• facebook
  • twitter
  • whatsapp
  • telegram

సరళరేఖాయుగ్మాలు

రెండు రేఖలను సంయుక్తంగా సరళరేఖాయుగ్మం అంటారు.

రేఖాయుగ్మ సంయుక్త సమీకరణం: రెండు రేఖల సమీకరణాలు విడివిడిగా L1 = 0, L2=0 అయితే వాటి సంయుక్త సమీకరణం L1L2 = 0 అవుతుంది.

కారణం: (i) L1=0 రేఖపై బిందువులన్నీ L1L2 = 0 ని తృప్తిపరుస్తాయి. 

             (ii) L2 = 0 రేఖపై బిందువులన్నీ L1L2 = 0 ని తృప్తిపరుస్తాయి.

             (iii) L1 = 0, L2 = 0 లపై లేని ఏ బిందువూ L1L2 = 0 ని తృప్తిపరచలేవు.

ఉదా: 1. 2x + 3y + 5 = 0 మరియు 3x -4y + 7 = 0 రేఖల సంయుక్త సమీకరణం

(2x + 3y + 5) (3x- 4y + 7) = 0 అవుతుంది.

2. 4x + y = 0, 2x + 5y = 0 రేఖల సంయుక్త సమీకరణం(4x + y) (2x + 5y) = 0 అవుతుంది.

ఫలితం: ఆదిబిందువు ద్వారా పోయే రెండు రేఖలు

            L1 = l1x + m1y = 0

            L2 = l2x + m2y = 0 అయితే, వాటి

సంయుక్త సమీకరణం L1 L2 = 0

అంటే, ( l1x + m1y) ( l2x + m2y) = 0

l1 l2 x2 + (l1 m2 + l2 m1) xy + m1 m2 y2 = 0

ఇది  ax2 + 2hxy + by2 = 0 రూపంలో ఉంది.

(ఇక్కడ l1 l2 = a, l1 m2 + l2 m1 = 2h , m1 m2 = b.)

ax2 + 2hxy + by2 = 0 ని రెండు ఏకఘాత కారణాంకాల లబ్దంగా రాస్తే

అంటే,  ax2 + 2hxy + by2 = 0 రెండు రేఖల్ని సూచిస్తే, ఆ రెండు రేఖల విడివిడి సమీకరణాలు 

           అవుతాయి.

గమనిక: (i) h2 = ab అయితే, ఆ రెండు రేఖలూ ఏకీభవిస్తాయి.

(ii)  h2 >  ab అయితే, ఆ రెండు రేఖలూ ఆదిబిందువు వద్ద ఖండించుకుంటాయి.

(iii) h2<  ab అయితే, అవి వాస్తవ రేఖల్ని సూచించవు.

అంటే h2 ab అవుతూ, a, h, b లు అన్నీ ఒకేసారి శూన్యంకాని సందర్భంలో ax2 + 2hxy + by2 = 0 సమీకరణం రేఖాయుగ్మాన్ని సూచిస్తుంది. 

ముఖ్య ఫలితం: ax2 + 2hxy + by2 = 0, సూచించే రెండు ఊర్ధ్వేతర రేఖల వాలులు m1, m2 లైతే 

ఉదా:  2x2 + 10xy - 7y2 = 0, రేఖా యుగ్మంలోని రేఖల వాలులు m1, m2 లైతే,

 రేఖాయుగ్మం మధ్యకోణం: ax2 + 2hxy + by2 = 0 సమీకరణం ఒక సరళరేఖా యుగ్మాన్ని సూచిస్తే వాటి మధ్య లఘుకోణం θ అయితే

   

గమనిక: 1.  θ = 90º అయితే, a + b = 0

             2.  θ = 0º అయితే, h2 = ab.

కోణాల సమద్విఖండన రేఖలు:

ఫలితం: రెండు రేఖలు a1x + b1y + c1 = 0 

                                a2x + b2y + c2 = 0

రేఖలకు, కోణ సమద్విఖండన రేఖల సమీకరణం

ఉదా: 3x + 4y + 1 = 0 మరియు 5x + 12y + 3 = 0 రేఖల కోణసమద్విఖండ రేఖల సమీకరణాలు కనుక్కోండి . 

ముఖ్య ఫలితం: ax2 + 2hxy + by2 = 0 రేఖల యుగ్మానికి, కోణసమద్విఖండ రేఖల సంయుక్త సమీకరణం

h(x2  - y2) - (a - b)xy = 0 అని నిరూపించవచ్చు.

సరళరేఖాయుగ్మం సాధారణ సమీకరణం:

రెండు దత్తరేఖల సమీకరణాలు   L1 = l1x + m1y + n1 = 0

                                               L2 = l2x + mxy + n2 = 0

అయితే, ఈ రేఖాయుగ్మ సంయుక్త సమీకరణం, L1 L2 = 0

అంటే,   ( l1x + m1y + n1) ( l2x + m2y + n2) = 0

(l1 l2)x2 + (l1m2 + l2m1) xy + m1m2y2 + (l1n2+l2n1)x + (m1n2 + m2n1)y + n1n2 =0

అంటే దీని సాధారణ రూపం,

ఇదిx, y లలో రెండో తరగతి సాధారణ సమీకరణం. ఇక్కడ    a = l1l2, 2h = (l1m2 + l2m1),

           b = m1m2

          2g = l1n2 + l2n1

          2f = m1n2 + m2n1

          c = n1n2

(1) S = ax2 + 2hxy + 6y2 + 2gx + 2fy + c = 0 అనే రెండో తరగతి సమీకరణం ఒక రేఖా యుగ్మాన్ని సూచిస్తే

(i) ∆ = abc + 2fgh -af2 -bg2 -ch2 = 0

(ii) f2 bc, g2 ca, h2 ab అని చూపవచ్చు.

(2) S = ax2 + 2hxy + by2 + 2gx + 2fy + c = 0  సమీకరణం రెండు సమాంతర రేఖలను సూచిస్తే

(i) h2 = ab       (ii) af2 = bg2

(3) S = ax2 + 2hxy + by2 + 2gx + 2fy + c = 0   రేఖాయుగ్మం ఖండన బిందువు

x, y లలో రెండోతరగతి సమీకరణాన్ని సూచించే వక్రాలు:

              కొన్ని నియమాలకు లోబడి,   x, y  లలో రెండోతరగతి సమీకరణం

s = ax2 + 2hxy + bg2 + 2gx + 2fy + c = 0, రేఖాయుగ్మాన్ని లేదా వృత్తాన్ని లేదా శాంకవాన్ని సూచించవచ్చు. లేదా ఏ వాస్తవ బిందుపథాన్నీ సూచించకపోవచ్చు.

  ఇప్పుడు, S = 0 సూచించే వక్రాన్ని (లేదా రేఖాయుగ్మాన్ని) ఒక దత్త సరళరేఖ ఖండించే బిందువులను మూల బిందువుకి కలిపితే వచ్చే రేఖాయుగ్మ సమీకరణాన్ని కనుక్కునే విధానాన్ని చర్చిద్దాం. 

కావాల్సిన రేఖాయుగ్మం ఆదిబిందువు ద్వారా పోతూ, ఇచ్చిన వక్రం, రేఖల ఉమ్మడి బిందువుల్ని తృప్తిపరుస్తుంది కాబట్టి ఇచ్చిన వక్రం సమీకరణాన్ని, రేఖా సమీకరణంతో సమఘాతపరచడం ద్వారా కావాల్సిన రేఖాయుగ్మ సమీకరణాన్ని పొందవచ్చు.

ఉదా: x2+y2 = 1, x + y = 1 ల ఖండన బిందువులను, మూలబిందువుతో కలిపితే వచ్చే సరళరేఖల సమీకరణాన్ని కనుక్కోండి.

Posted Date : 01-02-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌