• facebook
  • whatsapp
  • telegram

6 నుంచి డిగ్రీ ప్రవేశాలకు ఆన్‌లైన్‌ కౌన్సెలింగ్‌ 

ఈనాడు, అమరావతి: డిగ్రీ ఆన్‌లైన్‌ ప్రవేశాలకు ఉన్నత విద్యా మండలి ప్రకటన విడుదల చేసింది. బీఏ, బీకాం, బీఎస్సీలలో ప్రవేశాలకు జ‌న‌వ‌రి 6  నుంచి 17 వరకు ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌, కోర్సులు, కళాశాలల ఎంపికకు ఐచ్ఛికాల నమోదుకు అవకాశం కల్పించారు. విద్యార్థులు  https://oamdc.ap.gov.in వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏపీలో ఇంటర్‌ చదివిన విద్యార్థులు హాల్‌టిక్కెట్‌ నంబరు నమోదు చేసి, తల్లిదండ్రుల వివరాలను సమర్పిస్తే సరిపోతుంది. ఇతర బోర్డుల ద్వారా ఉత్తీర్ణులైన వారు ధ్రువపత్రాల పరిశీలనకు సహాయ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. రాష్ట్రవ్యాప్తంగా 54 సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 152 ప్రభుత్వ, 120 ఎయిడెడ్‌, 1,062 ప్రైవేటు, రెండు విశ్వవిద్యాలయ కళాశాలల్లో 4,92,820 సీట్ల భర్తీకి ఈ కౌన్సెలింగ్‌ నిర్వహించనున్నారు.
 

షెడ్యూల్‌ ఇలా...
* రిజిస్ట్రేషన్లు: 6 నుంచి 17 తేదీ వరకు
* కోర్సులు, కళాశాలల ఎంపికకు వెబ్‌ ఆప్షన్లు: 9-17
* సహాయ కేంద్రాలు: 6-12
* ఎన్‌సీసీ, క్రీడలు, మాజీ సైనికోద్యోగుల, దివ్యాంగుల పత్రాల పరిశీలన: 11-12
* సీట్ల కేటాయింపు: 20న
* కళాశాలల్లో చేరికలు: 21-23 వరకు

Published Date : 06-01-2021 11:47:49

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం