• facebook
  • twitter
  • whatsapp
  • telegram

గురుత్వాకర్షణ

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

అతి స్వల్ప సమాధాన ప్రశ్నలు
1. ద్రవ్యరాశి, బరువుల్లో ఏది చరరాశి? కారణం ఏమిటి?
జ:  వస్తువులో ఉన్న ద్రవ్యపరిమణాన్ని ద్రవ్యరాశి అంటారు. వస్తువుపై పనిచేసే గురుత్వాకర్షణబలాన్ని భారం అంటారు. భారం 'g' పై ఆధార పడుతుంది. ఎత్తు, లోతు, అక్షాంశం, భూమి ఆకారంపైన g ఆధారపడుతుంది కాబట్టి భారం చరరాశి.


2. భూకేంద్రం వద్ద గురుత్వత్వరణం, వస్తుభారం ఎంత?
జ. 'd' లోతులో గురుత్వత్వరణం

           కాబట్టి భారం W = mgc =  m(0) = 0
          కాబట్టి భూకేంద్రం వద్ద రెండూ శూన్యమే. 

3. భూవాతావరణంతో పాలిస్తే సౌరవాతావరణంలో H2 అధికంగా ఉంటుంది. కారణమేంటి?
జ:  H2, N2, O2 అణువుల r.m.s. వేగాలు భూమి పరంగా ఉన్న వస్తు పలాయన వేగం కంటే తక్కువ. కాబట్టి H2తోపాటు N2, O2లు కూడా భూవాతావరణంలో ఉంటాయి. కానీ సౌరవాతావరణంలో N2, O2 అణువుల r.m.s వేగాలు సూర్యుని పరంగా ఉన్న వస్తు పలాయన వేగం కంటే ఎక్కువ. కాబట్టి ఇవి సౌరవాతావరణంలో ఉండవు. కాబట్టి సౌరవాతావరణంలో H2 శాతం అధికం.


4. కక్ష్యావేగం, పలాయన వేగాల మధ్య సంబంధాన్ని తెలపండి.
జ.  కక్ష్యావేగం  
   పలాయన వేగం  


 

ఒక  స్వల్ప సమాధాన ప్రశ్నలు

5. కక్ష్యావేగాన్ని నిర్వచించి దానికి సమీకరణాన్ని ఉత్పాదించండి.
జ. ఒక వస్తువు ఒక గ్రహం చుట్టూ నియమిత వృత్తాకార కక్ష్యలో పరిభ్రమించడానికి కావల్సిన క్షితిజ సమాంతర వేగాన్నే కక్ష్యావేగం 'vo' అంటారు.
 'm' ద్రవ్యరాశి ఉన్న ఒక వస్తువు 'M' ద్రవ్యరాశి, 'R' వ్యాసార్ధం ఉన్న ఒక గ్రహం చుట్టూ 'h' ఎత్తులో vo వేగంతో పరిభ్రమిస్తున్నట్త్లెతే దానిపై పనిచేసే అపకేంద్ర బలం
                                                              
 
ఇది గ్రహానికి, వస్తువుకు మధ్య ఉన్న గురుత్వాకర్షణబల పర్యవసానమే.  

                                            

6. పలాయన వేగాన్ని నిర్వచించి సమీకరణాన్ని ఉత్పాదించండి.

జ: ఒక వస్తువు గ్రహ గురుత్వాకర్షణ పరిధిని దాటి అంతరాళంలోకి ప్రవేశించేందుకు కావాల్సిన కనీస వేగాన్నే పలాయన వేగం అంటారు. 'm' ద్రవ్యరాశి ఉన్న వస్తువు 'M' ద్రవ్యరాశి 'R' వ్యాసార్ధమున్న ఒక గ్రహ ఉపరితలంపై ఉంది.  
                     


     
7.  భూఉపరితలం పై ఉండే గురుత్వ త్వరణంలో ఒక శాతం గురుత్వ త్వరణం ఉండాలంటే ఎంత లోతుకు వెళ్లాలి?

                    ... భూ ఉపరితలం నుంచి 4800 కి.మీ. లోతుకు వెళ్లాలి.

Posted Date : 28-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌