• facebook
  • whatsapp
  • telegram

2011-12 దూరవిద్య బీటెక్‌ చెల్లుబాటు

* ఏఐసీటీఈ స్పష్టీకరణ

దిల్లీ: దూర విద్య ద్వారా ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ 2011-12 వరకు ఇచ్చిన బీటెక్, డిప్లొమా ఇన్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ కోర్సులు చెల్లుబాటు అవుతాయని అఖిల భారత సాంకేతిక విద్యా మండలి (ఏఐసీటీఈ) స్పష్టం చేసింది. దూర విద్య ద్వారా ఇంజినీరింగ్‌ కోర్సులు నిర్వహించడం నిబంధనలకు విరుద్ధమని యూజీసీ చెప్పడంతో వాటిని నిలిపివేసింది. అయితే 2009-10 విద్యాసంవత్సరంలో పేర్లు నమోదు చేసుకున్నవారిని కొనసాగించాలని, వారి డిగ్రీలను ఆమోదించాలని 2018లో సుప్రీంకోర్టు ఆదేశించింది. దాంతోపాటు 2010-11, 2011-12 సంవత్సరాల్లో చదివిన వారిని చివరి బ్యాచీలుగా పరిగణిస్తూ కొంత వెసులుబాటు కూడా ఇచ్చింది. ఈ కారణంగా 2011-12 బ్యాచీ విద్యార్థుల డిగ్రీలు సక్రమమైనవిగా ఏఐసీటీఈ పరిగణించనుంది.  
 

Published Date : 10-01-2021 20:29:55

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

విద్యా ఉద్యోగ సమాచారం