• facebook
  • twitter
  • whatsapp
  • telegram

లోతుగా ఆలోచిస్తేనే ఉద్యోగం!

మనవద్దనున్న సమాచారాన్ని ఆధారంగా చేసుకుని, ఏదైనా అంశాన్ని లేదా సమస్యను క్షుణ్ణంగా పరిశీలించడాన్ని క్రిటికల్‌ థింకింగ్‌ అంటున్నాం. ఇందులో ఆబ్జెక్టివ్‌గా ఉండటం చాలా ముఖ్యం. అంటే సమస్యను భావోద్వేగాలతో (ఎమోషనల్‌గా) కాకుండా తార్కికంగా డీల్‌ చేయడం. ప్రతి పరిశ్రమలోనూ ఉన్నతస్థాయి ఉద్యోగాలు అన్నింటికీ క్రిటికల్‌ థింకింగ్‌ నైపుణ్యాలు అవసరం. ఎమోషనల్‌ ఇంటెలిజెన్స్‌లో ఇది కూడా ఒక భాగం. సమస్య పరిష్కారంలో ఇది చాలా ముఖ్యమైన అంశం.

   రెండు లేదా మూడు అంశాల మధ్యనున్న పరస్పర సంబంధాన్ని అర్థం చేసుకోవడానికి క్రిటికల్‌ థింకింగ్‌ ఉపయోగపడుతుంది. ఉదాహరణకు ఏదైనా వ్యాపారం గురించి మాట్లాడుకుంటే... మార్కెట్‌ ఎలా పెంపొందించుకోవాలి అనే వ్యూహం, అమ్మకాలు, లాజిస్టిక్స్‌ మధ్య సంబంధాన్ని అర్థం చేసుకుంటే మంచి లాభాన్ని ఆర్జించవచ్చు. క్రిటికల్‌ థింకింగ్‌ సాయంతో ఇలా లోతుగా అధ్యయనం చేసే అవకాశం ఉంటుంది.

    క్రిటికల్‌ థింకింగ్‌ అనేది క్రియేటివ్‌ థింకింగ్‌ కంటే భిన్నమైనది. సృజనాత్మకతలో మనం ఏదైనా కొత్త అంశాన్ని తెరపైకి తీసుకురావడమో, కొత్తగా ఆలోచించి దేన్నయినా సృష్టించడమో జరుగుతుంది. కానీ క్రిటికల్‌ థింకింగ్‌లో ఉన్న సమాచారాన్ని ఎంత సమర్థంగా అర్థం చేసుకున్నారు, దాని నుంచి ఎంతగా ఫలితాలనిచ్చే పరిష్కారాలు రాబట్టారు అనేది ప్రధానం.


ఈ థింకింగ్‌ ఉన్నవారు..

 ఆలోచనల మధ్య ఉన్న సంబంధాన్ని అర్థం చేసుకుంటారు. 

 వాదన - ప్రతివాదనకు విలువనిస్తారు.  

 సరైన పరిష్కారాన్ని గుర్తించి దాన్ని ఆచరణీయంగా మలుస్తారు. 

 రీజనింగ్‌లో లోపాలు ఉంటే గుర్తిసారు. 

 సమస్యల పరిష్కారానికి క్రమపద్ధతిని పాటిస్తారు.  

 ఆలోచనలు, నమ్మకాలు, వాస్తవాల మధ్య తేడాను కనిపెడతారు.


ఇందుకు పరిశీలన, విశ్లేషణ, వివరణ, ప్రతిబింబించడం, గణించడం, సమస్య పరిష్కారం, నిర్ణయం తీసుకునే సామర్థ్యం... ఇవన్నీ అవసరం అవుతాయి. వీటిని సాధన చేయాలి.


పెంచుకోవడం ఎలా?


 కనిపించినదాన్నలా నమ్మడం, సరేననడం సరికాదు. ఒక విషయాన్ని ఒకటి కంటే ఎక్కువ కోణాల్లో చూడటం సాధన చేయాలి. ఏ వాదనను అయినా సమర్థించడానికి ఉన్న కారణాలు, రుజువులు ఏంటనేది చూడాలి.

 కాస్త కష్టమైనా సరే... మనం నమ్మేదంతా నిజం కాదనే విషయాన్ని ఒప్పుకోగలగాలి. సొంత ఆలోచనలు, అభిప్రాయాలను పక్కనపెట్టి పూర్తిగా లాజికల్‌గా ఆలోచించడం నేర్చుకోవాలి. 

 ప్రశ్నించడం అనేది నేర్చుకోవడానికి తొలిమెట్టు. అందువల్ల సందర్భం ఏదైనా సరే... సందేహం కలిగినప్పుడు ప్రశ్నించి విషయం పూర్తిగా తెలుసుకోవడానికే ప్రయత్నించాలి. 

 ఎక్కువ సమాచారం చేతిలో ఉన్నప్పుడే సరైన నిర్ణయానికి రాగలం. పూర్తిస్థాయిలో రిసెర్చ్‌ అవసరం. అలాగే పనిని ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఇంకా మెరుగ్గా చేసేందుకు అవకాశం ఉందా అనేది పరిశీలించాలి.


కోర్సులున్నాయి...


క్రిటికల్‌ థింకింగ్‌ను నేర్చుకునేందుకు ఆన్‌లైన్‌లో చాలా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. లాజిక్, క్రిటికల్‌ థింకింగ్, మైండ్‌వేర్‌... అంశాల మీద పలు సంస్థలు తరగతులు నిర్వహిస్తున్నాయి. వీటికి హాజరుకావడం ద్వారా దీన్ని మరింత సాధన చేయొచ్చు.

మరింత సమాచారం ... మీ కోసం!

‣ కోడింగ్ రాక‌పోయినా ఐటీ ఉద్యోగం!

‣ స‌గం ప్ర‌శ్న‌లు స‌రిగా రాస్తే చాలు!

‣ ఎడ్యుకేష‌న్ లోన్‌ ఎలా తీసుకోవాలి?

‣ స‌మూహంలో స‌త్తా చూపించండి! 

‣ ఎన్‌సీఎల్‌  405 ఉద్యోగాలు!

Posted Date : 15-12-2022 .

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌