25-11-2020 20:26:24

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం