• facebook
  • twitter
  • whatsapp
  • telegram

S - బ్లాకు మూలకాలు

 Li, Na, K, Rb, Cs ఆక్సైడ్‌లు నీటిలో కరిగి బలమైన క్షారాలను ఇస్తాయి. అందుకే వీటిని క్షారలోహాలు అంటారు. వీటి బాహ్యస్థాయి ఎలక్ట్రాన్ విన్యాసం ns1, ఇవి ప్రదర్శించే ఆక్సీకరణ స్థితి +1. చర్యాశీలత ఎక్కువగా ఉండటం వల్ల ఇవి స్వేచ్ఛాస్థితిలో దొరకవు. ఇవి మృదు లోహాలు. తక్కువ సాంద్రత, ద్రవీభవన, బాష్పీభవన స్థానాలు, అయోనైజేషన్ పొటెన్షియల్, ఎలక్ట్రాన్ ఎఫినిటి, రుణవిద్యుదాత్మకత ఉంటాయి. అధిక ధన విద్యుదాత్మకత, లోహ స్వభావం కలిగి ఉంటాయి. Li నుంచి Cs కు సాంద్రత పెరుగుతుంది. కానీ K సాంద్రత Na సాంద్రత కంటే తక్కువ. K పరమాణు పరిమాణం అనూహ్యంగా పెరగడం, ఖాళీ 3d ఉపస్థాయి, స్ఫటికజాలకంలో పరమాణువుల మధ్య దూరం ఎక్కువగా ఉండటమే దీనికి కారణం. ఈ లోహాలను కాంతిలో ఉంచినప్పుడు కాంతి విద్యుత్ ఫలితాన్ని (ఎలక్ట్రాన్‌లు విడుదలవడం వల్ల) ప్రదర్శిస్తాయి. ఈ లోహాలను జ్వాలలో ఉంచితే వేర్వేరు రంగులను ఇస్తాయి (ఎలక్ట్రాన్లు ఉద్రిక్త స్థాయికి వెళ్లి తిరిగి రావడం వల్ల). జ్వాలలో Li కెంపు రంగును, Na బంగారు పసిడి రంగును, K, Rb, Cs లు ఊదా రంగును ఇస్తాయి. ఫొటోమెట్రీ, పరమాణు శోషణవర్ణ పట విశ్లేషణల ద్వారా క్షారలోహాలను పరీక్షించవచ్చు.
ఈ అయాన్ల ఆర్ధ్రీకరణ తీవ్రతా క్రమం: Li+ > Na+ > K+ > Rb+ > Cs+
నీటిలో వీటి విద్యుద్వాహకతా క్రమం: Li+ < Na+ < K+ < Rb+ < Cs+

హైడ్రైడ్ల అయానిక స్వభావ క్రమం:  CsH > RbH > KH > NaH > LiH
          Li మినహా మిగతా మూలకాలు అయానిక హైడ్రైడ్‌లను ఇస్తాయి. Na నీటితో ఉద్ధృతంగా చర్య జరిపి H2 ను ఇచ్చి చివరకు మండుతుంది. చిన్న పరమాణు పరిమాణం, అధిక రుణ విద్యుదాత్మకత,  d ఆర్బిటాళ్లు లేకపోవడంవల్ల Li ప్రవర్తన మిగిలిన మూలకాల కంటే భిన్నంగా ఉంటుంది. Li మాత్రమే కార్బైడ్‌లు, నైట్రైడ్‌లను ఇస్తుంది. మిగతావాటికంటే చాలా గట్టిగా ఉండటంవల్ల వీటి హైడ్రాక్సైడ్, కార్బొనేట్, ఫాస్ఫేట్, ఫ్లోరైడ్‌ల ద్రావణీయత చాలా తక్కువగా ఉంటుంది. Li, Mgలకు  ఒకే పరమాణు పరిమాణం, ఒకే రుణవిద్యుదాత్మకత, ఒకే ధ్రువణ సామర్థ్యం ఉండటంవల్ల Li, Mg తో కర్ణ సంబంధాన్ని కలిగి ఉంటుంది. ఈ రెండూ నీటితో నెమ్మదిగా చర్య జరిపి నైట్రైడ్‌లు, మోనాక్సైడ్‌లను ఇస్తాయి. వీటి హాలైడ్‌లకు సమయోజనీయ, ఆర్ధ్రీకరణ స్వభావాలు ఉంటాయి. వీటి కార్బొనేట్లు, ఫాస్ఫేట్లు నీటిలో కొద్దిగా కరుగుతాయి.
          కర్బన రసాయన చర్యల్లో (వుర్ట్‌జ్ చర్య)లో Na ను కారకంగా, రబ్బరు తయారీలో ఉత్ప్రేరకంగా, సోడియం అమాల్గం తయారీలో, లెసైన్ పరీక్ష (S, N, హాలోజన్లను గుర్తించడానికి ఉపయోగిస్తారు.) K ను నిల్వచేసే బ్యాటరీలు, మృదువైన సబ్బుల తయారీ, కాంతి విద్యుత్ ఘటాల్లో వాడతారు. కణంలో ద్రవాభిసరణ పీడనాన్ని నిలకడగా ఉంచడానికి  Na+,K+లు సహాయపడతాయి. ఎంజైమ్‌లు ఉత్తేజితం కావడానికి, ప్రొటీన్ల సంశ్లేషణ, గ్లూకోజ్ జీవక్రియలు, కణాల్లో విద్యుత్ శక్మాన్ని కలిగించడం, కణాల నుంచి Na+ అయాన్‌లను బహిష్కృతం చేయడం (సోడియం పంప్)లో ఈ అయాన్ల పాత్ర అమోఘం. NaCl ను ఆహారం, పచ్చళ్లు, చేపలు, మాంసం నిల్వ చేయడానికి వాడతారు.

ఐస్‌తో కలిపి మంచు మిశ్రమం; NaCl2 తయారీలో ఉపయోగిస్తారు. 
          Na మరో ముఖ్య సమ్మేళనం NaOH . ఇది చర్మంపై పడితే కండర ప్రొటీన్లను ముద్దగా మారుస్తుంది. అందుకే దీనిని 'కాస్టిక్ సోడా' అని కూడా పిలుస్తారు. ఎలక్ట్రికల్ జనరేటర్ల వద్ద SO2 ని శోషించడానికి, నూలును మెర్సిరైజ్ చేయడానికి, పెట్రోలియం శుద్ధి చేయడానికి, సబ్బు, కాగితం, రేయాన్ పరిశ్రమల్లో NaOH ఉపయోగిస్తారు.
NaOH తయారు చేసే పద్ధతులు:
 కాస్టిసైజింగ్ (గోసెజ్) పద్ధతి: ఈ పద్ధతిలో NaOH ని పొందడానికి సున్నపుతేటకు 10% గోరువెచ్చటి Na2CO3 ద్రావణాన్ని కలుపుతారు.
                  Ca(OH)2 + Na2CO3   CaCO3+ 2NaOH

కాస్ట్నర్- కెల్నర్ (మెర్క్యురీ కాథోడ్) పద్ధతి: ఈ ఘటంలో దీర్ఘచతురస్రాకార ఇనుప తొట్టిని రెండు పలక విభాజకాల సాయంతో మూడు గదులుగా చేస్తారు. వీటిని తొట్టి అడుగున ఉన్న మెర్క్యురీ (Hg) లోకి దించుతారు. Hg మధ్యస్థ ఎలక్ట్రోడ్‌గా (ప్రేరణ ప్రభావం మూలంగా) పనిచేస్తుంది. బయటి గదుల్లో Hg కాథోడ్‌గా పనిచేస్తుంది. ఈ గదుల్లో బ్రైన్ ద్రావణంలో గ్రాఫైట్ ఆనోడ్‌లను తీసుకుంటారు. ఈ గదుల్లో జరిగే చర్యలు:
                            2NaCl     2Na++ 2C-
      ఆనోడ్ వద్ద:      2C- Cl2+ 2e- (ఆక్సీకరణం)

  కాథోడ్ వద్ద:     2Na++ 2e- + Hg   Na2Hg (క్షయకరణం)

మధ్య గదిలో ఇనుప కడ్డీల గుత్తి (కాథోడ్), విలీన NaOH ద్రావణాన్ని తీసుకుంటారు. ఇక్కడ Hg ఆనోడ్‌గా పనిచేస్తుంది. ఉత్కేంద్ర చక్రంపై ఘటాన్ని ముందుకి, వెనక్కి కదిపినప్పుడు బయట గదుల్లో ఏర్పడిన Na2Hg మధ్య గదిలోకి పోగవుతుంది.
ఈ గదిలో జరిగే చర్యలు:    
ఆనోడ్ వద్ద: 
 Na2Hg    2Na++ 2e -+ Hg (ఆక్సీకరణం)
కాథోడ్ వద్ద:       2H2O + 2e-     H2+ 2OH - (క్షయకరణం)
2Na++ 2OH -    2NaOH

ద్రావణ గాఢత 20%కి చేరాక దీన్ని ఇనుప కళాయిల్లో 500 ºC వద్ద ఇగిర్చి ఘన రూపంలో ఉండే NaOHని పొందుతారు.

NaOH ధర్మాలు: ఇది తెల్లటి, స్ఫటిక, ఉదగ్రాహక పదార్థం. దీని ద్రవీభవన స్థానం: 519 K.
ఇది NaOH. xH2O (x 1, 2, 7). CO2 ని గ్రహిస్తుంది.
  Zn, Al, C, Si లు NaOH లో H2 ను స్థానభ్రంశం చేస్తాయి. 
  Zn + 2NaOH      Na2ZnO2(సోడియం జింకేట్) + H2 
2Al + 6NaOH      2Na3 AlO3(సోడియం అల్యూమినేట్) + 3 H2 
2C + 6NaOH  

  2 Na + 2Na + 2NaCO3 + 3H2 
Si + 2NaOH +H2O      Na2SiCO+ 2 H2 
అమ్మోనియం లవణాలతో చర్య జరిపి NH3 ని ఇస్తుంది.
NH4C+ NaOH      NaC+ H2O + NH3
 

హాలోజన్లతో చర్య: 
2 NaOH (చల్లటి, విలీన) + 2F2    2 NaF + OF2 + H2
4 NaOH (గాఢ, వేడి) + 2 F2    4 NaF + O2 + 2 H2O
Cl2 + 2 NaOH (చల్లటి, విలీన)  NaC+ NaOC(సోడియం హైపోక్లోరైట్) + H2O
3 Cl2 + 6 NaOH (గాఢ, వేడి)    5 NaC+ NaClO3(సోడియం క్లోరేట్) + 3H2O

ఇతర చర్యలు:
4 S + 6 NaOH     Na2S2O3 + 2 Na2S + 3 H2O
4P + 3NaOH + 3H2O  

 3 NaH2PO2(సోడియం హైఫోపాస్ఫైట్) + PH3
2 NaOH  + CO2     Na2CO3 + H2O
3 NaOH + FeCl3    Fe(OH)3 (ఎరుపు - జేగురు అవక్షేపం) + 3 NaCl
2 NaOH + FeSO4 
 Fe(OH)2(లేత ఆకుపచ్చ అవక్షేపం) + Na2SO4
ZnSO4 + 2 NaOH  
  Na2SO4 + Zn(OH)2
Zn(OH)2 + 2 NaOH (అధికంగా)  
 Na2ZnO2  (కరుగుతుంది) + 2 H2O
AlCl3 + 3 NaOH  
  Al(OH)3 + 3 NaCl
Al(OH)3 + NaOH (అధికంగా)  
  NaAlO2(సోడియం మెటాఅల్యూమినేట్ - కరుగుతుంది) + 2 H2O
NaOH + HC
 NaC+ H2O
2 AgNO3 + 2 NaOH 
  2 AgOH + 2 NaNO3
2 AgOH  
 Ag2O + H2O
 

సోడియం కార్బొనేట్
Na2CO3. 10 H2O ని చాకలి (వాషింగ్) సోడా అని, Na2CO3  ని 'సోడాభస్మం' అని అంటారు. 
దీనిని లెబ్లాంక్, సాల్వే పద్ధతుల్లో తయారు చేస్తారు.
లెబ్లాంక్ పద్ధతి:  
NaCl  గాఢ H2SO4  , సున్నపు రాయి చర్య జరిపి Na2CO3  ని ఇస్తాయి.  
NaC + H2SO  NaHSO4 + HCl
NaHSO4 + NaCl   HC+ Na2SO4
Na2SO4 + 4 C   Na2S + 4 CO
Na2S + CaCO3   Na2CO+ CaS
                                   నల్లటి భస్మం
ఈ పద్ధతిలో  HCl, Na2S  లు ముఖ్య సహజనితాలు.

 

సాల్వే (అమ్మోనియా-సోడా) పద్ధతి:
ఈ పద్ధతిలో మొత్తం 5 దశలున్నాయి.
1వ దశ: బ్రైన్‌ను NH3 తో సంతృప్తిపరచడం: 30% బ్రైన్ ద్రావణాన్ని NH3, కొద్ది CO2 తో సంతృప్తిపరుస్తారు. 
* Mg, Fe, Ca మలినాలను తొలగిస్తారు.
NH3 + H2 NH4OH
2 NH3 + H2O + CO2 (NH4)2CO3

CaCl2 + 2 NH4OH  Ca(OH)2 ↓ + 2 NH4Cl 
CaCl2 + (NH4)2CO3   CaCO3 ↓ + 2 NH4Cl
2వ దశ: కార్బొనేషన్ మొదటి దశలోని బ్రైన్, CO2 కలిసి సోడియం బైకార్బొనేట్‌ను ఏర్పరుస్తాయ
NH3 + CO2 + H2 NH4HCO3
NH4HCO3 + NaC NaHCO3 + NH4Cl

3వ దశ:  వడపోత రోటరీ వాక్యూమ్ ఫిల్టర్ ద్వారా NaHCO3  ని వేరుచేసి మిగతా గాలిత ద్రవాన్ని అమ్మోనియా పునరుత్పాదన శిఖరంలోకి పంపిస్తారు
4వ దశ: అమ్మోనియా పునరుత్పాదన  గాలిత ద్రవానికి Ca(OH)2  ని కలిపి నీటి ఆవిరిని పంపితే NH3 వస్తుం
NH4 HCO3    NH3 + H2O + CO2
2 NH4C+ Ca(OH)2    2 NH3 + CaCl2 + 2H2O

5వ దశ: భస్మీకరణం
NaHCO ని భస్మీకరణం చేస్తే  Na2CO3 వస్తుంది. 
2 NaHCO3  Na2CO3 + CO2 + H2O

Na2CO3 ధర్మాలు:
ఇది తెల్లటి, స్ఫటిక, ఉదత్యాగ పదార్థం. దీని ద్రవీభవనస్థానం: 1125 K. 
* ఇది నీటిలో కరిగి ఆనయాన్ జలవిశ్లేషణ చెంది, క్షార ద్రావణాన్ని ఇస్తుంది.  
CO3 -2 + 2 H2H2CO3 + 2 OH -
ఆమ్లాలు Na2CO3  నుంచి CO2  ను విడుదల చేస్తాయి. "
* ఇది S, SO2 లతో చర్యజరిపి Na2SO3 ని SiO2 తో చర్య జరిపి Na2SiO3 ని ఇస్తుంది.

ఉపయోగాలు: నీటి కాఠిన్యతను తొలగించడానికి; గుణాత్మక, పరిమాణాత్మక విశ్లేషణలో; పెట్రోలియం శుద్ధిలో; గాజు, రంగులు, కాగితం పరిశ్రమలు, లాండ్రీల్లో; ''అల్ట్రామెరైన్'' (వర్ణదంగా వాడే అల్యూమినో సిలికేట్‌ను అల్ట్రామెరైన్ అంటారు
ఉదా: సోడాలైట్ - Na3(AlO2)6 (SiO2)6 Cl2) ద్రవీభవన మిశ్రమాల (Na2CO3+ K2CO3) తయారీలో; Na2CO3 ని ఉపయోగిస్తారు.

 

సోడియం బైకార్బొనేట్

ఇది తెల్లటి స్ఫటిక పదార్థం. ఫినాప్తలిన్‌తో ఎలాంటి రంగు ఇవ్వదు. కానీ మిథైల్ ఆరెంజ్ సూచీ ద్రావణంతో పింక్ రంగు ఇస్తుంది. దీన్ని ఆమ్ల నిరోధి(Antacid) గా; అగ్నిమాపక యంత్రాల్లోనూ, కేకుల్ని బేకింగ్ చేయడానికి, బుసబుసమంటూ పొంగే పానీయాల తయారీలో,  వంటకాల్లో బేకింగ్ పౌడర్‌గా, ప్రయోగశాలలో క్షారంగా దీన్ని ఉపయోగిస్తారు. 
 

క్షారమృత్తిక లోహాలు

Mg, Ca, Ba, Sr, Ra  (Be మినహా ల ఆక్సైడ్‌లు, హైడ్రాక్సైడ్‌లు క్షార ధర్మాన్ని కలిగి ఉంటాయి. వీటి ఆక్సైడ్‌లు భూమిలో రాతి పైపొరల్లో లభించడం వల్ల వీటిని క్షార మృత్తికలోహాలు అంటారు. 
* వీటి సాధారణ ఎలక్ట్రాన్ విన్యాసం ns2. ప్రదర్శించే ఆక్సీకరణ స్థితి +2. Ca ఇటుక ఎరుపు, Ba ఆపిల్ ఆకుపచ్చ, Sr కెంపు రంగు జ్వాలను ఇస్తాయి.
* Ba కు బెరైల్ (3 BeO. Al2O3.6SiO2), ఫినసైట్ (2 BeO. SiO2),  Ca కు డోలమైట్ (CaCO3.MgCO3) , జిప్సం (CaSO4 . 2 H2O),  Sr కు సెలెస్త్టెట్(SrSO4) , స్ట్రాన్షియనైట్ (SrCO3), Ba కు బెరైటీస్ (BaSO4) , విదరైట్ (BaCO3), Mg కు మాగ్నసైట్ (MgCO3), కార్నలైట్ (KCl.MgCl2.6H2O)  లు ముఖ్యమైన ధాతువులు.

క్షారమృత్తిక లోహ సమ్మేళనాల ధర్మాలు:
BeO, Be(OH)2లకు ద్విస్వభావ గుణం ఉంది (ఆమ్లాలు, క్షారాలతో చర్య జరుపుతాయి). ఉష్ణ స్థిరత్వం, ద్రావణీయత Mg(OH)2 నుంచి Be(OH)2కు పెరుగుతాయి. Be హాలైడ్‌లకు సమయోజనీయ స్వభావం, మిగతా హాలైడ్‌లకు అయానిక స్వభావం ఉంటుంది. ఈ గ్రూపునకు చెందిన కార్బొనేట్‌లు నీటిలో కరగవు. వీటిని వేడి చేసినప్పుడు విఘటనం చెందుతాయి. BeSO4, MgSO4 నీటిలో కరుగుతాయి. క్షారమృత్తిక లోహాల కార్బొనేట్‌లు, సల్ఫేట్‌ల ద్రావణీయత, హైడ్రేషన్ ఎంథాల్పీలు గ్రూపులో పైనుంచి కిందికి తగ్గుతాయి.

 

బెరీలియం అసంగత ప్రవృత్తి:
Be  కి ఉండే చిన్న పరమాణు పరిమాణం, అధిక రుణ విద్యుదాత్మకతల కారణంగా ఇది సమయోజనీయ సమ్మేళనాలను ఏర్పరుస్తుంది. పొడిగాలితో చర్య జరపకపోవడం, ద్వంద్వ స్వభావం, జ్వాల పరీక్షను ఇవ్వకపోవడం, సంశ్లిష్ట సమ్మేళనాలను ఏర్పరచడం, అత్యధిక సంయోజకత 4 (మిగతావాటికి 6) ప్రదర్శించడం... ఇవన్నీ అసంగత ధర్మాలే!

 

Al తో కర్ణసంబంధం
Be, Al  రెండూ సమయోజనీయ సమ్మేళనాలను ఏర్పరుస్తాయి. జల విశ్లేషణ చెందుతాయి. సంశ్లిష్ట సమ్మేళనాలను ఇస్తాయి. గాఢ HNO3  తో చర్యాశీలత కోల్పోతాయి. Be, Al, Fe, Cr  లు గాఢ HNO3  తో మొదట చర్య జరిపి తర్వాత రసాయన చర్యాశీలత కోల్పోవడాన్ని ''క్రియా రాహిత్యం'' అంటారు. Be, Al లు ద్విస్వభావ మూలకాలు. వీటి కార్బైడ్‌లను జలవిశ్లేషణ చేస్తే ''మీథేన్'' వాయువు వస్తుంది. అందువల్ల వీటిని ''మిథనైడ్‌లు'' అంటారు
Be2C + 4 H2O  2 Be (OH)2 + CH4
Al4C3 + 12 H2O  4 Al(OH)3 + 3 CH4
కానీ CaC2  ఎసిటలైడ్  [CaC2 + 2 H2O  C2H2 + Ca(OH)2]
II A మూలకాలు H2  తో చర్య జరిపి అయానిక హైడ్రైడ్‌లను ఇస్తాయి.

 

హైడ్రైడ్‌ల అయానిక స్వభావం: 
BaH2 > SrH2 > CaH2 > MgH2 > BeH2. Be సమయోజనీయ, ఉదగ్రాహక, గాలిలో పొగలు ఎగజిమ్మే హాలైడ్‌లను ఇస్తుంది. మిగతా మూలకాలు అయానిక హాలైడ్‌లను ఇస్తాయి. Be ని నియాన్ దీపాల్లో ఎలక్ట్రోడ్‌లు; కాపర్ మిశ్రమ లోహాలను తయారీలో ఉపయోగిస్తారు. Mg ని క్షయకరణిగా, లోహ నిష్కర్షణలో ఆక్సిజన్‌ను తొలగించడానికి, ఎలక్ట్రాన్ మాగ్నాలియం లాంటి మిశ్రమ లోహాలను తయారు చేయడానికి వాడతారు.

 

కాల్షియం సమ్మేళనాలు:
CaO  ని 'క్విక్‌లైమ్' అని, Ca(OH)2   ని తడి సున్నం (Slaked lime)  అని, CaSO4 . 2 H2O  ని 'జిప్సం' అని, CaSO4 . 1/2H2O  ని 'ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్' అని అంటారు. ఒక భాగం తడి సున్నం, మూడు భాగాలు ఇసుక, నీరు కలిసిన మిశ్రమాన్ని 'మోర్టార్' అంటారు. మెర్టార్, సిమెంట్ మిశ్రమాన్ని 'సిమెంట్ మోర్టార్'గా పిలుస్తారు. మోర్టార్‌లోని ఇసుక సచ్ఛిద్రం చేయడంతో పాటు పగుళ్లను అరికట్టి నెమ్మదిగా గట్టిపడుతుంది
Ca(OH)2 + SiO2    CaSiO3 + H2O
సున్నపురాయిని బంకమట్టితో కలిపి వేడిచేస్తే 'హైడ్రాలిక్ మోర్టార్' వస్తుంది. ఇది విరంజనకారిగా, యాంటీసెప్టిక్‌గా పనిచేస్తుంది. జిప్సంను 393 K  వరకు వేడిచేస్తే అది 'ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్'ను, ఇంతకు మించి వేడిచేస్తే 'బాగా మాడ్చిన' CaSO4  ఇస్తాయి.

CaSO4 . 2 H2O    CaSO4 . 2 H2O
 విషమలంబాక్ష డైహైడ్రేట్        ఏకనతాక్ష డైహైడ్రేట్
      ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్‌ను నిర్మాణ పరిశ్రమలో, బెణుకులు, విరిగిన ఎముకలపై కట్టుగా; పంటి వైద్యం; ఆభరణాల పనిలో, విగ్రహాలు తయారుచేసే అచ్చుల్లోనూ ఉపయోగిస్తారు. జిప్సం (2 - 3 %) ను సిమెంట్‌కి కలిపి త్వరగా గట్టిపడకుండా చేస్తారు
జీవశాస్త్రంలో Ca, Mg  ల ప్రాముఖ్యత
పెద్దవారి శరీరంలో 1200 గ్రాముల Ca, 25 గ్రాముల Mg  ఉంటాయి.
Ca+2 పాత్ర: కండరాల సంకోచానికి, గుండె క్రమంగా కొట్టుకోవడానికి, రక్తం గడ్డ కట్టడానికి, ఎముకలు, పళ్లు ఏర్పడేందుకు Ca+2  చాలా ముఖ్యం
Mg+2  పాత్ర: మొక్క ఆకుల పత్రహరితంలో, ATP చర్యల్లో, జంతుకణాల్లో ఫాస్ఫోట్రాన్స్‌ఫరేజ్, ఫాస్ఫో హైడ్రోలేజ్ ఎంజైమ్‌ల్లో Mg+2  పాత్ర అమోఘం. 

సిమెంట్: నిర్మాణాలకు ముఖ్యమైన పదార్థం సిమెంట్. దీన్ని జోసఫ్ ఆస్పిడిన్ మొదటగా ప్రవేశపెట్టాడు.

సిమెంట్ సగటు సంఘటనం:
CaO : 50 - 60%
SiO2 : 20 - 25%
Al2O3 : 5 - 10%
MgO : 2 - 3%
Fe2O3 : 1 - 2%
SO3 : 1 - 2%

నాణ్యమైన సిమెంట్‌లో సిలికా, అల్యూమినా నిష్పత్తి 2.5 నుంచి 4.0 మధ్య ఉండాలి. సున్నం, బంకమట్టి మిశ్రమాన్ని బాగా వేడిచేస్తే 'క్లింకర్' అనే గట్టి పదార్థం ఏర్పడుతుంది. క్లింకర్‌కు 2-3% జిప్సమ్ కలిపితే సిమెంట్ వస్తుంది. సిమెంట్‌ను కాంక్రీట్, గచ్చు (ప్లాస్టరింగ్) చేయడానికి, ఆనకట్టలు, వంతెనలు, రోడ్లు, సొరంగాల నిర్మాణాల్లో వాడతారు.

Posted Date : 03-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌