• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జీవప్రపంచ వైవిధ్యం  

రెండు మార్కుల ప్రశ్నలు


1. బయోజెనిసిస్‌ అంటే ఏమిటి?

జ:  జీవం, జీవం నుంచి మాత్రమే ఆవిర్భవించడం.
 

2. పిండోత్పత్తి శాస్త్రానికి, ప్రవర్తనా శాస్త్రానికి (ఇథాలజీ) మధ్య భేదం ఏమిటి?

జ:  పిండోత్పత్తి శాస్త్రం - జీవుల్లో జరిగే పిండాభివృద్ధి గురించి తెలిపేది. 

    ప్రవర్తనా శాస్త్రం - జంతువుల ప్రవర్తనను తెలియజేసేది.
 

3.  ‘జంతు ప్రదర్శనశాలలు వర్గీకరణకు ఉపకరణాలు’ వివరించండి.

జ: జంతువుల బాహ్య లక్షణాలు, ఆహారపు అలవాట్లు, ప్రవర్తన లాంటి అంశాల ద్వారా జంతువులను వర్గీకరించడానికి జంతు ప్రదర్శనశాలలు ఉపకరణాలు. 
 

4. టాటోనిమీ అంటే ఏమిటి? రెండు ఉదాహరణలివ్వండి.

జ:  శాస్త్రీయ నామంలో జాతి, ప్రజాతి పేరు ఒకటే కావడం.

ఉదా:  1) నాజ నాజ     2) ఏక్సిస్‌ ఏక్సిస్‌
 

5. ప్రోటోస్టొమియా, డ్యుటిరోస్టొమియాలను విభేదికరించండి.

జ:  ప్రోటోస్టొమియా - ఆది ఆంత్ర రంధ్రం నోరుగా అభివృద్ధి చెందడం.

    డ్యుటిరోస్టొమియా - ఆది ఆంత్ర రంధ్రం పాయువుగా అభివృద్ధి చెందడం.
 

6. ICZN ను విపులీకరించండి.

జ: ఇంటర్నేషనల్‌ కోడ్‌ ఆఫ్‌ జువాలాజికల్‌ నామెన్‌క్లేచర్‌ (అంత‌ర్జాతీయ జంతునామీక‌ర‌ణ నియ‌మావ‌ళి).

7. ప్రకృతి నుంచి లభించే ఏవైనా రెండు ఔషధాలను పేర్కొనండి.

జ: 1) విన్‌ బ్లాస్టిన్‌          2) డిజిటాలిన్‌
 

8. భారతదేశంలోని ఏవైనా నాలుగు పావన వనాలను పేర్కొనండి.

జ: 1) ఖాసీ, జైంటియా కొండలు    2) ఆరావళి పర్వతాలు 

    3) పశ్చిమ కనుమల ప్రాంతం   4) బస్తర్‌
 

9. IUCN ను విపులీకరించండి. అంతరించిపోతున్న జాతుల పట్టికను ఏ పుస్తకంలో ఇచ్చారు?

జ: ఇంటర్నేషనల్‌ యూనియన్‌ ఫర్‌ ది కన్జర్వేషన్‌ ఆఫ్‌ నేచర్‌ అండ్‌ నేచురల్‌ రిసోర్సెస్‌. అంతరించిపోతున్న జాతుల పట్టికను రెడ్‌ డేటా పుస్తకంలో ఇచ్చారు.
 

నాలుగు మార్కుల ప్రశ్నలు 
 

1. ఉష్ణ మండలాల్లో అధిక బయోడైవర్సిటీకి కారణాలు తెలపండి.
జ: * దీర్ఘ పరిణామ కాలం
     * వాతావరణ పరిస్థితులు ఎక్కువ స్థిరత్వం కలిగి ఉండటం
     * అపరిమిత సౌరశక్తి, నీరు లాంటి వనరుల లభ్యత

2.  బయోడైవర్సిటీ హాట్‌స్పాట్స్‌ (తాప ప్రాంతాలు) గురించి లఘుటీక రాయండి. 
జ:  ప్రపంచంలో 34 జీవవైవిధ్య తాప ప్రాంతాలు ఉన్నాయి.
    * భారతదేశంలోని పశ్చిమ కనుమలు, శ్రీలంక భూభాగం
    * ఇండో - బర్మా ప్రాంతం
    * ప్రస్తుత హిమాలయ ప్రాంతం

3. రివెట్‌ పాపర్‌ దృగ్విషయాన్ని వివరించండి.
జ: పాల్‌ ఎల్రిచ్‌ ప్రతిపాదించిన రివెట్‌ పాపర్‌ దృగ్విషయం ఒక ఆవరణ వ్యవస్థ పనీతీరులో జాతి ప్రాముఖ్యాన్ని తెలియజేస్తుంది. ఇతడు పర్యావరణాన్ని విమానంతో, పర్యావరణ జాతులను విమాన రివెట్‌లతోనూ పోల్చాడు. జీవసమాజం నుంచి కొన్ని సందిగ్ధ జాతులను తొలగించడం వల్ల ఆ జీవావరణ వ్యవస్థ నాశనమవుతుందని పేర్కొన్నాడు.

Posted Date : 29-05-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌