• facebook
  • twitter
  • whatsapp
  • telegram

 ఉష్ణగతిక శాస్త్రం

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

1.  రెండు వస్తువులు ఉష్ణశక్తిని వినిమయం చేసుకోవాలంటే, అవి తప్పకుండా ఒకదాన్నొకటి తాకే ఉండాలా?

జ: అవసరం లేదు. రెండు వస్తువుల మధ్య స్పర్శలేకపోయినా వికిరణ ప్రక్రియ ద్వారా అవి ఉష్ణశక్తిని వినిమయం చేసుకోగలవు.

2. ప్రాణంతో ఉన్న మొక్క ఏ వ్యవస్థకు ఉదాహరణ? వివృత (తెరచిన) వ్యవస్థకా లేక సంవృత (మూసిన) వ్యవస్థకా?

జ: ప్రాణం ఉన్న మొక్క వివృత (తెరచిన) వ్యవస్థకు ఉదాహరణ. అది ద్రవ్యాన్ని, శక్తిని పరిసరాలతో వినిమయం చేసుకుంటుంది కాబట్టి.

3. ఒక వ్యవస్థలోని ప్రవహించే ఉష్ణశక్తి, ఆ వ్యవస్థ ఉష్ణోగ్రతను పెంచకుండా దాని అంతరశక్తిని మాత్రమే పెంచగలదా?

జ: పెంచగలదు. ఉదా: ద్రవం మరిగే స్థితి, ఓ ఘనపదార్థం కరిగే స్థితి.

4. కొంత నియమిత ద్రవ్యరాశి ఉన్న ఆదర్శవాయువును వేడిచేస్తే, ఆ ఉష్ణశక్తి మొత్తం ఆ వాయువు అంతరశక్తిని పెంచడానికే వినియోగ పడింది. ఈ ప్రక్రియలో ఆ వాయువును స్థిర ఘనపరిమాణం వద్ద వేడిచేశారా? లేదా స్థిర పీడనం వద్దా?

జ: ఇక్కడ వాయువును స్థిర ఘనపరిమాణం వద్ద వేడి చేశారు. 

ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమం ప్రకారం ∆Q = ∆U + ∆W

ఇక్కడ ∆Q = ∆U ; అంటే ∆W  = 0. కాబట్టి వేడి చేస్తున్నంత సేపూ వాయువు ఘనపరిమాణం స్థిరంగా ఉందన్నమాట.

5. ఒక వ్యవస్థ దాని ఉష్ణోగ్రతలో ఏమాత్రం మార్పులేకుండా దాని పరిసరాలతో ఉష్ణశక్తిని మార్పిడి చేసుకుంటోంది. ఆ ప్రక్రియ ఏది?

జ: సమ ఉష్ణోగ్రతా ప్రక్రియ.

6. ఉష్ణగతిక శాస్త్ర మొదటి నియమాన్ని గణితాత్మకంగా నిర్వచించండి.

జ: ∆Q = ∆U + ∆W

7. స్థిరోష్ణక ప్రక్రియలో ఏ భౌతిక రాశి స్థిరంగా ఉంటుంది?        

జ: ఉష్ణశక్తి.
 

8. P, V ల మధ్య స్థిరోష్ణక సంబంధాన్ని తెలపండి.

జ: PVr = స్థిరాంకం.
 

9. సమ ఉష్ణోగ్రతా వ్యాకోచంలో స్థిరంగా ఉండే రాశి ఏది?

జ: ఉష్ణోగ్రత.

10. ఉష్ణగతిక శాస్త్ర శూన్య నియమాన్ని నిర్వచించండి.

జ: A, B అనే వ్యవస్థలు మూడో వ్యవస్థ C తో ఉష్ణ సమతాస్థితిలో ఉన్నాయనుకుంటే, A, B కూడా ఒక దానికొకటి ఉష్ణ సమతాస్థితిలోనే ఉంటాయి.

11. 'త్రిక బిందువు' అంటే ఏమిటి?

జ: ఒక పదార్థానికి చెందిన ఘన, ద్రవ, వాయు దశలు ఒకదానితో మరొకటి సమతాస్థితిలో ఉంటే.. దాని ఉష్ణోగ్రత, పీడనాల విశిష్ట కలయికను త్రికబిందువు అంటారు.

12. ఆవిరితో ప్రయాణించే ఓడ 88oC ల వద్ద ఉన్న 400 కిలో గ్రాముల నీటిని 8oC ఉష్ణోగ్రత ఉన్న సరస్సులోకి పోస్తే ఎంత ఉష్ణశక్తి వృథా అవుతుంది? నీటి విశిష్టోష్ణ సామర్థ్యం 4200  .

జ: వృథా అయిన ఉష్ణశక్తి = సరస్సులోకి పోసిన నీరు కోల్పోయిన ఉష్ణం.

 సరస్సులోకి పోసిన నీటి ద్రవ్యరాశి m = 400 కిలో గ్రాములు

 నీటి విశిష్టోష్ణ సామర్థ్యం S = 4200  

ఉష్ణోగ్రతలో తేడా ∆t = (88 - 8) = 80oC

నీరు కోల్పోయిన ఉష్ణం = ms∆t = 400 × 4200 × 80 = 1.34 × 108 J

13. ఒక జలపాతం ఎత్తు 50 మీ., దాని నీరు భూమిని తాకిన తర్వాత అందులోని స్థితిశక్తి మొత్తం ఉష్ణశక్తిగా మారితే, అప్పటి నీటి ఉష్ణోగ్రత ఎంత పెరుగుతుంది?  (Sనీరు = 4200 )

జ: స్థితిశక్తి = నీరు గ్రహించిన ఉష్ణశక్తి 

mgh = mS నీరు ∆t;  ∆t = ?

   

కాబట్టి నీటి ఉష్ణోగ్రత భూమిని తాకిన తర్వాత 0.12oC పెరుగుతుంది.

14. ఒక అట్మాస్ఫియర్ స్థిరపీడనం వద్ద ఒక వాయువు 300 CC మేర వ్యాకోచిస్తే జరిగిన పని ఎంత?

జ: జరిగిన పని W = Pdv

P = 1 atm = 76 cm of Hg = 1.01 × 105 pa

dv = 300 CC = 300 × 10-6 మీ3

 W = Pdv = 1.01 × 105 ×  300 × 10-6 = 30.2 J 

15. హైడ్రోజన్ వాయువు రెండు విశిష్ణోష్ణాలు 28.80 J mol-1 K-1, 20.56 J mol-1 K-1అయితే, R విలువ ఎంత?

జ: Cp = 28.80 J mol-1 K-1 , Cv = 20.56 J mol-1 K-1

 Cp - Cv = R అని మనకు తెలుసు.

  28.80 - 20.56 = R;    

   R = 8.24 J mol-1 K-1

16. 0oC వద్ద ఉన్న ఒక కిలోగ్రామ్ మంచుగడ్డను పూర్తిగా 100oC నీటి ఆవిరిగా మార్చడానికి ఎంత ఉష్ణశక్తి అవసరం?

    (Lమంచు = 3.35 × 105 J Kg-1,  Lనీటిఆవిరి = 2.26 × 106 J Kg-1,   Sనీరు = 4186 J Kg-1K-1)

జ: మంచుగడ్డను ఘనస్థితి నుంచి నీటి ఆవిరిగా మార్చడానికి కావాల్సిన ఉష్ణశక్తి Q అనుకోండి.

   ఘనస్థితి నుంచి మంచుగడ్డను నీటి ఆవిరి దశకు మార్చడానికి, 

   0oC వద్ద ఉన్న 1 కి.గ్రా. మంచుగడ్డ  0oC వద్ద ఉండే 1 కి. గ్రా. నీరు (స్థితిలో మార్పు) 

   0oC వద్ద ఉన్న 1 కి. గ్రా. నీరు  100oC వద్ద ఉండే 1 కి.గ్రా. నీరు (ఉష్ణోగ్రతలో మార్పు)

  100oC వద్ద ఉన్న 1 కి. గ్రా. నీరు  100oC వద్ద ఉండే 1 కి. గ్రా. నీటి ఆవిరి (స్థితిలో మార్పు)

  Q = mL మంచు + mS నీరు ∆t + mL నీటి ఆవిరి

  Q = 1 × 3.35 × 105 + 1 × 4186 × 100 + 1 × 2.26 × 106 = 3.016 × 106 J

17. ఒక వాయువు Cv ని ఆ వాయువు విశిష్టోష్ణాల నిష్పత్తి, వాయు విశ్వస్థిరాంక రూపంలో వెలిబుచ్చండి.

జ: Cp - Cv = R  అని,    అని మనకుతెలుసు.

   Cp =  rCv  

  Cp - Cv = rCv - Cv = R

 Cv ( r - 1) = R; లేదా   

18. ఒక వాయువు Cpని, ఆ వాయువు విశిష్టోష్ణాల నిష్పత్తిని వాయు స్థిరాంక రూపంలో వివరించండి.

జ: Cp - Cv = R  అని, అని మనకుతెలుసు

   

    C - Cv =  C-  = R

               =  Cp (1 - ) = R

              =  Cp  = R

            ​​​​​​

Posted Date : 23-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌