• facebook
  • twitter
  • whatsapp
  • telegram

నిక్మార్‌లో నిర్మాణ కోర్సులు

దేశంలో ఎక్కువమందికి ఉపాధి కల్పిస్తోన్నవాటిలో ముఖ్యమైంది నిర్మాణ రంగం. ఈ విభాగంలో ఎన్నో రకాల వృత్తి నిపుణుల సేవలు అవసరం. ఇందుకు అవసరమైన మానవ వనరులను తయారుచేయడానికి దేశంలో చాలా సంస్థలు వెలిశాయి. వాటిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ రిసెర్చ్‌ (నిక్మార్‌) ముఖ్యమైందిగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థ హైదరాబాద్‌ సహా పలు క్యాంపసుల్లో వివిధ కోర్సులు అందిస్తోంది. తాజాగా వాటిలో ప్రవేశాలకు ప్రకటన వెలువడింది. 

నిక్మార్‌కు పుణె, హైదరాబాద్‌ (శామీర్‌పేట), దిల్లీ, గోవాల్లో క్యాంపస్‌లు ఉన్నాయి. వీటిలో రెండేళ్లు, ఏడాది వ్యవధితో రకరకాల రియల్‌ ఎస్టేట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు అందుబాటులో ఉన్నాయి.  ఆన్‌లైన్‌ పరీక్ష, ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలతో కోర్సుల్లో ప్రవేశం లభిస్తుంది. ఇంటినుంచే పరీక్ష రాసుకుని, ఇంటర్వ్యూలో పాల్గొనవచ్చు. డిగ్రీ, ఇంజినీరింగ్‌ కోర్సులు పూర్తిచేసినవారు, ఆఖరు సంవత్సరం కోర్సులు చదువుతున్నవారూ దరఖాస్తు చేసుకోవచ్చు.  ఈ సంస్థ విద్యార్థులు క్యాంపస్‌ నియామకాల ద్వారా ప్రముఖ స్థిరాస్తి కంపెనీల్లో ఉద్యోగాలు సొంతం చేసుకుంటున్నారు. లోథా, గోద్రెజ్‌ ప్రాపర్టీస్, డీఎల్‌ఎఫ్‌ బిల్డింగ్‌ ఇండియా, డీహెచ్‌ఎఫ్‌ఎల్, యునీటెక్, టాటా హౌసింగ్, అన్సాల్‌ ఏపీఐ, రహేజా యూనివర్సల్, లార్సెన్‌ అండ్‌ టబ్రో, పంజ్‌ లాయిడ్‌ గ్రూప్, 99 యాకర్స్, మ్యాజిక్‌ బ్రిక్స్, ఇండియా ప్రాపర్టీ, ఇండియా హౌసింగ్‌.కామ్‌ తదితర సంస్థల్లో అవకాశాలుంటాయి. విదేశీ నిర్మాణ సంస్థల్లోనూ ఉద్యోగాలు పొందవచ్చు. మెరిట్‌ విద్యార్థులకు స్కాలర్‌షిప్పు లభిస్తుంది. 


ముఖ్యమైన తేదీలు
ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: డిసెంబరు 27, 2020
దరఖాస్తు ఫీజు: ఒక కోర్సుకు రూ.2100. ఎక్కువ కోర్సులకు రూ.2620
ఆన్‌లైన్‌ పరీక్ష తేదీలు: జనవరి 9, 10, 11 
ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూలు: జనవరి 18, 2021 నుంచి మొదలవుతాయి
తరగతులు: జులై 12, 2021 నుంచి ప్రారంభం..
వెబ్‌సైట్‌: https://nicmar.ac.in/

ఇవీ కోర్సులు: 
పీజీ ప్రోగ్రాం ఇన్‌ అడ్వాన్స్‌డ్‌ కన్‌స్ట్రక్షన్‌ మేనేజ్‌మెంట్‌ 
ఎక్కడ: రెండేళ్ల వ్యవధితో పుణె, హైదరాబాద్, దిల్లీ, గోవా క్యాంపసుల్లో అందిస్తున్నారు
అర్హత: ఇంజినీరింగ్‌ / ఆర్కిటెక్చర్‌ / డిజైన్‌.. ఎందులోనైనా 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత

పీజీ ప్రోగ్రాం ఇన్‌ ప్రాజెక్ట్‌ ఇంజినీరింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ 
ఎక్కడ: రెండేళ్ల వ్యవధితో పుణె, హైదరాబాద్‌ క్యాంపసుల్లో అందిస్తున్నారు
అర్హత: 50 శాతం మార్కులతో ఏదైనా ఇంజినీరింగ్‌ విభాగంలో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

పీజీ ప్రోగ్రాం ఇన్‌ రియల్‌ ఎస్టేట్‌ అండ్‌ అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ మేనేజ్‌మెంట్‌ 
ఎక్కడ: రెండేళ్ల వ్యవధితో పుణె క్యాంపస్‌లో అందుబాటులో ఉంది. 
అర్హత: ఇంజినీరింగ్‌ / ఆర్కిటెక్చర్‌ / డిజైన్‌... ఎందులోనైనా 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత

పీజీ ప్రోగ్రాం ఇన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్స్, డెవలప్‌మెంట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ 
ఎక్కడ: రెండేళ్ల వ్యవధితో పుణె క్యాంపస్‌లో అందిస్తున్నారు.
అర్హత:ఇంజినీరింగ్‌ / ఆర్కిటెక్చర్‌ / ప్లానింగ్‌.. ఎందులోనైనా 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత

పీజీ ప్రోగ్రాం ఇన్‌ మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ ఫ్యామిలీ ఓన్డ్‌ కన్‌స్ట్రక్షన్‌ బిజినెస్‌
ఎక్కడ: ఏడాది వ్యవధితో పుణె క్యాంపస్‌లో అందిస్తున్నారు
అర్హత:నిర్మాణ రంగంలో సేవలు అందిస్తోన్న కుటుంబాలకు చెందినవారే ఈ కోర్సులో చేరడానికి అవకాశం ఉంది. ఏదైనా విభాగంలో 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. 

పీజీ ప్రోగ్రాం ఇన్‌ క్వాంటిటీ సర్వేయింగ్‌ అండ్‌ కాంట్రాక్ట్‌ మేనేజ్‌మెంట్‌
ఎక్కడ: ఏడాది వ్యవధితో హైదరాబాద్‌ క్యాంపస్‌లో అందిస్తున్నారు
అర్హత:ఏదైనా ఇంజినీరింగ్‌ విభాగంలో 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత. 

పీజీ ప్రోగ్రాం ఇన్‌ హెల్త్‌ సేఫ్టీ అండ్‌ ఎన్విరాన్‌మెంట్‌ మేనేజ్‌మెంట్‌
ఎక్కడ: ఏడాది వ్యవధితో హైదరాబాద్‌ క్యాంపస్‌లో అందిస్తున్నారు. 
అర్హత: 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ బ్యాచిలర్‌ డిగ్రీ లేదా 50 శాతం మార్కులతో ఇంజినీరింగ్‌ డిప్లొమాతోపాటు నాలుగేళ్ల పని అనుభవం

Posted Date : 24-09-2020 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌