• facebook
  • whatsapp
  • telegram

ఏపీలో వైద్య విద్య ప్రవేశాల ఆప్షన్ల నమోదు ప్రారంభం

ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే: రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు వైద్య కళాశాలల్లో 2020-21 విద్యాసంవత్సరానికి సంబంధించి అందుబాటులో ఉన్న కన్వీనర్‌ కోటా ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, ఆయుర్వేద, హోమియో సీట్ల ప్రవేశానికి ఆప్షన్ల నమోదు ప్రక్రియ డిసెంబ‌రు 13న ఉదయం 8 గంటల వరకు జరగనుంది. దీనికి సంబంధించి డిసెంబ‌రు 9న  నోటిఫికేషన్‌ను విడుదల చేశారు. వెంటనే ఆప్షన్ల నమోదు ఆరంభమవుతుంది. మెరిట్‌లిస్టులోని అభ్యర్థులు వెబ్‌ ఆప్షన్లు ఒకేసారి నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. బాలురు 28 కళాశాలలకు, బాలికలు 29 కళాశాలలకు ఒకేసారి ఆప్షన్లు ఇవ్వాలి. విశ్వవిద్యాలయం ఎన్ని విడతల కౌన్సెలింగ్‌లు నిర్వహించినా ఇవే ఆప్షన్ల ప్రాతిపదికన ప్రవేశాలు కల్పిస్తారు.

Published Date : 10-12-2020 11:30:24

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం