• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్ర ప్రభుత్వంతో ఐబీఎం ఒప్పందం

ఈనాడు, హైదరాబాద్‌: ఇంజినీరింగ్‌, డిగ్రీ, పాలిటెక్నిక్‌ విద్యార్థులు 30 వేల మందికి అధునాతన సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇచ్చేందుకు తెలంగాణ ప్రభుత్వంతో ఐబీఎం ఒప్పందం కుదుర్చుకుంది. తెలంగాణ అకాడెమీ ఫర్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌)తో కలిసి ఐబీఎం పనిచేయనుంది. ఈ ఉచిత ఓపెన్‌ పి-టెక్‌ కోర్సులో భాగంగా సైబర్‌ సెక్యూరిటీ, బ్లాక్‌చెయిన్‌, కృత్రిమ మేధ (ఏఐ), యంత్ర అభ్యాసం (మెషిన్‌ లెర్నింగ్‌), క్లౌడ్‌, ఇంటర్నెట్‌ ఆఫ్‌ థింగ్స్‌లాంటి సాంకేతికతలతో పాటు, వృత్తి నైపుణ్యాలలోనూ శిక్షణ అందిస్తుంది. కాలేజీ అధ్యాపకులకూ ఈ డిజిటల్‌ ప్లాట్‌ఫాం వినియోగంలో శిక్షణ ఇవ్వనుంది. దీనివల్ల వారు తమ విద్యార్థులకు సాయం చేయగలుగుతారు. ఉపాధికి తోడ్పడే సాంకేతికతపై విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలన్నదే ధ్యేయమని ఐబీఎం ఇండియా మేనేజింగ్‌ డైరెక్టర్‌ సందీప్‌ పటేల్‌ పేర్కొన్నారు.

Published Date : 15-12-2020 11:44:28

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం