• facebook
  • twitter
  • whatsapp
  • telegram

s - బ్లాకు మూలకాలు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

4 మార్కుల ప్రశ్నలు

1. కాష్ట్నర్ - కెల్నర్ పద్ధతిని రాసి, అందులో ఉన్న సూత్రాన్ని తెలపండి.
జవాబు: ఈ విధానాన్ని మెర్క్యురీ కాథోడ్ పద్ధతి అని కూడా అంటారు. ఇక్కడ మెర్క్యురీ తటస్థ కాథోడ్‌గా వ్యవహరిస్తుంది. ఈ ఘటంలో రెండు వెలుపలి గదులు ఉంటాయి. వీటిలో గ్రాఫైట్ కడ్డీ ఆనోడ్‌గా, మెర్క్యురీ కాథోడ్‌గా, బ్రైన్ ద్రావణం విద్యుద్విశ్లేషకంగా ఉంటాయి.
ఇక్కడ జరిగే చర్యలు: 2 NaCl
  2 Na+ + 2 Cl-
గ్రాఫైట్ ఆనోడ్ వద్ద: 2 Cl-
  Cl2 + 2 e-
మెర్క్యురీ కాథోడ్ వద్ద: 2 Na+ + 2 e- + Hg
  Na2Hg
మధ్య గదిలో సజల NaOHను బీజాంకుర కారకంగా (Seeding agent), మెర్క్యురీని ఆనోడ్‌గా, ఇనుపకడ్డీలను కాథోడ్‌గా తీసుకుంటారు.

ఇక్కడ జరిగే చర్యలు
మెర్క్యురీ ఆనోడ్ వద్ద:
Na2Hg
   2 Na+ + 2e- + Hg
ఇనుము కాథోడ్ వద్ద: 2 H2O + 2 e-
  2 OH- + H2
2 Na+ + 2 OH-

  2 NaOH
ఈ పద్ధతిలో బ్రైన్ ద్రావణాన్ని విద్యుద్విశ్లేషణం చేసి NaOHను తయారుచేస్తారు.

2. సాల్వే పద్ధతిలో జరిగే చర్యలను చర్చించండి.
జవాబు:  సాల్వే పద్ధతిలో Na2CO3ను తయారుచేస్తారు. ఈ పద్ధతిలో అమ్మోనియా, సున్నపురాయి, బ్రైన్ ద్రావణాలు ముడి పదార్థాలు.
¤ బ్రైన్‌ను NH3తో సంతృప్తపరచడం
2 NH3 + H2O + CO2 
 (NH4)2CO3

¤ అమ్మోనికల్ బ్రైన్‌ను కార్బొనేషన్ చేయడం
NH3 + H2O + CO2
  NH4HCO3
NH4HCO3 + NaCl
  NaHCO3 + NH4Cl

NaHCO3ను వడపోయడం, వేడి చేయడం:
 2 NaHCO3
  Na2CO3 + CO2 + H2O
NH3ను తిరిగి స్వాధీనం చేసుకోవడం (Recovery):
  NH4CO3
  NH3 + H2O + CO2
2 NH4Cl + Ca(OH)2
  CaCl2 + 2 NH3 + 2 H2O

3. జీవశాస్త్ర ప్రవాహికల్లో Na, K, Mg, Caల ప్రాముఖ్యాన్ని వివరించండి.
జవాబు: మాంసకృత్తుల (ప్రొటీన్లు) సంశ్లేషణలో, కణంలో గ్లూకోజ్ జీవన ప్రక్రియల్లో K+ అత్యవసరం. Na+, K+ కణాల్లో ద్రవాభిసరణాన్ని నిలకడగా ఉంచడానికి, విద్యుత్ పొటెన్షియల్‌ను (శక్మం) పుట్టించడానికి అవసరం.

దంతాలు, ఎముకల్లో Ca+2 ఉంటుంది. రక్తం గడ్డకట్టడానికి, హృదయ స్పందనను క్రమబద్ధీకరించడానికి Ca+2 అవసరం.
¤క్లోరోఫిల్‌లో Mg+2 ఉంటుంది. ఇది ATP చర్యల్లో పాల్గొని శక్తిని విడుదల చేస్తుంది.

4. సిమెంట్‌పై లఘు వ్యాఖ్య రాయండి.
జవాబు: నిర్మాణాల్లో సిమెంట్ ఉపయోగపడుతుంది. దీనిలో CaO (50-60%), SiO2 (20-25%), Al2O3 (5-10%), MgO (2-3%), Fe2O3 (1-2%), SO3 (1-2%) ఉంటాయి. నాణ్యమైన సిమెంట్‌లో సిలికా (SiO2), అల్యూమినా (Al2O3) నిష్పత్తి 2.5 నుంచి 4.0 మధ్య ఉంటుంది. సిమెంట్‌లో ముఖ్యంగా 'క్లింకర్' (బంకమన్ను, సున్నాన్ని వేడిచేస్తే వచ్చేది), 2-3% జిప్సం ఉంటాయి. సిమెంట్‌ను కాంక్రీట్ తయారీ, గచ్చు చేయడానికి (ప్లాస్టరింగ్), వంతెనలు, ఆనకట్టలు, రహదారులు, సొరంగాల నిర్మాణంలో వాడతారు.

5. జీవశాస్త్రంలో Ca+2, Mg+2 ల ప్రాముఖ్యం ఏమిటి?

జవాబు: క్లోరోఫిల్, ఫాస్ఫోట్రాన్స్‌ఫరేజ్, ఫాస్ఫోహైడ్రోలేజ్ ఎంజైమ్‌లు, జంతుకణాల్లో, ATP చర్యల్లో Mg+2 ఉంటుంది. కండరాల సంకోచం, గుండె క్రమంగా కొట్టుకోవడం, రక్తం గడ్డకట్టడం, ఎముకలు, పళ్లు ఏర్పడటంలో Ca+2 ఉపయోగపడుతుంది.

6. జీవశాస్త్రంలో క్షారలోహాల ప్రాముఖ్యత ఏమిటి?
జవాబు: ప్రొటీన్ల తయారీ, ఎంజైమ్‌లు ఉత్తేజం కావడానికి, గ్లూకోజ్ జీవక్రియలు, కణాల్లో విద్యుత్ శక్మాన్ని కలిగించడం, కణాల నుంచి Na+  అయాన్లను బహిష్కృతం చేయడం (సోడియం పంప్)లో Na+, K+ అయాన్ల పాత్ర అమోఘం.


7. జిప్సంను 500oC  వరకు వేడిచేస్తే ఏమవుతుంది?

8. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఎలా గట్టిపడుతుంది?
జవాబు: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ 2 దశల్లో గట్టి పడుతుంది. 
          CaSO4
   H2O + 1   H2 

  CaSO4 . 2H2O
                                                 విషమలంబాక్ష డైహైడ్రేట్ 
          CaSO4 . 2 H2
    CaSO4 . 2 H2O
      విషమలంబాక్ష డైహైడ్రేట్             ఏకనతాక్ష డైహైడ్రేట్

9. నెల్సన్ పద్ధతిలో NaOH ను ఎలా తయారుచేస్తారు?
జవాబు: నెల్సన్ (సచ్ఛిద్ర డయాఫ్రం) పద్ధతి: ఈ ఘటంలో "U" ఆకారపు సచ్ఛిద్ర స్టీలు గొట్టం లోపల పలుచటి రాతినార పూత ఉంటుంది. ఇది కాథోడ్‌గా వ్యవహరిస్తుంది. బ్రైన్ ద్రావణాన్ని (సజల NaCl ద్రావణం) ఈ గొట్టంలో విద్యుద్విశ్లేష్యంగా తీసుకుంటారు. దీనిలో వేలాడదీసిన గ్రాఫైట్ కడ్డీ ఆనోడ్‌గా వ్యవహరిస్తుంది. ఈ మొత్తం గొట్టాన్ని ఇనుప తొట్టిలో ఉంచుతారు. దీని కింద గ్రాహక పాత్ర ఉంచుతారు. దీనిద్వారా విద్యుత్ పంపితే ఆనోడ్ వద్ద Cl2 వస్తుంది. సోడియం అయాన్లు రాతినార ద్వారా రంధ్రాల్లోకి వెళ్తాయి. కింది భాగం నుంచి పంపే నీటి ఆవిరి వీటిని శుభ్రపరచి NaOH గా మారుస్తుంది. H2 కూడా వెలువడుతుంది.
ఈ ఘటంలో జరిగే చర్యలు:  
2 NaCl
  2 Na+ + 2Cl- (అయనీకరణం) 
ఆనోడ్ వద్ద:  2 Cl-  
Cl2 + 2 e- (ఆక్సీకరణం)
కాథోడ్ వద్ద:  2 H2O + 2 e
 2 OH- + H2 (క్షయకరణం)
2 Na+ + 2 OH-
 2 NaOH.
NaOH ని గ్రాహక పాత్ర నుంచి వేరుచేసి గాఢపరుస్తారు.     

10. కాస్ట్నర్ - కెల్నర్ పద్ధతిలో NaoH ను ఎలా తయారుచేస్తారు?
జవాబు: కాస్ట్నర్- కెల్నర్ (మెర్క్యురీ కాథోడ్) పద్ధతి: ఈ ఘటంలో దీర్ఘచతురస్రాకార ఇనుప తొట్టిని రెండు పలక విభాజకాల సాయంతో మూడు గదులుగా చేస్తారు. వీటిని తొట్టి అడుగున ఉన్న మెర్క్యురీ(Hg)  లోకి దించుతారు. Hg మధ్యస్థ ఎలక్ట్రోడ్‌గా (ప్రేరణ ప్రభావం మూలంగా) పనిచేస్తుంది. బయటి గదుల్లో Hg కాథోడ్‌గా పనిచేస్తుంది. ఈ గదుల్లో బ్రైన్ ద్రావణంలో గ్రాఫైట్ ఆనోడ్‌లను తీసుకుంటారు. ఈ గదుల్లో జరిగే చర్యలు: 
                      2 NaCl

 2 Na+ + 2 Cl
ఆనోడ్ వద్ద:  2 Cl-
 Cl2 + 2 e- (ఆక్సీకరణం)
కాథోడ్ వద్ద:  2 Na+ + 2 e- + Hg
 Na2Hg (క్షయకరణం)
మధ్య గదిలో ఇనుప కడ్డీల గుత్తి (కాథోడ్), విలీన NaOH  ద్రావణాన్ని తీసుకుంటారు. ఇక్కడ Hg ఆనోడ్‌గా పనిచేస్తుంది. ఉత్కేంద్ర చక్రంపై ఘటాన్ని ముందుకి, వెనక్కి కదిపినప్పుడు బయట గదుల్లో ఏర్పడిన Na2Hg మధ్య గదిలోకి పోగవుతుంది. ఈ గదిలో జరిగే చర్యలు    

ఆనోడ్ వద్ద:  Na2Hg  2 Na+ + 2 e+ Hg (ఆక్సీకరణం)
కాథోడ్ వద్ద:  2 H2O + 2 e- 
H+ 2 OH-  (క్షయకరణం)
            2 Na+ + 2 OH
 2 NaOH

ద్రావణ గాఢత 20%కి చేరాక దీన్ని ఇనుప కళాయిల్లో 500oC వద్ద ఇగిర్చి ఘన రూపంలో ఉండే NaOH ని పొందుతారు.

2 మార్కుల ప్రశ్నలు

1. లిథియం లవణాలు చాలావరకు ఆర్దీకృతమై ఉంటాయి. ఎందువల్ల?
జవాబు: Li+ అయాన్ పరిమాణం తక్కువ కాబట్టి నీటి అణువులను తేలిగ్గా ధ్రువీకరణం చెందిస్తుంది. అందుకే Li లవణాలు ఆర్ద్రీకృతమవుతాయి.
ఉదా: LiCl. 3H2O

2. క్షార లోహాల్లో అసాధారణ సాంద్రత ఉండే మూలకమేది? గ్రూపు - I మూలకాల సాంద్రత మార్పు క్రమాన్ని తెలపండి.
జవాబు: ఖాళీ d ఆర్బిటాళ్ల వల్ల K మూలకానికి అసాధారణ సాంద్రత ఉంటుంది.
సాంద్రత క్రమం: Li < K < Na < Rb < Cs

3. Mg లోహం గాలిలో మండితే ఏం జరుగుతుంది?
జవాబు: Mg లోహం గాలిలో మండి MgO, Mg3N2లను ఇస్తుంది.
2 Mg + O2
 2MgO
3 Mg + N2
 Mg3N2

4. సిమెంటుకు జిప్సంను ఎందుకు కలుపుతారు?
జవాబు: సిమెంటుకు 3% జిప్సం కలపడం వల్ల సెట్టింగ్ నెమ్మదిగా జరిగి తగినంతగా గట్టిపడుతుంది.

5. K2CO3ను సాల్వే పద్ధతిలో తయారుచెయ్యలేం. ఎందుకు?
జవాబు: KHCO3 ద్రావణీయత నీటిలో ఎక్కువ కాబట్టి దీన్ని నీటి నుంచి వేరుచెయ్యలేం. కానీ NaHCO3 ను వేరు చెయ్యవచ్చు. దీని నుంచి Na2CO3ను తయారు చెయ్యగలం.

6. కాస్టిక్ సోడా (NaOH) ముఖ్య ఉపయోగాలను తెలపండి.
జవాబు: * ప్రయోగశాల కారకంగా
* పెట్రోలియంను శుద్ధి చేయడంలో
* బాక్సైట్‌ను శుద్ధి చేయడంలో
* నూలు, పత్తిని గట్టిపడేలా చేసి పట్టులా కనిపించే విధంగా చేయడం

7. సోడియం కార్బొనేట్ ముఖ్య ఉపయోగాలను తెలపండి.
జవాబు: * గుణాత్మక, గుణ పరిమాణాత్మక విశ్లేషణలో
* నీటి కాఠిన్యతను తొలగించడంలో

* మంటలను ఆర్పే యంత్రాల్లో
* లాండ్రీల్లో

8. ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ముఖ్య ఉపయోగాలను తెలపండి.
జవాబు: * గృహ నిర్మాణాల్లో
* విరిగిన ఎముకలపై పిండికట్టు వేయడానికి
* విగ్రహాల తయారీకి
* దంత వైద్యంలో

Posted Date : 03-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌