• facebook
  • whatsapp
  • telegram

పోలీసు శాఖలో 15వేలకు పైగా ఖాళీలు

ఈనాడు, హైదరాబాద్‌: వివిధ ప్రభుత్వ శాఖల్లోని ఖాళీ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆదేశించడంతో అధికారులు ఖాళీల వివరాలతో జాబితాలు తయారుచేసేందుకు కసరత్తు ప్రారంభించారు. వివిధ శాఖల్లో ప్రత్యక్ష నియామకాల ద్వారా భర్తీ అయ్యే ఉద్యోగాలు 50 వేల పైచిలుకు ఉండగా.. పదోన్నతుల ద్వారా భర్తీ కావాల్సినవి కొన్ని వేలు ఉన్నాయి. పదోన్నతులు ఇచ్చాక స్పష్టమైన ఖాళీల లెక్కలు వెల్లడవుతాయని అధికారవర్గాలు తెలిపాయి. ఇప్పటివరకు అందుబాటులో ఉన్న సమాచారం మేరకు..
* అత్యధికంగా పోలీసుశాఖలో 15,900కి పైగా పోస్టులు ఖాళీగా ఉన్నాయి. కొత్త కమిషనరేట్లు, జిల్లాలు, డివిజన్లు, మండలాలు, నగరపాలక సంస్థలు, పురపాలక సంఘాలు ఏర్పడినందున వాటికి అనుగుణంగా పోలీసు సిబ్బంది నియామకాలు జరగాలి.
* సంక్షేమ శాఖలకు సంబంధించి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ గురుకుల పాఠశాలల్లో 12,000 ఖాళీలున్నాయి. ప్రస్తుతం తాత్కాలిక నియామకాలతో ఇవి నడుస్తున్నాయి.
* విద్యాశాఖలోనూ ఖాళీల సంఖ్య పది వేల కంటే ఎక్కువే ఉంది. కొత్తగా ప్రారంభమైన విద్యాసంస్థల అవసరాలకు తోడు పదవీ విరమణల దృష్ట్యా 10,500 వరకూ ఖాళీలను గుర్తించారు.
* వైద్యఆరోగ్యశాఖలో భర్తీ చేయాల్సిన పోస్టులు 4,550 ఉన్నాయి. కొత్త ఆసుపత్రులు, బస్తీ దవాఖానాలు, విభాగాలను ప్రారంభించడం, కరోనా నేపథ్యంలో సేవల విస్తరణ దృష్ట్యా ఈ ఉద్యోగాలను భర్తీ చేయాల్సి ఉంది.
* కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల దృష్ట్యా ఏర్పడిన ఖాళీలు 2,500కి పైగా ఉన్నాయి. వీఆర్వోల ఉద్యోగాలను ఇతర శాఖల్లో సర్దుబాటు చేస్తున్నందున రెవెన్యూలో ఉద్యోగాల సంఖ్య తగ్గింది.
* అటవీశాఖలో 2,000 ఉద్యోగ నియామకాలు జరగాలి.
* రాష్ట్రంలోని 11 విశ్వవిద్యాలయాల్లో 1,061 సహ, సహాయ ఆచార్యుల ఉద్యోగాలు, 900 డిగ్రీ అధ్యాపకులు, 1,000 సాంకేతిక అధికారుల ఉద్యోగాలు భర్తీ చేయాలి.

ఇవీ చదవండి.

పోలీసు ఉద్యోగాలు తెలంగాణ-2021 స్టడీమెటీరియల్

ఇంగ్లిష్ అర్థ‌మెటిక్‌
జనరల్ సైన్స్ భార‌త‌దేశ చ‌రిత్ర‌, సంస్కృతి, భార‌త జాతీయ ఉద్య‌మం
తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన విష‌యాలు రీజ‌నింగ్‌, మెంట‌ల్ ఎబిలిటీ
భార‌త‌దేశ భౌగోళిక శాస్త్రం, రాజకీయ‌, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ అంత‌ర్జాతీయ‌, ప్రాంతీయ‌, వ‌ర్త‌మాన అంశాలు

Updated Date : 15-12-2020 11:03:31

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం