• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కర్బన సమ్మేళనాల రసాయన శాస్త్రం

ప్ర‌శ్న‌లు - జవాబులు

1. స్థాన సాదృశ్యం అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి.
జ: స్థాన సాదృశ్యం: ఒక సమ్మేళనంలో బహుబంధాలు, ప్రమేయ సమూహాలు, ప్రతిక్షేపకాల స్థానంలో వచ్చే తేడాల వల్ల ఏర్పడే సాదృశ్యం.    

ఉదా: C3H7OH కి 2 సాదృశ్యాలున్నాయి. 
              CH3-CH2- CH2-OH                                     CH3-CH- CH
            n- ప్రొపైల్ ఆల్కహాల్                                            
           
                                                                           OH
                                                                ఐసో ప్రొపైల్ ఆల్కహాల్

2. ప్రమేయ సమూహ సాదృశ్యం అంటే ఏమిటి? ఉదాహరణ ఇవ్వండి.
జ: సమూహ సాదృశ్యం: వేర్వేరు ప్రమేయ సమూహాలు ఉన్నప్పుడు ఏర్పడే సాదృశ్యం.     
   ఉదా: C2H6O
   సాదృశ్యాలు:             CH3CH2OH                           CH3 - O - CH3
                        ఇథైల్ ఆల్కహాల్                          డై మిథైల్ ఈథర్


 

3. మెటామెరిజం అంటే ఏమిటి? C4H10O కు మెటామర్‌లను ఇవ్వండి.
జ: మెటామెరిజం: ఒకే ప్రమేయ సమూహానికి వేర్వేరు ఆల్కైల్ సమూహాలు బంధించి ఉండటం వల్ల ఏర్పడే  సాదృశ్యం ఉదా: C4H10O

  సాదృశ్యాలు: C2H5 _ O _  C2H5        CH3 _ O _ C3H7
            డై ఇథైల్ ఈథర్                మిథైల్ ప్రొపైల్ ఈథర్

4. (a)     H   H                 (b) H3C _ CH_ CH2_NH2 లకు  IUPAC పేర్లనివ్వండి ?
           
 |    |                                   |                
    H3C_ C_ C_ CH2OH                     OCH3
         
  |​​​​​​​     |​​​​​​​       
         Cl  CH3
జ:  a. 3 క్లోరో 2 - మిథైల్ బ్యుటనోల్ 
        
    b. 2 మిథాక్సీ ప్రొపాన్ - 1 - ఎమైన్


 

 5. (a)                                 (b)

                    

లకు IUPAC పేర్లనివ్వండి ?
జ: (a)  3 - ఇథైల్   2 - మిథైల్ పెంటేన్ 
   (b)  3 - ఇథైల్   4 - మిథైల్ హెక్సేన్

6. ఒక ఆల్కీన్ ద్విబంధ కార్బన్‌లపై Cl, Br, - CH2 - CH2 - OH, - CH(CH3)2 ఉంటే వాటి E-Z విన్యాసాలు ఏమిటి?

జ: 


       

7. కింది చర్యల్లో A, B లు ఏమిటి?


         

 

4 మార్కులు ప్రశ్నలు


8. క్షేత్ర సాదృశ్యం అంటే ఏమిటి? 2 - బ్యూటీన్ జ్యామితీయ సాదృశ్యాలను వివరించండి ? 
జ: క్షేత్ర సాదృశ్యం: ద్విబంధ కార్బన్ చుట్టూ ఉన్న పరమాణువులు, సమూహాలను విభిన్న ప్రాదేశిక అమరికలు చేస్తే ఏర్పడే సాదృశ్యం. ఒకే సమూహాలు కార్బన్ పరమాణువులకు ఒకే వైపు అమర్చితే దాన్ని సిస్ - సాదృశ్యం అంటారు. కార్బన్ పరమాణువులకు రెండు వైపులా అమర్చితే దాన్ని ట్రాన్స్ - సాదృశ్యమని అంటారు.

ఉదా:

              

            సిస్ - 2 - బ్యూటీన్                    ట్రాన్స్ - 2 - బ్యూటీన్
 

9. కర్బన, రసాయన చర్యల వర్గీకరణను వివరించండి?
జ: కర్బన రసాయన చర్యల్లో రకాలు: కర్బన రసాయన చర్యల్ని ముఖ్యంగా 4 విధాలుగా వర్గీకరించవచ్చు.
1.ప్రతిక్షేపణ చర్యలు: ఒక పదార్థంలో పరమాణువు లేదా సమూహానికి బదులు వేరొక పరమాణువు లేదా సమూహాన్ని ప్రతిక్షేపించే చర్యలు. ప్రతిక్షేపణ, ఎలక్ట్రోఫైల్ లేదా న్యూక్లియోఫైల్ లేదా స్వేచ్ఛా ప్రాతిపదిక దేనివల్త్లెనా జరగవచ్చు. ఆల్కేన్లు, ఆల్కైల్ హాలైడ్‌లు, బెంజీన్లలో ప్రతిక్షేపణ చర్యలు జరుగుతాయి. 
             ఉదా: 
RX + KOH(aq.)   R - OH + KX
2.సంకలన చర్యలు: అసంతృప్త సమ్మేళనం (ఆల్కీన్ లేదా ఆల్కైన్), కారకం (ఎలక్ట్రోఫైల్/ న్యూక్లియోఫైల్/ స్వేచ్ఛా ప్రాతిపదిక) కలసి ఒకే సమ్మేళనాన్ని ఏర్పరిచే చర్యలు.
             ఉదా: 
 H2C = CH2 + HBr CH3 - CH2 Br

3. విలోపన చర్యలు: ఒకే కార్బన్ పరమాణువు లేదా వేర్వేరు కార్బన్ పరమాణువుల పైన ఉండే 2 పరమాణువులు లేదా సమూహాలను తొలగిస్తే ఆల్కీన్లు లేదా ఆల్కైన్లను ఏర్పరచే చర్యలు. 
           ఉదా:  
C2H5Br + KOH  (ఆల్కహాలిక్ H2C = CH2 + KBr + H2O      
4. పునరమరిక చర్యలు: ఒకే అణువులో ఉండే C పరమాణువుపై ఉన్న పరమాణువు / సమూహం వేరొక C పరమాణువు పైకి స్థానభ్రంశం చెందే చర్యలు
 
 
                 NH4  CNO   O =   

10. కింది చర్యలో A, B, C ల పేర్లను రాయండి ? 
జ:       
       
         

           

11. మార్కోనికాఫ్ నియమం,  ఖరాష్ ప్రభావాలను  వివరించండి.
జ: మార్కోనికాఫ్ నియమం: ఒక కారకంలో ఉండే రుణావేశ భాగం, తక్కువ సంఖ్యలో హైడ్రోజన్లు ఉన్న ద్విబంధ కార్బన్‌పై సంకలనం చెందుతుంది. 

                      

    ఖారష్ ప్రభావం: పెరాక్సైడ్ సమక్షంలో ఒక కారకంలో ఉండే రుణావేశ భాగం, ఎక్కువ సంఖ్యలో హైడ్రోజన్లు ఉన్న ద్విబంధ కార్బన్‌పై సంకలనం చెందుతుంది.

                  

  
 

8 మార్కుల ప్రశ్నలు


12. ఈథేన్ తయారు చేసే పద్ధతులు రెండింటిని తెలపండి. ఏవైనా నాలుగు చర్యలను వివరించండి? 
జ: డీకార్బాక్సిలీకరణం:
 సోడియం ప్రొపనోయేట్‌ను సోడాలైమ్ (CaO,NaOH ల మిశ్రమం)తో కలిపి వేడిచేస్తే ఈథేన్ వస్తుంది.
 

                          
కోల్బ్ విద్యుద్విశ్లేషణ: పొటాషియం ఎసిటేట్ ద్రావణాన్ని విద్యుద్విశ్లేషణ చేసి ఈథేన్‌ను పొందవచ్చు. 
 

         
                                        ఆనోడ్ వద్ద         కాథోడ్ వద్ద
రసాయన ధర్మాలు:
హోలోజనీకరణం సూర్యరశ్మి సమక్షంలో C2H6 ని హోలోజనీకరణం చేస్తే క్లోరో ఉత్పన్నాల మిశ్రమం వస్తుంది. ఇది స్వేచ్ఛా ప్రాతిపదిక విధానంలో జరుగుతుంది.

         
నైట్రోకరణం: C2H6 నత్రికామ్ల బాష్పంతో చర్య జరిపి నైట్రో ఈథేన్‌ను ఇస్తుంది.  

                               
మహోషియ విఘటనం (Pyrolysis): C2H6 ను అధికంగా వేడిచేస్తే ఈథీన్‌ను ఇస్తుంది. 
 

                                 
నియంత్రిత ఆక్సీకరణం: C2H6 ని మాంగనీస్ ఎసిటేట్ సమక్షంలో ఎక్కువ పీడనం వద్ద వేడిచేస్తే ఎసిటికామ్లం వస్తుంది. 
 

                
                    

13. ఈథీన్ తయారు చేసే పద్ధతులు రెండింటిని తెలపండి. ఈథీన్ కింది వాటితో జరిపే చర్యలకు సమీ కరణాలు రాయండి. (a) O3  (b) చల్లని విలీన క్షార KMnO4  (c) 200ºC  వద్ద Ag, O2 తో        (d) H2.
జ: డీ హాలోజనీకరణం: 
               1, 2 డైబ్రోమో ఈథేన్‌ను Zn , ఆల్కహాల్‌లతో వేడిచేస్తే C2H4 వస్తుంది.

               
నిర్జలీకరణం: ఇథైల్ ఆల్కహాల్‌ని 170ºC వరకు గాఢ H2SO4 తో వేడిచేస్తే C2H4 వస్తుంది.  

              
              
రసాయన ధర్మాలు:
ఓజోనాలసిస్: ఈథీన్, ఓజోన్‌తో సంకలనం చెంది ఈథీన్ ఓజోనైడ్ వస్తుంది. దీన్ని Zn, H2O లతో క్షయకరణం చేస్తే ఫార్మాల్డిహైడ్ వస్తుంది. ఈ చర్యనే ఓజోనాలసిస్ చర్య అంటారు.

               
               

ఆక్సీకరణం: C2H4 ను బేయర్ కారకం ద్వారా (చల్లని, విలీన, క్షార KMnO4 ద్రావణం) పంపిస్తే కారకం వివర్ణమై ఇథలీన్ గ్త్లెకాల్ (యాంటీ ఫ్రీజ్) వస్తుంది..
                       

 హైడ్రోజన్ సంకలనం:  ఈథీన్, హైడ్రోజన్‌తో సంకలనం చెంది ఈథేన్‌ని ఇస్తుంది. 
                       

14. ఎసిటలీన్ తయారు చేసే పద్ధతులు రెండింటిని తెలపండి. ఎసిటలీన్ కింది వాటితో జరిపే చర్యలకు సమీకరణాలు రాయండి.      
(a) H2O     (b) O3      (c) అమ్మోనికల్ AgNO3         (d) అమ్మోనికల్ Cu2Cl2
 జ: డీ హాలోజనీకరణం:    1, 1, 2, 2 - టెట్రాబ్రొమో ఈథేన్‌ని  Zn భస్మంతో వేడిచేస్తే C2H2 వస్తుంది

             
కోల్బ్ విద్యుద్విశ్లేషణ: పొటాషియం మాలియేట్ లేదా ఫ్యుమరేట్ గాఢ జలద్రావణాన్ని విద్యుద్విశ్లేషణ చేస్తే C2H2 వస్తుంది..
         
                    
రసాయన ధర్మాలు:
నీరు సంకలనం: 1% HgSO4 , 30% H2SO4 ల సమక్షంలో C2H2 నీటితో సంకలనం చెంది వినైల్ ఆల్కహాల్‌ను ఇస్తుంది. ఇది మళ్లీ టాటోమరీకరణం చెంది ఎసిటాల్డిహైడ్‌ను ఇస్తుంది. 

15. బెంజీన్ తయారు చేసే పద్ధతులు రెండింటిని తెలపండి. బెంజీన్ హాలోజనీకరణం, నైట్రోకరణం, సల్ఫోనికరణం, ఫ్రీడల్‌క్రాఫ్ట్ చర్యల్ని వివరించండి. 
జ: ఫినాల్ నుంచి: ఫినాల్‌ను జింక్ భస్మంతో స్వేదనం చేస్తే బెంజీన్ వస్తుంది. 


పాలిమరీకరణం: ఎర్రగా కాలిన ఇనుప గొట్టం ద్వారా C2H2ని పంపితే బెంజీన్ వస్తుంది. 
 

                 
                 
రసాయన ధర్మాలు:
ఎలక్ట్రోఫిలిక్ ప్రతిక్షేపణ చర్యలు:
హాలోజనీకరణం: బెంజీన్ Cl2, పొడిగా ఉన్న AlCl3 తో చర్య జరిపి (Cl+ అనే ఎలక్ట్రోఫైల్‌ను ఏర్పరిచి) C6H5Cl ని ఇస్తుంది.


                       

నైట్రోకరణం: బెంజీన్‌ను నైట్రేషన్ మిశ్రమం (1 : 1 ఘనపరిమాణంలో గాఢ HNO& గాఢ H2SO4.
  ఇది N+O2 ఎలక్ట్రోఫైల్‌ను ఏర్పరుస్తుంది)తో 60
oC వరకు వేడిచేస్తే నైట్రో బెంజీన్ వస్తుంది. 
 

                          
సల్ఫోనీకరణం: బెంజీన్, ఓలియం (సధూమ సల్ఫ్యూరికామ్లం)తో చర్య జరిపి బెంజీన్ సల్ఫోనికామ్లాన్ని ఇస్తుంది. (SO3 ఎలక్ట్రోఫైల్‌ను ఇస్తుంది).

                    
ఫ్రీడల్ క్రాఫ్ట్ ఆల్కైలీకరణం: బెంజీన్, CH3Cl నిర్జల AlCl3 తో చర్య జరిపి (C+H3 ఎలక్ట్రోఫైల్‌ను ఇస్తుంది). టోలీన్‌ను ఇస్తుంది.
.

                  

Posted Date : 28-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌