• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జంతు వైవిధ్యం - II

నాలుగు మార్కుల ప్రశ్నలు
 

1. కార్డేటా నాలుగు ముఖ్య లక్షణాలు పేర్కొని, ప్రతి దాని ముఖ్య విధిని తెలపండి.
జ: * పృష్టవంశం - ఉన్నత సకశేరుకాల్లో పృష్టవంశం వెన్నెముకగా ఏర్పడుతుంది.
* పృష్టనాళికాయుత నాడీదండం - ఉన్నత సకశేరుకాల్లో దీని పూర్వ భాగం మెదడుగా, మిగతా భాగం  వెన్నుపాముగా విభేదనం చెందుతుంది.
* గ్రసనీ మొప్ప చీలికలు -  శ్వాస వాయువుల మార్పిడికి  ఉప‌యోగ‌ప‌డుతుంది..
* పాయు పరపుచ్ఛం - ముందుకు క‌ద‌ల‌డానికి స‌మ‌తుల్య‌తా అవయంగా ఉప‌యోగ‌ప‌డుతుంది. 

2. కప్ప హృదయ నిర్మాణాన్ని వివరించండి.

 

కప్ప హృదయం


జ: శరీర కుహరం పైభాగాన కండరయుత హృదయం ఉంటుంది. ఇది రెండు స్తరాల హృదయావరణ త్వచంతో కప్పి ఉంటుంది. మూడు మహా సిరలతో ఏర్పడిన త్రికోణాకార సిరాసరణి పృష్టతలంలో కుడికర్ణికలోకి చేరుతుంది. ఉదరతలంలో జఠరిక ధమనీ శంకువులోకి తెరుచుకుంటుంది. ధమనీ శంకువు రెండు శాఖలుగా తిరిగి అవి ఒక్కొక్కటీ మూడు ధమనీ చాపాలుగా ఏర్పడతాయి. అవి క‌రోట‌, దైహిక‌, పుపుస చ‌ర్మీయ చాపాలు. ధ‌మ‌నీ చాపాలు ర‌క్తాన్ని హృద‌యం నుంచి శ‌రీర భాగాల‌కు స‌ర‌ఫ‌రా చేస్తాయి. ఈ మూడు ముఖ్య సిర‌లు శ‌రీర భాగాల నుంచి ర‌క్తాన్ని సిరాస‌ర‌ణికి చేరుస్తాయి. ఇది ఒక అసంపూర్ణ ద్వంద్వ ప్ర‌స‌ర‌ణ‌.

3. పక్షుల్లో ఎగరడానికి ఏర్పడిన అనుకూలనాలను పేర్కొనండి.
జ: * ఈకలకు ఇంటర్‌లాకింగ్‌ వ్యవస్థ ఉంటుంది. 
* ఎముకలు బోలుగా ఉండి గాలి కుహరాలను కలిగి ఉంటాయి.
* పుచ్ఛకశేరుకాలు కలిసి హలాస్థిని ఏర్పరుస్తాయి.
* ఉడ్డయక కండరాలు 
* అదనపు వాయుగోణులు 
* ఊపిరితిత్తులు స్పంజికాయుతం, పూర్వాంగాలు రెక్క‌లుగా మార్పు చెందిన‌వి.

4. రాటిటే పక్షుల విలక్షణాలను తెలపండి. రెండు ఉదాహరణలు ఇవ్వండి.
జ: * విచ్ఛిన్న విస్తరణను ప్రదర్శిస్తాయి.
* తక్కువ ఈకలను కలిగి ఉంటాయి. ఇవి ప‌రిగెత్తే, ఎగ‌ర‌లేని ఆధునిక ప‌క్షులు.
* ఉరోస్థి ద్రోణి ఉండదు.
* మగ పక్షులకు మేహ‌నం ఉంటుంది . 
* శబ్దిని, జత్రుకలు, పీన్‌గ్రంథి ఉండవు. 
ఉదా: స‌్ట్రుతియో కామెల‌స్ (ఆఫ్రిక‌న్ ఆస్ట్రిచ్‌)
కివి (న్యూజిలాండ్ జాతీయ‌ప‌క్షి).

5. మృదులాస్థి, అస్థి చేపల మధ్య భేదాలు రాయండి.
జ:

  మృదులాస్థి చేపలు

అస్థి చేపలు

1) విషమపాలి పుచ్ఛం

1) సమపాలి పుచ్ఛం

2) ప్లాకాయిడ్‌ పొలుసులు

2) సైక్లాయిడ్‌ పొలుసులు
3) అంతరాస్థి పంజరం మృదులాస్థి

3) అంతరాస్థి పంజరం అస్థియుతం

4) 5 - 7 జతల మొప్ప చీలికలు

4) నాలుగు జతల మొప్ప చీలికలు

5) వాయుకోశం లేదు

5) వాయుకోశం ఉంటుంది.

6) యూరియోటెలిక్ జంతువులు

6) అమ్మోనోటెలిక్ జంతువులు

7) మ‌గ‌జీవులలో శ్రోణివాజాల‌కు సంప‌ర్కదండాలుంటాయి.

7) స్త్రీ, పురుష చేప‌లు వేర్వేరుగా ఉంటాయి.

8) శిశూత్పాద‌కలు

ఉదా: స‌్కోలియోడాన్‌ (సోర‌చేప‌)
ప్రిస్టిస్‌ (రంప‌పు చేప)
టార్పిడో (విద్యుత్ చేప)

8) అండోత్ప‌ద‌కాలు

ఉదా: స‌ముద్ర చేప‌లు- ఎక్సోసీట‌స్ (ఎగిరే చేప‌)
హిప్పోకాంప‌స్ (సముద్ర గుర్రం)
మంచినీటి చేప‌లు- క‌ట్ల‌, లేబియో(రోహు).

రెండు మార్కుల ప్రశ్నలు  

1. ‘చేపల హృదయం జలశ్వాస హృదయం’. ఈ వ్యాఖ్యను మీరు ఎలా సమర్థిస్తారు?
జ: చేపలు రక్తాన్ని కేవలం మొప్పలకు మాత్రమే పంపిణీ చేస్తాయి. కాబట్టి చేపల హృదయం జలశ్వాస హృదయం అనవచ్చు.

 

2. మిల్ట్, స్పాన్‌ మధ్య భేదాలను గుర్తించండి.
జ: మగ కప్పల శుక్ర కణాల రాశి - మిల్ట్‌
   ఆడ కప్పల గుడ్ల రాశి - స్పాన్‌

 

3. షార్క్‌లు, కట్ల చేపల్లో పుచ్ఛవాజం రకం, పొలుసుల పేర్లు తెలపండి.
జ: షార్క్‌లు - విషమపాలి పుచ్ఛవాజం, ప్లాకాయిడ్‌ పొలుసులు
    కట్ల చేపలు - సమపాలి పుచ్ఛవాజం, సైక్లాయిడ్‌ పొలుసులు

 

4. స్త్రీ, పురుష కప్పలను ఎలా గుర్తిస్తారు? 
జ: పురుష కప్పలు స్వ‌ర కోశాలు/సంపర్క కోశాలు, సంపర్క మెత్తను కలిగి ఉంటాయి. ఆడ కప్పల్లో ఇవి ఉండవు.  

5. దక్షిణ భారతదేశంలోని రెండు విషయుత, విషరహిత సర్పాల పేర్లు తెలపండి.
జ: విషయుత సర్పాలు  నాజనాజ - నాగుపాము, బంగారస్‌ - క‌ట్ల‌పాము 
విషరహిత సర్పాలు ట్యాస్ - రాట్‌స్నేక్‌, డ్రయోపిస్‌ -  ప‌స‌రిక‌పాము

Posted Date : 10-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌