• facebook
  • twitter
  • whatsapp
  • telegram

పీజీ విద్యార్థులకు నాబార్డ్ ఇంట‌ర్న్‌షిప్‌

దరఖాస్తుకు చివరి తేదీ మార్చి 5

వృత్తిపరమైన అభిరుచిని, సామర్థ్యాలను, బలమైన వ్యక్తిత్వాన్ని పెంపొందించుకోడానికి ఇంట‌ర్న్‌షిప్‌లు మంచి మార్గాలు.  ఇవి చేయడం ద్వారా ఉద్యోగవకాశాలు కూడా మెరుగుపడతాయి. అందుకే ప్రఖ్యాత సంస్థల్లో ఇంటర్న్‌షిప్ చేసేందుకు చాలామంది అభ్యర్థులు ప్రయత్నాలు చేస్తుంటారు. అలాంటి ఒక చక్కని అవకాశం ఇప్పుడు నాబార్డ్ (నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్‌మెంట్) కల్పిస్తోంది. 

మన దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం, ఇతర ఆర్థిక కార్యకలాపాల కోసం విధానాలను రూపొందించడం, రుణాలు అందించడం, సంబంధిత ప్రణాళికలు, కార్యకలాపాల పర్యవేక్షణ నాబార్డ్ పరిధిలో ఉంటాయి. ఇది పూర్తిగా కేంద్ర ప్రభుత్వ సంస్థ. ఇందులో స్టూడెంట్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ (సిస్) పేరుతో ఇంట‌ర్న్‌షిప్‌ల కోసం ప్రకటన వెలువడింది. ఆస‌క్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. 

అర్హతలు.. ఖాళీలు

వ్యవసాయం, అనుబంధ విభాగాలు (వెటర్నరీ, ఫిషరీస్‌, అగ్రి-బిజినెస్), ఎకనామిక్స్, సోషల్ సైన్సెస్, మేనేజ్‌మెంట్‌తోపాటు గుర్తింపు పొందిన సంస్థల నుంచి లా సహా అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ కోర్సులను అభ్యసించే విద్యార్థులు, నాలుగో సంవత్సరం చ‌దువుతున్న వారు ఈ ప్రోగ్రామ్‌కి దరఖాస్తు చేసుకోవచ్చు. విదేశాల్లో చదువుతున్న భారతీయ విద్యార్థులు కూడా సిస్‌ 2021-22కు అప్లై చేసుకునే అవ‌కాశం క‌ల్పించారు. 

నాబార్డ్ స్టూడెంట్ ఇంటర్న్‌షిప్ స్కీమ్ మార్గదర్శకాల ప్ర‌కారం 75 ఇంటర్న్‌షిప్ ఖాళీలు ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ / అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ డిగ్రీ చదివే విద్యార్థులు ఈ ప్రోగ్రాంకు అర్హులు. ప్రోగ్రాం రెండు నుంచి మూడు నెల‌లపాటు కొనసాగుతుంది. దరఖాస్తులను పరిశీలించి షార్ట్‌లిస్ట్ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ.18 వేల చొప్పున స్టైపెండ్‌తోపాటు ఇత‌ర అల‌వెన్స్‌లు ఇస్తారు.

ప్రోగ్రామ్ వివరాలు

ఎంపికైన అభ్యర్థులు బ్యాంకుకు సంబంధించిన స్వల్పకాలిక పనులు, ప్రాజెక్టులు, అధ్యయనాలు చేయాల్సి ఉంటుంది. వెబ్ ఆధారంగా వాటర్‌షెడ్ మేనేజ్‌మెంట్ ప్రాజెక్టుల‌ను ప‌ర్య‌వేక్షించ‌డం, రూర‌ల్‌హాట్‌లు, రూర‌ల్ మార్ట్‌లు, హోమ్‌స్టేలు (గ్రామీణ పర్యాటక రంగం), నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాలు, మైక్రో ఏటీఎంలు, ఆర్థిక అక్షరాస్యత కార్యక్రమాల నిర్వ‌హ‌ణ వంటివి ఈ ప్రోగ్రాంలో భాగంగా ఉంటాయి. ప్రాజెక్టులను స‌మ‌ర్థంగా పూర్తి చేసిన విద్యార్థుల‌కు స్టైపెండ్‌, ఫీల్డ్ అలవెన్స్‌ల‌తో సహా ఇత‌ర‌ప్రయోజనాలను అంద‌జేస్తారు. 

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 5, 2021.

వెబ్ సైట్: www.nabard.org

పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

Posted Date : 17-02-2021 .

గమనిక : గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌