• facebook
  • twitter
  • whatsapp
  • telegram

p - బ్లాక్ మూలకాలు (గ్రూపు 13 మూలకాలు)

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

2 మార్కుల ప్రశ్నలు

1. మెటాబోరేట్ అణువు నిర్మాణాన్ని గీయండి.

జ:

2. "జడజంట ప్రభావం'' అంటే ఏమిటి?
జ: బాహ్యస్థాయిలో ఉండే జంట s ఎలక్ట్రాన్లు బంధంలో పాల్గొనటానికి విముఖత చూపటాన్ని జడజంట ప్రభావం అంటారు.

ఉదా: Tl+1

3.  'టింకాల్', 'కొలెమనైట్' ఫార్ములాలను తెలపండి.
జ: టింకాల్: Na2B4O7 . 10 H2O
   కొలెమనైట్: Ca2B6O11 . 5 H2O

4. డైబోరేన్, బోరజీన్‌లో బోరాన్ సంకరీకరణం ఏమిటి?
జ: డైబోరేన్‌లో Bకి sp3, బోరజీన్‌లో Bకి sp2 సంకరీకరణం ఉంటుంది.

5. డ్యూరాల్యుమిన్, మాగ్నాలియంల సంఘటనాన్ని తెలపండి.
జ: డ్యురాల్యుమిన్: 2-15% Mg, 85-98% Al
   మాగ్నాలియం: 10-12% Al, 88-90% Cu

6. బోరాక్స్ ఉపయోగాలు రెండింటిని తెలపండి
జ: 1. తోళ్లు, చర్మాలను శుభ్రపరచడానికి 
   2. పైరెక్స్, కాంతీయ గాజుల తయారీకి.


7. బోరజీన్ సాంకేతికం, సాధారణ నామాన్ని తెలపండి.
జ: B3N3H6
దీన్ని ఇనార్గానిక్ బెంజీన్ అని కూడా అంటారు.

                          

8. ఆర్థోబోరిక్ ఆమ్లాన్ని బాగా వేడిచేస్తే ఏం జరుగుతుంది?
జ: B3BO3 ని వేడి చేస్తే చివరకు B2O3 ఏర్పడుతుంది. 

 
 

9. (a) 120oC, 200oC వద్ద NH3 తో (b) HCl, AlCl3 తో డైబోరేన్ ఏవిధంగా చర్య జరుపుతుంది? 
జ:

   


10. Ga, In, Tl రుణ విద్యుదాత్మకతల్లో తేడా అంతగా కన్పించదు. కారణమేమిటి?
జ: Ga, In, Tl లు b- బ్లాక్ మూలకాల తర్వాత వస్తాయి. b- ఎలక్ట్రాన్లు బాహ్యస్థాయిలోని ఎలక్ట్రాన్లను కేంద్రక ఆకర్షణ బలాల నుంచి రక్షించలేవు. కాబట్టి వీటిని కేంద్రకం బలంగా ఆకర్షించడం వల్ల వీటి రుణవిద్యుదాత్మకతల్లో తేడా అంతగా కనిపించదు.

11. BF3 లూయీ ఆమ్లంగా ఎందుకు ప్రవర్తిస్తుంది?
జ: ఎలక్ట్రాన్ జంట స్వీకర్త ఆమ్లం. BF3 ఎలక్ట్రాన్ కొరత ఉన్న సమ్మేళనం. బోరాన్ బాహ్యస్థాయి (BF3)లో 6 ఎలక్ట్రాన్‌లే ఉన్నాయి. అష్టక విన్యాసం కోసం ఎలక్ట్రాన్ జంటను స్వీకరిస్తుంది.


12. బోరిక్ ఆమ్లం బహ్వణుకగా ఎందుకు ఉంటుంది?
జ: అణువుల మధ్య హైడ్రోజన్ బంధాలు ఉండటం వల్ల ఇది బహ్వణుకగా ఉంటుంది.

                                         
                                         

4 మార్కుల ప్రశ్నలు

 1. ఎలక్ట్రాన్ కొరత ఉన్న అణువులంటే ఏమిటి? డైబోరేన్ నిర్మాణాన్ని వివరించండి.
జ: కేంద్రక పరమాణువులో అష్టకం కన్నా తక్కువ సంఖ్యలో ఎలక్ట్రాన్లున్న అణువుల్ని 'ఎలక్ట్రాన్ కొరత ఉన్న అణువులు' అంటారు.
డైబోరేన్ నిర్మాణం: 
   B = 1s2 2s1 2px1 2py1 2pz1 (మొదటి ఉద్రిక్తస్థాయి)
    డైబోరేన్‌లో ఉన్న 12 వేలన్సీ ఎలక్ట్రాన్లు (B2H6 = (2×3) + 6×1 = 12e- ) కేవలం 6 బంధాలను ఏర్పరుస్తాయి. దీన్ని C2H6 తో పోల్చితే (2 × 4 + (6 × 1) = 14 e- = 7 బంధాలు) ఏడు బంధాలను ఏర్పరచడానికి ఇంకా 2 ఎలక్ట్రాన్లు తక్కువగా ఉన్నాయి. అందుకే B2H6 ని 'ఎలక్ట్రాన్ కొరత ఉన్న అణువు' అంటారు. 
దీనిలోని రెండు బోరాన్ పరమాణువులు sp3 సంకరీకరణం చెంది ఒంటరి ఎలక్ట్రాన్లు ఉండే మూడు, ఖాళీగా ఉండే ఒక sp3 సంకర ఆర్బిటాళ్లను ఇస్తాయి.
రెండు B పరమాణువులపై ఉండే నాలుగు sp3 ఆర్బిటాళ్లు హైడ్రోజన్‌లోని 1s ఆర్బిటాళ్లతో అతిపాతం చెంది రెండు BH2 సమూహాలను ఇస్తాయి. ఒక Bకి చెందిన ఒంటరి ఎలక్ట్రాన్ ఉన్న sp3 ఆర్బిటాల్, మరో B కి చెందిన ఖాళీ sp3 ఆర్బిటాల్‌లు Hకి చెందిన 1s ఆర్బిటాల్‌తో అతిపాతం జరిపి త్రికేంద్రక 2 ఎలక్ట్రాన్ B-H-B బంధాన్ని ఏర్పరుస్తాయి.

దీనినే అరటికాయ బంధం, టౌబంధం, వారధి బంధం అని పిలుస్తారు. ఇలాంటి రెండు బంధాలు (తలంపైన ఒకటి, తలంకింద మరొకటి) ఏర్పడతాయి.

తలంలో 4 చివరి హైడ్రోజన్‌లు, 2 బోరాన్‌లు ఉంటాయి.

అరటికాయ బంధం 
Ht = అంత్య H
Hb = వారధి H
HbBHb బంధకోణం = 97
o 
HtBHt బంధకోణం = 120
o 
B-Ht బంధ దైర్ఘ్యం = 119 Pm
B-Hb బంధ దైర్ఘ్యం = 134 Pm 
B-B బంధ దైర్ఘ్యం = 177 Pm 

2. బోరాక్స్ పూస పరీక్ష గురించి తెలపండి.
జ: పరివర్తన మూలకాలను బోరాక్స్‌పూస పరీక్ష ద్వారా గుర్తించవచ్చు.
బోరాక్స్ పూస పరీక్ష:  బోరాక్స్‌ను వేడిచేస్తే నీటిని కోల్పోయి, ఉబ్బి అనార్ద్ర సోడియం టెట్రా బోరేట్ అనే కాంతి నిరోధక పదార్థం ఏర్పడుతుంది. దీన్ని గలనం చేస్తే బోరాక్స్ గాజు (సోడియం మెటాబోరేట్ + B2O3) ఏర్పడుతుంది. B2O3  Co మెటాబోరేట్‌తో నీలిరంగు, Cu తో ఆకుపచ్చ, Fe తో పసుపు జేగురు, Cr తో పసుపు, Mn, Ni లతో ఊదారంగు పూసలను ఏర్పరుస్తాయి.
Na2B4O7 . 10 H2O
  Na2B4O

 2 NaBO2 + B2O3
B2O3 + Co O  Co(BO2)2
కోబాల్ట్ మెటాబోరేట్ (నీలిరంగు పూస) 

3. డైబోరేన్‌ను తయారుచేసే రెండు పద్ధతులను తెలపండి.
ఎ) కార్బన్‌మోనాక్సైడ్     బి) NH3తో జరిపే చర్య ఏమిటి?
జ: తయారీ పద్ధతులు:
» BF3ను LiHతో క్షయకరణం చేసి B2H6 తయారు చేయవచ్చు.
     2 BF3 + 6 LiH
  B2H6 + 6 LiF
» BCl3, H2 ల మిశ్రమం ద్వారా నిశ్శబ్ద విద్యుత్ ఉత్సర్గాన్ని పంపి B2H6 ను తయారు చేయవచ్చు.
     2 BCl3 + 6H2
  B2H6 + 6 HCl

చర్యలు:
a) B2H6 1000
oC వద్ద COతో, 2 atm పీడనం వద్ద చర్య జరిపి బోరేన్ కార్బొనైల్‌ను ఇస్తుంది.
    B2H6 + 2 CO  2 [BH3 - CO]
b) B2H6 ను 200
oC వరకు NH3తో వేడిచేస్తే బోరజీన్ వస్తుంది.

 

Posted Date : 04-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌