• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సీపీసీఎల్‌లో నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ కొలువులు

ఫిబ్రవరి 26 దరఖాస్తుకు గడువు



చెన్నై పెట్రోలియం కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (సీపీసీఎల్‌) 73 నాన్‌ ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ఆన్‌లైన్‌ టెస్ట్, స్కిల్‌/ ప్రొఫిషియన్సీ/ ఫిజికల్‌ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 


మొత్తం 73 పోస్టుల్లో అన్‌రిజర్వుడ్‌-33, ఎస్సీ-17, ఎస్టీ-01, ఓబీసీ-15, ఈడబ్ల్యూఎస్‌-7 కేటాయించారు. ఈ పోస్టులకు పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. 


1. జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌-4 (ప్రొడక్షన్‌): 60 శాతం మార్కులతో కెమికల్‌/ పెట్రోలియం/ పెట్రోకెమికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా/ బీఎస్సీ (కెమిస్ట్రీ). ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు సరిపోతాయి.  


2. జూనియర్‌ క్వాలిటీ కంట్రోల్‌ అనలిస్ట్‌-4 ట్రైనీ: 60 శాతం మార్కులతో కెమిస్ట్రీ ప్రధాన సబ్జెక్టుగా బీఎస్సీ.   


3. జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌-4 (మెకానికల్‌): మూడేళ్ల మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా. జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 60 శాతం మార్కులతో, ఎస్సీ/ పీడబ్ల్యూబీడీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాసవ్వాలి.  


4. జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిసెంట్‌-4 (ఎలక్ట్రికల్‌): 60 శాతం మార్కులతో మూడేళ్ల ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా.  


5. జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌-4 (ఇన్‌స్ట్రుమెంటేషన్‌): మూడేళ్ల ఇన్‌స్ట్రుమెంటేషన్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ అండ్‌ కంట్రోల్‌/ ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ డిప్లొమా 60 శాతం మార్కులతో, ఎస్సీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాసవ్వాలి. ఈ పోస్టులు అన్నింటిలోనూ ట్రైనీ, కేటగిరీ-1, కేటగిరీ-2 అనే మూడు రకాల కేటగిరీలు ఉన్నాయి. ట్రైనీ పోస్టుకు ఉద్యోగానుభవం అవసరం లేదు. కేటగిరీ-1కు ఏడాది, కేటగిరీ-2కు మూడేళ్ల పని అనుభవం ఉండాలి.


6. జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌-4 (పిఅండ్‌యు-మెకానికల్‌): 60 శాతం మార్కులతో మూడేళ్ల మెకానికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా. 


7. జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌-4 (పి అండ్‌ యు-ఎలక్ట్రికల్‌): 60 శాతం మార్కులతో మూడేళ్ల ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా.


8. జూనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-4 (ఫైర్‌ అండ్‌ సేఫ్టీ): మెట్రిక్, ఎన్‌ఎఫ్‌ఎస్‌సీ-నాగ్‌పుర్‌ నుంచి సబ్‌-ఆఫీసర్స్‌ కోర్సు పూర్తిచేయాలి. హెవీ వెహికల్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ ఉండాలి. దీంట్లో ట్రైనీ పోస్టులకు అనుభవం అవసరం లేదు. కేటగిరీ-1 పోస్టుకు ఏడాది అనుభవం ఉండాలి. 



గరిష్ఠ వయసు: 01.02.2024 నాటికి జూనియర్‌ ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌ పోస్టులకు 30 సంవత్సరాలు మించకూడదు. మిగిలిన పోస్టులకు 26 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్లు, ఓబీసీ, ఎక్స్‌-సర్వీస్‌మెన్‌లకు 3 ఏళ్లు. పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు 10-15 ఏళ్ల సడలింపు ఉంటుంది.  


దరఖాస్తు ఫీజు: రూ.500 ఆన్‌లైన్‌లో చెల్లించాలి. ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ ఎక్స్‌-సర్వీస్‌మెన్‌ అభ్యర్థులకు ఫీజు లేదు. 


ఎంపిక: ఆన్‌లైన్‌ టెస్ట్, స్కిల్‌/ ప్రొఫిషియన్సీ/ ఫిజికల్‌ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 


ఆన్‌లైన్‌ పరీక్ష 120 మార్కులకు.. రెండు భాగాలు. పార్ట్‌-1లో జనరల్‌ ఆప్టిట్యూడ్‌ (వెర్బల్‌ ఎబిలిటీ, జీకే, రీజనింగ్‌/ లాజికల్‌ డిడక్షన్స్‌ అండ్‌ న్యూమరికల్‌ ఎబిలిటీ)కు చెందిన 50 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌-2లో సబ్జెక్టు నాలెడ్జ్‌కు సంబంధించిన 70 ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నలన్నీ మల్టిపుల్‌ ఛాయిస్‌ విధానంలో ఉంటాయి. వ్యవధి 2 గంటలు. పరీక్షను చెన్నైలోనే నిర్వహిస్తారు. 


ప్రతీ తప్పు సమాధానానికీ పావు మార్కు తగ్గిస్తారు. 


రాత పరీక్షలో కనీసార్హత మార్కులు సాధించిన అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో స్కిల్‌/ ప్రొఫిషియన్సీ/ ఫిజికల్‌ టెస్ట్‌కు ఎంపిక చేస్తారు.


ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహణకు సంబంధించిన తాజా సమాచారం కోసం అభ్యర్థులు తరచూ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 


ఫైర్‌ అండ్‌ సేఫ్టీ పోస్టులకు: రాత పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఫిజికల్, ఎండ్యూరెన్స్‌ పరీక్షలను నిర్వహిస్తారు. 


ఎ) ఫిజికల్‌ టెస్ట్‌: ఎత్తు 165 సెం.మీ., బరువు 50 కేజీలు, చాతీ 81-86.5 సెం.మీ. ఉండాలి. 


బి) ఎండ్యూరెన్స్‌ టెస్ట్‌: 

1. 1.6 కి.మీ. దూరాన్ని 6 నిమిషాల్లో పరుగెత్తాలి. 

2. 30 కేజీల డమ్మీలోడ్‌తో 100 మీటర్ల దూరాన్ని 30 సెకన్లలో పరుగెత్తాలి. 

3. 4 మీటర్ల తాడుపైకి పాదాలు, చేతులు ఉపయోగిస్తూ ఎక్కాలి. 


సి) ఎటువంటి అనారోగ్య, దృష్టి, వినికిడి సమస్యలూ ఉండకూడదు.


గమనించాల్సినవి..

ఒకరు ఒక పోస్టుకు మాత్రమే దరఖాస్తు చేయాలి. ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేస్తే ఫీజును తిరిగి చెల్లించరు. 

రాత పరీక్ష, స్కిల్‌ టెస్టుకు హాజరయ్యే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు రెండో తరగతి ప్రయాణ ఛార్జీలను చెల్లిస్తారు.

ప్రభుత్వ/ ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేసే అభ్యర్థులు ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను ధ్రువపత్రాల పరిశీలన సమయంలో సమర్పించాలి. 


దరఖాస్తుకు చివరి తేదీ: 26.02.2024 


ఆన్‌లైన్‌ పరీక్ష తేదీ: 10.03.2024


వెబ్‌సైట్‌: https://cpcl.co.in/
 

-----------------------------------------------------------------------------------------------------------

మరింత సమాచారం... మీ కోసం!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Posted Date : 14-02-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌