• facebook
  • twitter
  • whatsapp
  • telegram

రసాయన సమతాస్థితి, ఆమ్లాలు-క్షారాలు 

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

ప్ర: pH ని నిర్వచించండి. 10-8 M HCl ద్రావణం pH ఎంత?
జ: హైడ్రోజన్ అయాన్ గాఢత యొక్క రుణ సంవర్గమానాన్ని pH అంటారు.

       

       
ప్ర: సమతాస్థితి స్థిరాంకం అంటే ఏమిటి? కింది చర్యకు Kp, KC లను, వాటి మధ్య సంబంధాన్ని రాయండి.   


       
జ: సమతాస్థితి స్థిరాంకం: సమతాస్థితి వద్ద క్రియాజన్యాల మోలార్ గాఢతల లబ్ధానికి క్రియాజనకాల గాఢతల లబ్ధానికి ఉన్న నిష్పత్తి.

 


ప్ర: నీటి అయానిక లబ్ధం అంటే ఏమిటి? 25oC వద్ద దీని విలువ ఎంత? దాని యూనిట్లు ఏమిటి?
జ: శుద్ధజలం లేదా జలద్రావణంలో ఉండే H+, OH- అయాన్ల గాఢతల లబ్ధమే నీటి అయానిక లబ్ధం.
      Kw = 1.0 × 10-14 మోల్2 / లీటరు2 
           యూనిట్లు = మోల్2 / లీటరు2

 

ప్ర: కాంజుగేట్ ఆమ్ల-క్షార జంట అంటే ఏమిటి?
   ఎ) H2O   బి)  HCO3-    సి) HSO4- ల కాంజుగేట్ ఆమ్ల, క్షారాలను తెలపండి.
జ: ఒక ప్రోటాన్ వ్యత్యాసం ఉన్న ఆమ్లక్షార జంటనే కాంజుగేట్ ఆమ్ల క్షార జంట అంటారు. క్షారం ఒక ప్రోటాన్‌ని స్వీకరిస్తే కాంజుగేట్ ఆమ్లం, ఆమ్లం ఒక ప్రోటాన్‌ని దానం చేస్తే కాంజుగేట్ క్షారం ఏర్పడతాయి.
H2O : కాంజుగేట్ ఆమ్లం H3O+, కాంజుగేట్ క్షారం OH-
HCO3- : కాంజుగేట్ ఆమ్లం  H2CO3 ,  కాంజుగేట్ క్షారం CO3-2
HSO4- : కాంజుగేట్ ఆమ్లం H2SO4 , కాంజుగేట్ క్షారం SO4-2

ప్ర: లూయీ ఆమ్ల క్షార సిద్ధాంతాన్ని తగిన ఉదాహరణలతో వివరించండి.
జ: లూయీ ఆమ్లం: వేరొక పదార్థం నుంచి ఎలక్ట్రాన్ జంటను స్వీకరించి, సమన్వయ సమయోజనీయ బంధాన్ని ఏర్పరిచే పదార్థం.
లూయీ ఆమ్లాల్లో రకాలు:
* అన్ని కేటయాన్లు (CO+3, Fe+3
   ఎలక్ట్రాన్ షష్ఠిమూలకాలు (O, S) 
* ఖాళీ d ఆర్బిటాళ్లున్న అణువులు (SF4, SiF4)
* అసంపూర్ణ అష్టకం ఉన్న అణువులు (AlCl3, BCl3).
లూయీ క్షారం: వేరొక పదార్థానికి ఎలక్ట్రాన్ జంటను దానం చేసి సమన్వయ సమయోజనీయ బంధం ఏర్పరిచే పదార్థం.
లూయీ క్షారాల్లో రకాలు:
¤ అన్ని ఆనయాన్లు (F-, Cl-)
¤ ఒంటరి ఎలక్ట్రాన్ జంటలున్న అణువులు (R
 H,   H3)
¤ బహుబంధాలున్న అణువులు (C2H2, C2H4).

ప్ర: పారిశ్రామిక పద్ధతిలో సల్ఫర్ ట్రయాక్సైడ్ సంశ్లేషణ విధానాన్ని తెలపండి.
జ: 


పీడన ప్రభావం: పీడనాన్ని పెంచితే సమతాస్థితి కుడివైపు (లీషాట్లియర్ సూత్రానుసారం) జరుగుతుంది. కానీ అధిక పీడనం వద్ద ఆమ్ల స్వభావం ఉండే SO3 అధికంగా ఏర్పడటం వల్ల టవర్లు క్షయం చెందుతాయి. కాబట్టి మధ్యస్థ (తగు) పీడనం 1.5 - 1.7 అట్మాస్పియర్లను మాత్రమే ఉపయోగిస్తారు.
ఉష్ణోగ్రత ప్రభావం: ఇది ఉష్ణమోచక చర్య కాబట్టి ఉష్ణోగ్రత ను తగ్గించాలి. కానీ తక్కువ ఉష్ణోగ్రత వద్ద చర్య రేటు తక్కువగా ఉంటుంది. అందుకే SO3 అధిక దిగుబడి కోసం తగు ఉష్ణోగ్రత (673 K) ను ఉపయోగిస్తారు.
గాఢత ప్రభావం: చర్యకు SO2 లేదా O2 లేదా రెండింటినీ కలపడం వల్ల లేదా SO3 ని తొలగించడం వల్ల సమతాస్థితి కుడివైపు జరిగి అధికంగా ఏర్పడుతుంది. V2O5ని ఉత్ప్రేరకంగా ఉపయోగిస్తారు.


ప్ర: సజాతీయ సమతాస్థితి, విజాతీయ సమతాస్థితి అంటే ఏమిటి? ఒక్కో ఉదాహరణ ఇవ్వండి.
జ: సజాతీయ సమతాస్థితి: క్రియాజనకాలు, క్రియాజన్యాలు అన్నీ ఒకే భౌతికస్థితిలో ఉన్న సమతాస్థితి.
ఉదా: 

                 

విజాతీయ సమతాస్థితి: క్రియాజనకాలు, క్రియాజన్యాలు అన్నీ వేర్వేరు భౌతికస్థితుల్లో ఉన్న సమతాస్థితి.
ఉదా:
 
      
ప్ర: ''లవణ జలవిశ్లేషణ" అంటే ఏమిటి? CH3COONa జలద్రావణానికి క్షారత్వం ఉంటుంది. వివరించండి.
జ: ఒక జలద్రావణంలో లవణంలో ఉన్న ఆనయాన్ లేదా కేటయాన్ లేదా రెండూ నీటితో చర్య జరిపి H+ లేదా OH- లేదా రెండింటినీ ఇచ్చే చర్యను లవణ జలవిశ్లేషణ అంటారు. CH3COONa లవణం CH3COOH (బలహీన ఆమ్లం), NaOH (బలమైన క్షారం)ల నుంచి ఏర్పడింది. CH3COOH కాంజుగేట్ అయిన CH3COO- బలమైన క్షారం. ఇది ఆనయాన్ జలవిశ్లేషణ జరిపి OH- అయాన్‌లను ఇవ్వడం వల్ల ద్రావణానికి క్షారత్వం ఉంటుంది.


ప్ర: ''ద్రావణీయతా లబ్ధం" అంటే ఏమిటి?Ag2CrO4 ద్రావణీయత 1.3 × 10-4 మోల్స్/లీటరు ఉంటే దాని ద్రావణీయతా లబ్ధం ఎంత?
జ: ఒక సంతృప్త లవణ ద్రావణంలో ఉన్న కేటయాన్, ఆనయాన్ గాఢతల లబ్ధాన్ని ద్రావణీయతా లబ్ధం అంటారు.


     
   Ksp = (2 S)2 (S) = 4 S3 = 4(1.3 × 10-4)3
                              = 8.79 × 10-12

ప్ర: బ్రాన్‌స్టెడ్ క్షారం అంటే ఏమిటి? ఒక ఉదాహరణ ఇవ్వండి.
జ: ప్రోటాన్ స్వీకర్తను బ్రాన్‌స్టెడ్ క్షారం అంటారు.
ఉదా: H2O, OH-, SO4-2

 

ప్ర: 'ఉభయ సామాన్య అయాన్ ప్రభావం' అంటే ఏమిటి?
జ: ఒక బలహీన విద్యుద్విశ్లేష్యకానికి, ఉభయ కేటయాన్ ఉన్న బలమైన విద్యుద్విశ్లేష్యాన్ని కలిపితే, బలహీన విద్యుద్విశ్లేష్య ద్రావణీయత తగ్గిపోయే ప్రక్రియనే ఉభయ సామాన్య అయాన్ ప్రభావం అంటారు.

ఉదా: CH3COOHకి CH3COONaని కలిపితే CH3COOH అయనీకరణం తగ్గిపోతుంది.

Posted Date : 06-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌