• facebook
  • twitter
  • whatsapp
  • telegram

1, 2, 13, 14వ గ్రూపు మూలకాలు 

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

4 మార్కుల ప్రశ్నలు  

ప్ర: డైబోరేన్ నిర్మాణాన్ని వివరించండి.
జ: డైబోరేన్ ఎలక్ట్రాన్ కొరత ఉన్న అణువు. దీనిలో ఉన్న 12 వేలన్సీ ఎలక్ట్రాన్లు 6 బంధాలను ఏర్పరచగలవు.
దీన్ని ఈథేన్‌తో పోలిస్తే 7 బంధాలను ఏర్పరచడానికి రెండు ఎలక్ట్రాన్లు తక్కువగా ఉంటాయి. డైబోరేన్‌లోని ప్రతి B పరమాణువు sp3 సంకరీకరణం చెంది ఒంటరి ఎలక్ట్రాన్లుండే మూడు, ఖాళీగా ఉండే ఒక sp3 సంకర ఆర్బిటాళ్లను ఇస్తాయి. రెండు B లపై ఉండే 4 sp3 ఆర్బిటాళ్లు H లోని 1s ఆర్బిటాల్‌తో అతిపాతం చెంది రెండు BH2 సమూహాలను ఇస్తాయి.     
ఒక B కి చెందిన ఒంటరి ఎలక్ట్రాన్‌ను కలిగిన sp3 ఆర్బిటాల్, మరో B కి చెందిన ఖాళీ sp3 ఆర్బిటాల్, H కి చెందిన 1s ఆర్బిటాల్‌తో అతిపాతం జరిపి త్రికేంద్రక 2 ఎలక్ట్రాన్ B - H - B బంధాన్ని ఏర్పరుస్తాయి. దీన్నే వారధి (అరటికాయ) బంధం అని కూడా పిలుస్తారు. ఇలాంటివి రెండు బంధాలు (తలంపై ఒకటి, తలం కింద మరొకటి) ఏర్పడతాయి. తలంలో 4 చివరల H లు, 2 బోరాన్‌లు ఉంటాయి.

ప్ర: బోరాక్స్ పూస పరీక్షను తగిన ఉదాహరణతో వివరించండి.
జ: బోరాక్స్‌ని వేడి చేస్తే నీటిని కోల్పోయి, అనార్ద్ర సోడియం మెటాబోరేట్, B2O3 (బోరాక్స్ గాజు) అనే తెల్లటి, కాంతినిరోధక పదార్థం వస్తుంది. B2O3 ని లోహాక్సైడ్ (ఉదా: Co O) తో వేడి చేస్తే రంగున్న బోరాక్స్ పూస ఏర్పడుతుంది. ఈ పరీక్ష గుణాత్మక విశ్లేషణలో క్షార ప్రతిపాదికలను గుర్తించడానికి ఉపయోగపడుతుంది. 
 
  

    (నీలిరంగు పూస)


ప్ర: జీవశాస్త్రంలో సోడియం, పొటాషియం, మెగ్నీషియం, కాల్షియంల ప్రాముఖ్యాన్ని తెలపండి.
జ: సోడియం:
¤ నరాల సిగ్నల్స్ ప్రసారంలో పాల్గొనడం.
¤ కణకవచం ద్వారా ప్రవహించే నీటిని క్రమబద్ధీకరించడం.
పొటాషియం:
¤ నరాల సిగ్నల్స్ ప్రసారంలో సాయపడటం.
¤ గ్లూకోజ్‌ని ఆక్సీకరణంచేసి ATP ని ఉత్పత్తి చెయ్యడంలో పాల్గొనడం.
మెగ్నీషియం:
¤ నరాలు, కండరాలు రిలాక్స్ కావడంలో సాయపడటం.
¤ ఆకుల్లోని పత్రహరితంలో ఉంటుంది.
కాల్షియం:
¤ రక్తం గడ్డకట్టడంలో సాయపడటం.
¤ దంతాలు, ఎముకల్లో ఉంటుంది.

2 మార్కుల ప్రశ్నలు  

ప్ర: సిమెంట్‌కి జిప్సంను ఎందుకు కలుపుతారు?
జ: సిమెంట్‌కి 2-3% జిప్సంను కలపడం వల్ల సిమెంట్ నెమ్మదిగా సెట్టింగ్ జరిగి తగినంత గట్టిపడుతుంది.


ప్ర: కాష్ట్నర్- కెల్నర్ పద్ధతిలో ఆనోడ్, కాథోడ్‌ల వద్ద జరిగే చర్యలను తెలపండి.
జ:
  (అయనీకరణం)
ఆనోడ్ వద్ద:   (ఆక్సీకరణం)
కాథోడ్ వద్ద: 
 
Na2 Hg నీటితో చర్యజరిపి NaOH, H2 లను ఇస్తుంది.  

 
 
ప్ర: 'ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్', 'మృత దహన ప్లాస్టర్' అంటే ఏమిటి?
జ: కాల్షియం సల్ఫేట్ హెమి హైడ్రేట్‌ను ప్లాస్టర్ ఆఫ్ పారిస్ అంటారు. అనార్ద్ర CaSO4 ను మృత దహన ప్లాస్టర్ అంటారు.



  

ప్ర: ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగాలు రెండింటిని తెలపండి.
జ: విరిగిన ఎముకలు, బెణుకులపై ప్లాస్టర్ వెయ్యడానికి, విగ్రహాలు, అర్ధాకృతి ప్రతిమలను పోత పొయ్యడానికి ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఉపయోగపడుతుంది.


ప్ర: డైబోరేన్, బోరజీన్‌లలో B ప్రదర్శించే సంకరీకరణం ఏది?
జ: డైబోరేన్‌లో B సంకరీకరణం: sp3 బోరజీన్‌లో B సంకరీకరణం: sp2


ప్ర: బోరాక్స్, కొలిమనైట్‌ల ఫార్ములాను తెలపండి.
జ: బోరాక్స్: Na2B4O7 . 10H2O,
  కొలిమనైట్: Ca2B6O11 . 5H2O


ప్ర: బోరజీన్ సాధారణ నామమేది? ఎలా ఏర్పడుతుంది?
జ: ఇనార్గానిక్ బెంజిన్. B2H6 ను NH3 తో వేడిచేస్తే ఏర్పడుతుంది. 
 


    
ప్ర: గ్రాఫైట్ మంచి విద్యుద్వాహకం. వివరించండి.
జ: కార్బన్ sp2 సంకరీకరణంలో పాల్గొంటుంది. 4వ ఎలక్ట్రాన్ స్వేచ్ఛగా ఉంటుంది. ఈ స్వేచ్ఛా ఎలక్ట్రాన్ల మూలంగా గ్రాఫైట్ మంచి ఉష్ణ, విద్యుద్వాహకం.

ప్ర: గ్రాఫైట్‌ని కందెనగా ఉపయోగిస్తారు. ఎందువల్ల?
జ: షడ్భుజాకార కార్బన్ వలయాలు ద్విజ్యామితీయ పొరల నిర్మాణాన్ని ఇస్తాయి. ఈ పొరలు బలహీనమైన వాండర్ బలాలతో బంధితమై ఉండటం వల్ల ఒకదానిపై ఒకటి జారతాయి. దీనివల్ల గ్రాఫైట్‌ను కందెనగా ఉపయోగిస్తారు.


ప్ర: వజ్రం గట్టిగా ఉంటుంది. ఎందుకు?
జ: వజ్రంలో కార్బన్ sp3 సంకరీకరణం చెందుతుంది. ప్రతి కార్బన్, వేరే 4 కార్బన్లతో చతుర్ముఖీయంగా బంధితమవుతుంది. ఇవన్నీ త్రిజ్యామితీయ బృహదణువును ఏర్పరుస్తాయి. ఈ కారణాల వల్ల వజ్రం గట్టిగా ఉంటుంది. దీన్ని పాలరాతిని కోయడానికి, సానపెట్టేందుకు ఉపయోగిస్తారు.


ప్ర: ఆర్థో బోరిక్ ఆమ్లం నిర్మాణాన్ని తెలపండి.
జ:

ప్ర: రూపాంతరత అంటే ఏమిటి? కార్బన్ స్ఫటిక రూపాంతరాలను తెలపండి.
జ: ఒకే మూలకం భిన్న భౌతిక రూపాల్లో లభిస్తూ, ఒకే రసాయన ధర్మాలను కలిగి ఉండటం. వజ్రం, గ్రాఫైట్, ఫుల్లరీన్‌లు కార్బన్ స్ఫటిక రూపాంతరాలు.


ప్ర: SiO2 ఘన పదార్థం, కానీ CO2 వాయువు. వివరించండి.
జ: CO2 కి O = C = O నిర్మాణం ఉంటుంది. దీని రేఖీయ నిర్మాణం, సున్నా ద్విధ్రువ భ్రామకం వల్ల, CO2 అణువులు బలహీనమైన వాండర్‌వాల్ బలాలతో బంధితమై, వాయు రూప ధర్మాన్ని కలిగి ఉంటాయి. SiO2 లో పరమాణువులు చతుర్ముఖీయంగా బంధితమై, త్రిజ్యామితీయ నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. కాబట్టి SiO2 ఘన పదార్థం.


ప్ర: 'సిలికోన్‌లు' అంటే ఏమిటి?
జ: -O Si R2- లింకేజ్ ఉన్న ఆర్గనో సిలికోన్ పాలిమర్ సమ్మేళనాలు. ఇవి క్లోరోసిలేన్లు జలవిశ్లేషణ, సంఘననం చెందితే ఏర్పడతాయి.

Posted Date : 08-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌