• facebook
  • twitter
  • whatsapp
  • telegram

హైడ్రోజన్, దాని సమ్మేళనాలు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

2 మార్కుల ప్రశ్నలు
1. అధిక ద్రవీభవన స్థానాలున్న లోహాలను వెల్డింగ్ చేయడానికి H2 ని ఎందుకు వాడతారు?
జ: వెల్డింగ్ చేయాల్సిన లోహంపై H పరమాణువులు సంయోగం చెంది 4000K వరకు ఉష్ణాన్ని వెలువరిస్తాయి. ఈ ఉష్ణోగ్రత లోహాలను ద్రవీకరించి, వెల్డింగ్ చేయడానికి ఉపయోగపడుతుంది.

2. 'సిన్‌గ్యాస్' పదాన్ని వివరించండి.
జ: జలవాయువు (CO, H2 ల మిశ్రమం) నుంచి CH3OH, అనేక హైడ్రోకార్బన్లను తయారు చేయవచ్చు. అందుకే జలవాయువును 'సిన్‌గ్యాస్' అని కూడా అంటారు.

3. 'కోల్ గ్యాసిఫికేషన్' అంటే ఏమిటి?
జ: బొగ్గు నుంచి సిన్‌గ్యాస్‌ని తయారు చేసే విధానాన్ని 'కోల్ గ్యాసిఫికేషన్' అంటారు.

                       
                       

4. 'స్వయం ప్రొటోలిసిస్' అంటే ఏమిటి?
జ: నీటి స్వయం అయనీకరణాన్ని 'స్వయం ప్రొటోలిసిస్' అంటారు.

H2O (ద్ర) + H2O (ద్ర)   H3O + (జ.ద్రా.)+ OH- (జ.ద్రా.)

5. NH3, H2O, HFల బాష్పీభవన స్థానాలు, ఆయా గ్రూపుల్లో వాటి తర్వాత మూలకాల హైడ్రైడ్ల బాష్పీభవన స్థానాల కంటే ఎక్కువగా ఉంటాయి. ఎందుకు?
జ: H, N, O, F ల మధ్య రుణ విద్యుదాత్మకత భేదం ఎక్కువగా ఉన్నందువల్ల, N, O, F లపై ఒంటరి జంటలున్నందువల్ల అంతరణుక హైడ్రోజన్ బంధాలు ఏర్పడి అణువులు దగ్గరగా వస్తాయి. దీనివల్ల వాటి బాష్పీభవన స్థానాలు ఎక్కువగా ఉంటాయి.

6. 'జలవాయు మార్పు (షిప్ట్) చర్య' అంటే ఏమిటి?
జ: CO, నీటి ఆవిరితో చర్యజరిపి, అధిక మొత్తంలో H2 ను ఉత్పత్తి చేయడాన్ని 'జలవాయు మార్పు (షిఫ్ట్) చర్య' అంటారు.

7. H2O2 ఉపయోగాలు నాలుగింటిని తెలపండి.
జ: * హరిత రసాయనశాస్త్రంలో
* కుళ్లు నివారిణి (యాంటీసెప్టిక్)గా
* వస్త్రాలకు విరంజనకారిణిగా
* ఔషధాల్లో ఉపయోగిస్తారు.

4 మార్కుల ప్రశ్నలు

1. భారజలంపై లఘువ్యాఖ్య రాయండి.
జ: దీని అణుఫార్ములా D2O. 0.5 M NaOH ద్రావణాన్ని 7 దశల్లో సుదీర్ఘ విద్యుద్విశ్లేషణం చేస్తే D2O వస్తుంది. దీని ద్రవీభవన స్థానం 276.8 K. బాష్పీభవన స్థానం 374.4 K. D2O చర్యాశీలత నీటికంటే తక్కువ. దీని స్నిగ్ధత H2O కంటే ఎక్కువ. న్యూక్లియర్ రియాక్టర్లలో మితకారిగా, చర్యావిధాన అధ్యయనంలో వినిమయ కారకం (ట్రేసర్)గా ఉపయోగిస్తారు.

2.  కింది చర్యల్ని పూరించి, తుల్యం చెయ్యండి
i) PbS + H2O2
             ii) MnO4- + H2O2  
iii) CaO + H2            iv) Ca3N2 + H2O  

జ: i) PbS + 4 H2O2   PbSO4 + 4 H2O (ఆక్సీకరణం)
ii) 2 MnO4- + 5 H2O2 + 6 H+
  Mn+2 + 8 H2O + 5 O2 (క్షయకరణం)
iii) CaO + H2
   Ca(OH)2 (ఆర్ద్రీకరణం)
iv) Ca3N2 + 3 H2O
  3 Ca(OH)2 + 2 NH3 (జలవిశ్లేషణం)

3. H2O2 ఆక్సీకరణిగా, క్షయకరణిగా పని చేయగలదని తెలిపే రసాయ చర్యలను రాసి, సమర్థించండి.
జ: ఆక్సీకరణ ధర్మాలు: H2O2, PbSని PbSO4 గా ఆక్సీకరణం చేస్తుంది.
PbS + 4 H2O2
  PbSO4 + 4 H2O
H2O2, Mn+2ను  Mn+4 గా ఆక్సీకరణం చేస్తుంది.
Mn+4 + H2O2
  Mn+4 + 2 OH-

క్షయకరణ ధర్మాలు: H2O2, HOClను  Cl- గా క్షయకరణం చేస్తుంది.
HOCl + H2O2  H3O+ + Cl- + O2
H2O2, I2 ను I- గా క్షయకరణం చేస్తుంది.
2 OH+ I2 + H2O2  2 I- + 2 H2O + O2

4. మీరు H2O2 గాఢతను ఎన్ని రకాలుగా చెప్పగలరు? 15 ఘనపరిమాణాల H2O2 గాఢతను గ్రా/ లీ., నార్మాలిటీ, మొలారిటీల్లో లెక్కించండి.
జ: 
 2 H2O2 

 2 H2O + O2
2 × 34 g ........................ 22.4 లీ.
? ............................. 15 లీ.


Posted Date : 03-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌