• facebook
  • twitter
  • whatsapp
  • telegram

స్టాయికియోమెట్రి

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

1. స్టాయికియోమెట్రి అంటే ఏమిటి?
జవాబు:  రసాయన చర్యలో క్రియాజనకాలు, క్రియాజన్యాల మధ్య ఉండే పరిమాణాత్మక సంబంధాన్నే స్టాయికియోమెట్రి అంటారు.


2. అననుపాత చర్య అంటే ఏమిటి?
జవాబు: ఒక చర్యలో ఒక మూలకం ఒకేసారి క్షయకరణం, ఆక్సీకరణం చెందడం. అంటే ఒకే మూలకం 3 రకాల విభిన్న ఆక్సీకరణ స్థితులను ప్రదర్శిస్తుంది. 
ఉదా: 3 Cl2 + 6 NaOH 
 5 NaCl + NaClO3 + 3 H2O

 

3. డేనియల్ ఘటంలోని ఎలక్ట్రోడ్ చర్యలను వివరించండి.
జవాబు: ఆనోడ్ వద్ద:  Zn
 Zn+2(జ.ద్రా) + 2e- (ఆక్సీకరణం)
       కాథోడ్ వద్ద: Cu+2(జ.ద్రా) + 2e- 
 Cu (క్షయకరణం)
       ఘట చర్య: Zn + Cu+2 (జ.ద్రా.)
  Zn+2 (జ.ద్రా.) + Cu (రిడాక్స్ చర్య)

4. (ఎ) MnO4- లో Mn (b)  K2Cr2O7  లో Cr ఆక్సీకరణ సంఖ్యలను లెక్కించండి.
జవాబు: (ఎ) x - 8 = -1       
 x = -1 + 8  =  +7
        (బి) 2(+1) + 2x + 7(-2) = 0   2x - 12 = 0   

  x = +6
 

5.  (ఎ) H3PO3     (బి) Na2CO3 ల తుల్యభారాలు తెలపండి.

6. 0.245 గ్రా KClO3 విఘటనం చెందితే వెలువడే O2 భారమెంత?
జవాబు: 2 KClO3 2 KCl + 3 O2
        2 × 122.5 గ్రా. -------------- 3 × 32 గ్రా.
       
  0.245 గ్రా ----------------- ?
          
          
7. 10 గ్రాముల CaCO3 ని వేడి చేస్తే వెలువడే CO2 ఘనపరిమాణం ఎంత ?
జవాబు: CaCO
  CaO + CO2
           100 గ్రా -------------------- 22.4 లీ. 
             10 గ్రా --------------------- ?

        

8. 100 గ్రా. ఎసిటలీన్‌ను పూర్తిగా (STP వద్ద) దహనం చెందించడానికి అవసరమైన ఆక్సిజన్ ఘనపరిమాణం ఎంత?
జవాబు: 2 C2H2 + 5 O2
 4 CO2 + 5 H2O
        2 × 22400 మి.లీ ------------ 5 × 22400 మి.లీ.
            100 మి.లీ ------------------- ?

         


         
9. 540 గ్రాముల గ్లూకోజ్‌లో ఎన్ని గ్లూకోజ్ అణువులు ఉన్నాయి? 
జవాబు: గ్లూకోజ్ అణువుల సంఖ్య =
  
 

10. ఒక సమ్మేళనం అనుభావిక ఫార్ములా CH2O. దాని అణుభారం 90. ఆ సమ్మేళనం అణు ఫార్ములాను లెక్కించండి.
జవాబు: అణుభారం = 90
అనుభావిక ఫార్ములా భారం (CH2O) = 12 + 1 + 1 + 16 = 30

   
  అణు ఫార్ములా = (అనుభావిక ఫార్ములా)n
               = (CH2O)3 = C3H6O3

11. రిడాక్స్ భావన అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జవాబు: ఒకే చర్యలో ఆక్సీకరణం, క్షయకరణం జరగడాన్ని రిడాక్స్ చర్య అంటారు.
ఉదా: S + O
S   O2
     0     0   +4    -2
S ఆక్సీకరణ స్థితి 0 నుంచి +4కు పెరగడం ఆక్సీకరణ చర్య.
O ఆక్సీకరణ స్థితి 0 నుంచి -2కు తగ్గడం క్షయకరణ చర్య.

 

12. భావసూచిక అంకెలు (Significant figures) అంటే ఏమిటి?
ఎ) 2.005 బి) 0.200లలో ఎన్ని భా
వసూచిక అంకెలు ఉన్నాయి?
జవాబు: వాస్తవికత ఉన్న అర్థవంతమైన అంకెలను 'భావసూచిక అంకెలు' అంటారు.
ఎ) 2.005లో నాలుగు భావసూచిక అంకెలు ఉన్నాయి. 
బి) 0.200లో మూడు భావసూచిక అంకెలు ఉన్నాయి.

 

13. 50 మి.లీ. 0.1 N ద్రావణానికి 150 మి.లీ. నీరు కలపగా ఏర్పడిన ఫలిత ద్రావణ నార్మాలిటీని లెక్కించండి.
జవాబు: విలీనానికి ముందు             విలీనం తర్వాత
       V1 = 50  మి.లీ.              V2 = 50 + 150 = 200 మి.లీ.
       N1 = 0.1 N                   N2 = ?
        V1N1 = V2N2       
             

14. కింది సమీకరణాన్ని అయాన్ - ఎలక్ట్రాన్ పద్ధతిలో ఆమ్లయానకంలో (అర్ధ చర్యావిధానం) తుల్యం చేయండి. 
          MnO4-  +  SO3-2   Mn+2 + SO4-2
జవాబు: MnO4- + SO3-2 Mn+2 + SO4-2
ఈ చర్యలో Mn ఆక్సీకరణ స్థితి + 7 (MnO4- లో) నుంచి +2 (Mn+2 లో)
కు తగ్గింది. కాబట్టి ఇది క్షయకరణ చర్య. మిగతా అర్ధచర్య ఆక్సీకరణ చర్య.

ఆక్సీకరణం, క్షయకరణం L.H.S. లను కలిపితే, ఆక్సీకరణం, క్షయకరణం R.H.S.లను కలిపితే ఒకే విధంగా ఉండే వాటిని ఒకేవైపు తీసుకువస్తే
 5SO3-2 + 5H2O + 2MnO4- + 16H+ 10e-  5SO4-2 + 10H+ + 2Mn+2 + 8H2O + 10e-

2MnO4- + 5SO3-2  +  6H+ 2Mn+2 + 5SO4-2 + 3H2O

15. కింది సమీకరణాన్ని అయాన్ - ఎలక్ట్రాన్ పద్ధతిలో క్షారయానకంలో తుల్యం చేయండి.
       
Cr(OH)3 + IO3-   CrO4-2 + I-
జవాబు: Cr(OH)3 + IO3-   CrO4-2 + I

ఈ చర్యలో I ఆక్సీకరణ స్థితి + 5 (IO-3 లో) నుంచి -1 (I- లో)కు తగ్గింది. కాబట్టి ఇది క్షయకరణ చర్య. మిగతా అర్ధ చర్య ఆక్సీకరణ చర్య.

ఆక్సీకరణం, క్షయకరణం L.H.S. లను కలిపితే, ఆక్సీకరణం, క్షయకరణం R.H.S.లను కలిపితే, ఒకే విధంగా ఉండే వాటిని ఒకేవైపు తీసుకువస్తే
 2Cr(OH)3  +  10OH-  +  IO3- + 3H2O + 6e- 2CrO4-2 + 8H2O + 6e- + I- + 6OH-                        

 2Cr(OH)3 + IO3- + 4OH- 2CrO4-2 + I- + 5H2O
 

16. ఒక కర్బన సమ్మేళనంలో 40% కార్బన్, 53.3% ఆక్సిజన్, 6.6% హైడ్రోజన్ ఉన్నాయి. దాని బాష్పసాంద్రత 90. దాని అణుఫార్ములాను కనుక్కోండి.
జవాబు: మొదట అన్ని మూలకాల శాతాల మొత్తం 100కి సరిపోయిందో లేదో సరిచూడాలి. సరిపోకపోతే ఆక్సిజన్ (మిగిలింది) శాతంగా భావించాలి (ఏ మూలకాన్ని చెప్పనప్పుడు మాత్రమే)
1. అన్ని మూలకాలను వాటి పరమాణు భారాలతో భాగిస్తే 

 C         H          O


             
2.    3.3     6.6     3.3
పై సంఖ్యలను చిన్న సంఖ్యతో భాగిస్తే 


1       2       1

  అనుభావిక ఫార్ములా  E.F.  =  CH2O      
అనుభావిక ఫార్ములా భారం = 12 + 2 + 16  =  30
అణుభారం = 2 × బాష్పసాంద్రత = 2 × 90 = 180 


  అణుఫార్ములా = (E.F) × n
= (CH2O) × 6  = C6H12O6

 

17. వివిధ రకాల రిడాక్స్ చర్యలను వివరించండి.
జవాబు: రసాయన సంయోగ చర్యలు: రెండు లేదా అంతకంటే ఎక్కువ పరమాణువులు లేదా అణువులు (మూలక స్థితిలో ఒకటి) కలిసి కొత్త అణువును ఏర్పరిచే చర్యలు.
ఉదా: S + O2  
 SO2
వినియోగ చర్యలు: ఒక అణువు రెండు లేదా అంతకంటే ఎక్కువ పరమాణువులు లేదా అణువులుగా (మూలక స్థితిలో ఒకటి) వియోగం చెందే చర్యలు.
ఉదా: 2H2 
  2H2 + O2

స్థానభ్రంశ చర్యలు: ఎక్కువ చర్యాశీలత ఉన్న పరమాణువులు (లేదా అయాన్) తక్కువ చర్యాశీలత ఉండే పరమాణువును స్థానభ్రంశం చెందించే చర్యలు.
ఉదా: CuSO4 + Zn 
 ZnSO4 + Cu
అననుపాత చర్యలు: క్షయాక్సీకరణ (Redox) చర్యల్లో ఒక మూలకం ఒకేసారి ఆక్సీకరణం, క్షయకరణం చెందే చర్యలు.
ఉదా: 3Cl2 + 6NaOH
 5NaCl + NaClO3 + 3H2O

 

18. ఒక కర్బన సమ్మేళన రసాయన విశ్లేషణలో 10.06% C, 0.84% H, 89.1% Cl (భారాత్మకంగా) ఉన్నాయి. ఆ సమ్మేళనం అనుభావిక ఫార్ములాను లెక్కించండి.

  అనుభావిక ఫార్ములా: CHCl3

19. 26.57% K, 35.36% Cr, 38.07% ఆక్సిజన్ ఉన్న సమ్మేళనపు అనుభావిక ఫార్ములాను లెక్కించండి.
జవాబు:


  అనుభావిక ఫార్ములా: K2Cr2O7

Posted Date : 03-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌