• facebook
  • twitter
  • whatsapp
  • telegram

జీవావరణం - పర్యావరణం

4 మార్కుల ప్రశ్నలు


1.  సముద్ర జంతువులు అధిక గాఢత జలానికి ఏవిధంగా అనుకూలనం ఏర్పరచుకుంటాయి?

జ: సముద్రపు నీటిలో లవణ గాఢత దేహద్రవ్యాల గాఢత కంటే ఎక్కువగా ఉంటుంది. ఫలితంగా సముద్ర జంతువుల దేహం నుంచి నిరంతరం బాహ్య ద్రవాభిసరణ ద్వారా నీరు వెలుపలికి వెళ్లడంతో దేహం నిర్జలీకరణకు గురవుతుంది. అందువల్ల సముద్ర చేపలకు వృక్క ప్రమాణాలు తక్కువగా ఉన్న రక్తకేశనాళికా గుచ్ఛరహిత మూత్రపిండాలు ఉంటాయి. ఇవి మూత్రం ద్వారా విసర్జింపబడే నీటిని తగ్గిస్తాయి. దేహంలో లవణ సమతాస్థితిని నియంత్రించడంలో లవణాలను స్రవించే క్లోరైడ్‌ కణాలు మొప్పల్లో ఉంటాయి. సాగర పక్షులైన సీగల్స్, పెంగ్విన్‌ నాసికానాళాల నుంచి లవణ ద్రవం చుక్కలుగా వెలువడుతుంది. తాబేళ్లలో నేత్రాల సమీపంలో క్లోరైడ్‌ స్రవించే గ్రంథి నాళాలు తెరుచుకొని ఉంటాయి. కొన్ని మృదులాస్థి చేపల్లో యూరియా, ట్రైమిథైల్‌ అమైన్‌ ఆక్సైడ్‌ రక్తంలో ఉండి, దేహద్రవ్యాలను సాగరనీటితో సమగాఢతలో ఉంచడంలో నిర్జలీకరణ జరగకుండా ఆపుతుంది.
 

2. గ్రీష్మకాల స్తరీభవనం అంటే ఏమిటి? వివరించండి.

జ:  సమశీతోష్ణ సరస్సుల్లో గ్రీష్మ కాలంలో ఉష్ణోగ్రత పెరగడం వల్ల ఉపరితల నీటి సాంద్రత తగ్గుతుంది. సరస్సులోని ఉపరితలంలోని ఈ వెచ్చని నీటి పొరను ఎపిలిమ్నియాన్‌ అంటారు. దీని కింద థర్మోక్లైన్‌ మండలం ఉంటుంది. ఈ నీటిలో లోతుకు వెళ్లేకొద్దీ మీటర్‌కు 1 ºC చొప్పున ఉష్ణోగ్రత తగ్గుతుంది. సరస్సులో అడుగు పొరను హైపోలిమ్నియాన్‌ అంటారు. ఈ ప్రాంతంలోని నీరు చల్లగా ఉండి, దీనికి ఆక్సిజన్‌ శాతం తక్కువగా ఉంటుంది. శరదృతువు రాగానే ఉపరితల ఎపిలిమ్నియాన్‌లో నీరు చల్లబడి 4 ºC కు ఉష్ణోగ్రత చేరగానే నీటి బరువు అధికమై పైన ఉన్న సరస్సు పొర కుంగుతుంది. నీరు తారుమారవడం ద్వారా ఈ కాలంలో సరస్సు అంతా ఒకే రకమైన ఉష్ణోగ్రత ఏర్పడుతుది. శరదృతువులో జరిగే ఈ నీటి ప్రసరణను శరదృతువు తారుమారు అంటారు.

2 మార్కుల ప్రశ్నలు
 

1. కాంతి గతిక్రమం, కాంతి అనుగమనం మధ్య భేదాలను తెలపండి.

జ: కాంతి గతిక్రమం (ఫొటోటాక్సిస్‌): కాంతికి నిర్దిష్ట దిశలో చలనం జరపడం.

    కాంతి అనుగమనం (ఫొటో కైనసిస్‌): కాంతికి జంతువుల్లో కలిగే దిశలేని చలన ప్రతిక్రియ.
 

2. జాత్యంతర పోటీ అంటే ఏమిటి? ఒక ఉదాహరణ రాయండి.
జ: రెండు దగ్గరి జాతి జీవులు అందుబాటులో ఉన్న ఒకే రకమైన తక్కువ మొత్తంలో గల వనరుల కోసం పోటీ ఏర్పడుతుంది. దీన్నే జాత్యంతర పోటీ అంటారు. ఉదా: సముద్ర నక్షత్రం పిసాస్టర్‌. (ఇది పరభక్ష జీవి)

 

3. జీవావరణ వ్యవస్థ అంటే ఏమిటి?
జ: జీవావరణ వ్యవస్థ జీవగోళం యొక్క క్రియాత్మక ప్రమాణం. దీనిలో జీవుల మధ్య శక్తి ప్రసరణ జరిగి ఒక నిర్దిష్టమైన పోషక నిర్మాణ వ్యవస్థ ఏర్పడుతుంది.

 

4. భ్రమణరూప విక్రియ అంటే ఏమిటి? డాఫ్నియాలో దాని ప్రాముఖ్యాన్ని వివరించండి.
జ: కొన్ని జంతువుల్లో శరీర నిర్మాణం రుతువులను బట్టి ఉష్ణోగ్రతలో మార్పులకు అనుగుణంగా వాటి శరీర భాగాలు రూపాంతరం చెందుతాయి. ఈ దృగ్విషయాన్ని భ్రమణరూప విక్రియ అంటారు. ఈ విషయాన్ని డాఫ్నియా అనే ప్లవక క్రస్టేషియాలో కోకర్‌ అనే శాస్త్రవేత్త వివరించారు.

 

5. అన్యోన్యాశ్రయ సహజీవనాన్ని నిర్వచించండి.
జ: అన్యోన్యాశ్రయ సహజీవనంలో రెండు జాతి జీవులు లాభం పొందుతాయి.  ఉదా: లైకెన్స్‌

 

6. కమొప్లేజ్‌ (రక్షక వర్ణం) అంటే ఏమిటి? దాని ప్రాముఖ్యాన్ని తెలపండి.
జ: కొన్ని కీటకాలు, కప్పలు పరిసరాల రంగుతో కలిసిపోయే వర్ణాన్ని ప్రదర్శించడం వల్ల పరభక్షకాలు వాటి ఉనికిని తేలికగా గుర్తించలేవు.

Posted Date : 22-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌