• facebook
  • whatsapp
  • telegram

12న ఐటీఐ నాలుగో విడత కౌన్సెలింగ్‌

కరెన్సీనగర్, న్యూస్‌టుడే: 2020-21 విద్యా సంవత్సరానికి జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ కళాశాలల్లో అందుబాటులో ఉన్న వివిధ ట్రేడుల్లో మూడో విడత కౌన్సెలింగ్‌ అనంతరం మిగిలిన సీట్లకు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విజయవాడ ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్‌ జి.రాజ కోటేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నాలుగో విడత కౌన్సెలింగ్‌కు చేరే అభ్యర్థులు (హెచ్‌టిటిపి://ఐటిఐ.ఎన్‌ఐసి.ఇన్‌ )ద్వారా ఈనెల 10లోగా తమ దరఖాస్తులను పూర్తి చేసి పంపాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఐటీఐల్లో జనవరి 12న, ప్రైవేటు ఐటీఐల్లో జనవరి 16న కౌన్సెలింగ్‌ ఉంటుందన్నారు. ఇతర వివరాలకు 0866-2475575కు సంప్రదించవచ్చు.

Published Date : 06-01-2021 12:48:46

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం