• facebook
  • whatsapp
  • telegram

ఈ-లెర్నింగ్‌తో ఐటీఐ విద్యార్థులకు ప్రయోజనం

దిల్లీ: భారత్‌ స్కిల్స్‌ పోర్టల్‌ ద్వారా ఈ-లెర్నింగ్‌ విధానంతో దేశవ్యాప్తంగా 3 వేల పారిశ్రామిక శిక్షణ సంస్థల(ఐటీఐలు)కు చెందిన 1.2 లక్షల మంది విద్యార్థులకు ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఈ మేరకు ఐటీఐ విద్యార్థులకు ఉపాధినిచ్చే నైపుణ్యాల పెంపుదలకు అవసరమయ్యే డిజిటల్‌ కంటెంట్‌ను సమకూర్చేందుకు మైక్రోసాఫ్ట్‌, నాస్కామ్‌ ఫౌండేషన్లతో డైరెక్టరేట్‌ జనరల్‌ ఆఫ్‌ ట్రైనింగ్‌ (డీజీటీ) చేతులు కలిపింది. కేంద్ర నైపుణ్యాభివృద్ధి, ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్‌ మంత్రిత్వ శాఖ పరిధిలోని డీజీటీ ఈ వ్యవస్థాగత శిక్షణ బాధ్యతలను చేపట్టింది. 15 వేల ఐటీఐలు, 33 జాతీయ నైపుణ్య శిక్షణ సంస్థల నెట్‌వర్క్‌ ద్వారా దేశంలోని యువతకు శిక్షణ ఇచ్చేందుకు డీజీటీ చర్యలు చేపడుతోంది. డీజీటీ-మైక్రోసాఫ్ట్‌ భాగస్వామ్యంతో వేల మంది విద్యార్థులకు డిజిటల్‌ విద్యను అందుబాటులోకి తెస్తున్నట్లు సంబంధిత శాఖ మంత్రి మహేంద్రనాథ్‌ పాండే తెలిపారు. 2019 అక్టోబరులో డీజీటీ ‘భారత్‌స్కిల్స్‌’ పేరుతో ఆన్‌లైన్‌ శిక్షణ పోర్టల్‌ను ప్రారంభించింది.

Published Date : 25-12-2020 11:26:17

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం