• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జంతుదేహ నిర్మాణం

నాలుగు మార్కుల ప్రశ్నలు


1.  మూడు c మృదులాస్థులను వివరించండి.
జ: కాచాభ మృదులాస్థి: నీలి- తెలుపు వ‌ర్ణంలో ఉంటుంది.. దీని మాత్రిక సున్నితమైన కొల్లాజన్‌ సూక్ష్మ తంతువులను కలిగి ఉంటుంది.  ఇది బలహీన మృదులాస్థి. అన్నింటిలో పరి మృదులాస్థి ఉంటుంది. 
     ఉదా: సకశేరుక పిండాలు.
   స్థితిస్థాపక మృదులాస్థి: స్థితిస్థాపక తంతువుల వల్ల పసుపు రంగులో ఉంటుంది. ప‌రి మృదులాస్థి ఉంటుంది.
    ఉదా: వెలుపలి చెవి దొప్ప, ఉప‌జిహ్విక.
   తంతుయుత మృదులాస్థి: మాత్రికలో కట్టలుగా కొల్లాజన్‌ తంతువులు ఉంటాయి. ఇది బలమైన మృదులాస్థి.  ప‌రి మృదులాస్థి ఉండ‌దు.
   ఉదా: అంతర కశేరుక చక్రికలు, శ‌్రోణిముఖ‌ల జ‌ఘ‌నసంధాయ‌కం.

మృదులాస్థి ర‌కాలు

2.    హెవర్షియన్‌ వ్యవస్థను విపులీకరించండి.
జ:    ప్రతి హెవర్షియన్‌ వ్యవస్థ ఏక కేంద్రక వలయంలా ఏర్పడుతుంది. దీని మధ్యలో హెవర్షియన్‌ కుల్య, దానిలో రక్త, శోషనాళాలు ఉంటాయి. హెవర్షియన్‌ నాళం చుట్టూ ఉండే లిక్విణులు, వాటి సూక్ష్మకుల్యల ద్వారా హెవర్షియన్‌ నాళంతో కలుస్తాయి. హెవర్షియన్‌ కుల్య దాని చుట్టూ ఉన్న పటలికలు, లిక్విణులు అన్నింటిని కలిపి ఆస్టియాన్‌ అంటారు. ఇది అస్థి కణజాలంలో నిర్మాణాత్మక, క్రియాత్మక ప్రమాణం.  పోల్క్‌మ‌న్ కుల్య‌లు ఏట‌వాలుగా ఉండి హెవ‌ర్షియ‌న్ కుల్య‌ల‌ను, ప‌ర్య‌స్థిక‌ను, మ‌జ్జా‌కుహ‌రాన్ని క‌లుపుతుంది.

 అస్థి కణజాలం

3. లింఫ్‌/శోషరసం గురించి రాయండి.
జ: ఇది రంగులేని ద్రవం. దీనిలో RBC, రక్త ఫలకికలు, ప్లాస్మా ప్రొటీన్లు ఉండవు. ల్యూకోసైట్‌లు ఎక్కువగా ఉంటాయి. ఇది కణ మధ్యాంతర స్థలంలోకి రక్తం నుంచి ఏర్పడుతుంది. ప్లాస్మా, లింఫోసైట్స్‌లో ఏర్ప‌డుతుంది. ధమనుల్లో  ఏర్పడిన అధిక జలస్థితిక పీడనం దీనికి కారణం. చాలా వరకు మధ్యాంతర ద్రవం నేరుగా రక్త కేశనాళికలను చేరుతుంది. కొంత కణజాల ద్రవం అథో జత్రుకా సిర ద్వారా రక్తాన్ని చేరుతుంది. శోష‌ర‌స నాళాల‌తో ప్ర‌వ‌హించే మ‌ధ్యాంత‌ర ద్రవం- శోష‌ర‌సం.

4. అస్థి పంజర కండర నిర్మాణాన్ని వివరించండి.
జ: ఇవి సాధారణంగా ఎముకలకు స్నాయు బంధనంతో అతుక్కుని ఉంటాయి. దీనిలోని కండర తంతువులు పలుచని ఎండోమైసియం అనే సంయోజక కణజాల తొడుగుతో ఉంటాయి. కండర తంతువుల కట్టను ఫాసికిల్‌ అంటారు. కండర తంతువు పొడవైన, స్తూపాకార శాఖారహిత కణం. సార్కోప్లాజంలో ఉన్న అనేక సూక్ష్మ కండర తంతువులు ఏకాంతరంగా నిష్కాంతి, కాంతి పట్టీలను ప్రదర్శిస్తాయి. అందువల్ల దీన్ని రేఖిత లేదా చారల కండరం అంటారు. ఇది నియంత్రిత కండరం. త్వరగా గ్లానికి గురవుతుంది. దీనిని దైహిక నాడీవ్య‌వ‌స్థ క్ర‌మ‌బ‌ద్దీక‌రిస్తుంది.

5.    హృదయ కండర నిర్మాణాన్ని వివరించండి.
జ: * ఇవి రేఖిత కండరాలు. 
* ఇవి హృదయంలోని మయోకార్డియంలో ఉంటాయి.                                                                      
* ఈ కణాలు పొట్టిగా, స్తూపాకారంగా ఒకటి లేదా రెండు కేంద్రకాలతో, ఒకదానితో ఒకటి కలిసి ఉంటాయి.                         
* వీటి మధ్య రిక్త సంధులు ఏర్పడి విద్యుత్‌ ప్రచోదనాలు హృదయ కండరమంతా వ్యాప్తి చెందుతాయి. 
* హృదయ కండరాల్లో అంతర సంధాయక చక్రికలు ఉంటాయి.
* హృద‌యకండ‌రం అనియంత్రితం. హృద‌య కండ‌రం గ్లానికిలోను  కాదు.
*  హృద‌య కండ‌రంలోని మయోగ్లోబిన్ అణువు నిరంత‌ర వాయు శ్వాస‌క్రియ జ‌రుపుతుంది.

హృదయ కండరం

మరిన్ని ప్రశ్నలు
 

1. గ్రంథి ఉపకళ గురించి రాయండి.        (4మా)
2. బహుధ్రువ న్యూరాన్‌ నిర్మాణాన్ని వివరించండి. (4మా)
3. తిరోగమన అంత్రవేష్టన అవయవాలను తెలపండి. (2మా)
4. నాళంలో నాళం వ్యవస్థీకరణ మొదట ఏ జంతువులో కనిపించింది? వాటి శరీర కుహరం పేరు తెలపండి. (2మా)
5. హిమాటోక్రిట్‌ విలువ అంటే ఏమిటి?      (2మా) 

 

రెండు మార్కుల ప్రశ్నలు
 

1. శీర్షత అంటే ఏమిటి? అది జీవులకు ఎలా ఉపయోగపడుతుంది?
జ: జీవుల పూర్వాంతంలో నాడీ, జ్ఞాన కణాలు కేంద్రీకృతం కావడం వల్ల శీర్షత ఏర్పడుతుంది. ఇది ఆహార సముపార్జన, ద్విపార్శ్వ సౌష్ఠవం, రక్షణకు ఉపయోగపడుతుంది.

 

2. అంతస్స్రావక, బహిస్స్రావక గ్రంథుల తేడాలను ఉదాహరణలతో తెలపండి.
జ: బహిస్స్రావక గ్రంథులు: నాళసహితం, శ్లేష్మం, లాలాజలం, చెవి గులిమి.
      అంతస్స్రావక గ్రంథులు: నాళరహితం, హార్మోన్‌లు వాటి స్రావాలు.

 

3. హోలోక్రైన్, ఎపోక్రైన్‌ గ్రంథుల మధ్య తేడాలను గుర్తించండి.
జ: హోలోక్రైన్‌: కణం మొత్తం విచ్ఛిన్నం చెంది దానిలోని స్రావకాలను వెలుపలకు విడుదల చేస్తుంది.
      ఎపోక్రైన్‌: కణ అగ్రభాగం స్రావక పదార్థంతో సహా కణం నుంచి తెగి, విడిపోతుంది.

 

4.  మాస్ట్‌ కణాలు స్రవించే రెండు పదార్థాలు, వాటి విధులను తెలపండి.
జ: * హెపారిన్‌ - రక్త స్కంద‌న నిరోధకం
     * సెరటోనిన్‌ - రక్త నాళ సంకోచకం

5. స్నాయువు, స్నాయు బంధనం మధ్య తేడాలను తెలపండి.
జ: స్నాయువు: ఎముకలను ఇతర ఎముకలతో అతికించే బంధకం.
     స్నాయు బంధనం: కండరాలను ఎముకలతో అతికించే బంధకం.

 

6. గోధుమ కొవ్వు, తెలుపు కొవ్వుల మధ్య తేడాలను తెలపండి.
జ: గోధుమ కొవ్వు: గర్భస్థ పిండం, శిశువుల్లో ఎక్కువగా ఉంటుంది. జీవనక్రియలో క్రియాశీలంగా ఉంటుంది.
     తెలుపు కొవ్వు: ప్రౌఢ జీవుల్లో ఎక్కువగా ఉంటుంది. జీవనక్రియలో క్రియాశీలంగా ఉండదు.

 

7. అత్యంత బలమైన మృదులాస్థి ఏది? ఇది మానవుడి శరీరంలో ఏ భాగాల్లో కనిపిస్తుంది?
జ: తంతుయుత మృదులాస్థి. ఇది అంతర కశేరుక చక్రికల్లో, శ్రోణి మేఖల జఘన సంధాయకంలో ఉంటుంది.

Posted Date : 10-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌