• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌లో కొలువులు

* ఫిబ్రవరి 23 దరఖాస్తుకు గడువుదిల్లీలోని ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్, రిపేరింగ్‌ సంస్థ.. ఏఐ ఇంజినీరింగ్‌ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఏఐఈఎస్‌ఎల్‌) 100 ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్, టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అభ్యర్థులను ముందు 5 ఏళ్ల ఫిక్స్‌డ్‌ టర్మ్‌ కాంట్రాక్ట్‌ కింద ఉద్యోగంలోకి తీసుకుంటారు. పనితీరు, సంస్థ అవసరాల ఆధారంగా కాంట్రాక్ట్‌ను మరో 5 ఏళ్లపాటు పొడిగించే అవకాశం ఉంటుంది. దరఖాస్తులను ఆఫ్‌లైన్‌లో పంపాలి. 

స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్, టెక్నికల్‌ అసెస్‌మెంట్, పర్సనల్‌ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. 

అర్హతలు, అనుభవం ఆధారంగా అభ్యర్థుల షార్ట్‌లిస్ట్‌ను తయారుచేసి ఇంటర్వ్యూకు పిలుస్తారు. ఇంటర్వ్యూ తేదీ, సమయాలను అభ్యర్థుల ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్లకు తెలియజేస్తారు.

స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌ సమయంలో అభ్యర్థుల ఒరిజినల్‌ డాక్యుమెంట్లను పరిశీలిస్తారు. 

గవర్నమెంట్‌/ సెమీ-గవర్నమెంట్‌/ ప్రభుత్వరంగ సంస్థల్లో పనిచేసే అభ్యర్థులు ప్రాపర్‌ ఛానల్‌ ద్వారా దరఖాస్తు చేయాలి. లేదా ‘నో అబ్జెక్షన్‌ సర్టిఫికెట్‌’ను సమర్పించాలి. 

స్కిల్‌/ ట్రేడ్‌ టెస్ట్‌లో చూపిన ప్రతిభ ఆధారంగా అభ్యర్థులను ఇంటర్వ్యూకు ఎంపిక చేస్తారు.


ఏ పోస్టుకు ఎవరు అర్హులు? 

1. ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌: ఏఎంఈ డిప్లొమా/ సర్టిఫికెట్‌ ఇన్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ (మెకానికల్‌) ఇంజినీరింగ్‌ 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు ఉండాలి. 

లేదా మెకానికల్‌/ ఏరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా 60 శాతం మార్కులతో పాసవ్వాలి. ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు సరిపోతాయి. 

ఏడాది పని అనుభవం తప్పనిసరి. 

2. ఎయిర్‌క్రాఫ్ట్‌ టెక్నీషియన్‌ (ఏవియానిక్స్‌/ ఎలక్ట్రికల్‌/ ఇన్‌స్ట్రుమెంటల్‌/ రేడియో): ఏఎంఈ డిప్లొమా/ సర్టిఫికెట్‌ ఇన్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ మెయింటెనెన్స్‌ ఇంజినీరింగ్‌ (ఏవియానిక్స్‌) జనరల్‌ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ/ ఎస్టీ/ ఓబీసీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాసవ్వాలి. లేదా ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌/ టెలికమ్యూనికేషన్‌/ రేడియో/ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ ఇంజినీరింగ్‌ డిప్లొమా జనరల్‌ అభ్యర్థులు 60 శాతం, ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ అభ్యర్థులు 55 శాతం మార్కులతో పాసవ్వాలి. 

3. టెక్నీషియన్‌- ఫిట్టర్‌/ షీట్‌ మెటల్, కార్పెంటర్, వెల్డర్‌: సంబంధిత విభాగంలో ఐటీఐ పూర్తిచేయాలి. 2 ఏళ్ల పని అనుభవం ఉండాలి. 

4. టెక్నీషియన్‌ - ఎక్స్‌రే/ ఎన్‌డీటీ: బీఎస్సీ (ఫిజిక్స్‌) లేదా డిప్లొమా ఇన్‌ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ లేదా బీటెక్‌ ఇన్‌ మెకానికల్‌/ ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌ పాసవ్వాలి. 

01.02.2024 నాటికి జనరల్‌/ ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థుల వయసు 35 సంవత్సరాలు మించకూడదు. గరిష్ఠ వయసులో ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ/ఎస్టీలకు 5 ఏళ్ల సడలింపు ఉంటుంది. ఎక్స్‌ - సర్వీస్‌మెన్‌కు ప్రభుత్వ తాజా మార్గదర్శకాలకు అనుగుణంగా గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి. జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1000. దీన్ని ఆర్‌టీజీఎస్‌/ ఎన్‌ఈఎఫ్‌టీ ద్వారా చెల్లించాలి. 

సంస్థ వెబ్‌సైట్‌ నుంచి అప్లికేషన్‌ ప్రింట్‌ అవుట్‌ తీసుకుని పూరించాలి. దానికి సంబంధిత డాక్యుమెంట్లను జతచేసి ఆఫ్‌లైన్‌లో పంపాలి. 

ఇంటర్వ్యూకు హాజరయ్యే ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రెండో తరగతి ప్రయాణ ఛార్జీలను చెల్లిస్తారు. 

ఎంపికైన అభ్యర్థులను దిల్లీతోపాటు దేశంలోని ఏఐఈఎస్‌ఎల్‌ కార్యాలయాల్లో ఎక్కడైనా నియమించే అవకాశం ఉంటుంది.  

దరఖాస్తుకు చివరి తేదీ: 23.02.2024

వెబ్‌సైట్‌: www.aiesl.in/


మరింత సమాచారం... మీ కోసం!

‣ ఈ నైపుణ్యాలే ఫ్రెషర్లకు ధీమా!

‣ జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకుందాం ఇలా..

‣ ట్రెండింగ్‌ విద్యావిధానం.. టెక్నాలజీ ఎన్‌హాన్స్‌డ్‌ లెర్నింగ్‌!

‣ స్కామర్లతో తస్మాత్‌ జాగ్రత్త!

‣ ఆరు మెట్లతో ఆఫర్‌ లెటర్‌ అందుకోండిలా!

‣ వాయిదా వేస్తే.. వెనుకపడ్డట్లే!

‣ స్టార్టప్‌లతో దూసుకెళ్దామా!

Posted Date : 15-02-2024 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌