• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప్రమేయాలు

నిర్వచనం:  A అనే సమితిలోని ప్రతీ మూలకం B అనే సమితిలోని ఒకే ఒక మూలకంతో అనుసంధానం కలిగి ఉంటే, ఈ అనుసంధానాన్ని A నుంచి B కి ఒక ప్రమేయం అంటారు.
               A అనే సమితిని ప్రదేశమని, B అనే సమితిని సహప్రదేశమని అంటారు.       
  

   ప్రదేశము = {1, 2, 3, 4, 5}

   సహప్రదేశము = {a, b, c, d, e, f}
   వ్యాప్తి = {a, b, c, d, f}

 A నుండి B కు మొత్తం ప్రమేయాలు సంఖ్య
          n × n × ..... m సార్లు = nm
 A లోని ప్రతీ మూలకం అనుసంధానం కలిగి ఉండాలి.
 B అనే సమితిలోని ప్రతీ మూలకం అనుసంధానం కలిగి ఉండాల్సిన అవసరం లేదు.
 A అనే సమితిలోని మూలకాలతో అనుసంధానం కలిగి ఉన్న B అనే సమితిలోని మూలకాల సమితిని వ్యాప్తి అంటారు.

 వ్యాప్తి అనేది సహప్రదేశానికి ఉపసమితి అవుతుంది.


ప్రమేయాల రకాలు

అన్వేక ప్రమేయం:  A లోని విభిన్న మూలకాలకు B లో విభిన్న ప్రతిబింబాలు ఉంటే AB  అనే ప్రమేయాన్ని అన్వేక ప్రమేయం అంటారు.    
                   
   
గమనిక: f అనేది అన్వేకం కాకపోతే దాన్ని బహుఏక ప్రమేయం అంటారు. 


సంగ్రస్త ప్రమేయం: B లోని ప్రతి మూలకం A లోని కనీసం ఏదో ఒక మూలకానికి ప్రతిబింబం అయితే f : A B అనే ప్రమేయాన్ని సంగ్రస్త ప్రమేయం అంటారు. 
i.e సహప్రదేశం = వ్యాప్తి

గమనిక: f అనేది సంగ్రస్త ప్రమేయం కాకపోతే దాన్ని అసంగ్రస్త ప్రమేయం అంటారు.
 

ద్విగుణ ప్రమేయం: f : AB అనే ప్రమేయం అన్వేకం మరియు సంగ్రస్తం రెండూ అయితే f : AB ను ద్విగుణ ప్రమేయం అంటారు.

ద్విగుణ ప్రమేయాల సంఖ్య:
n(A) = m = n(B), అయితే A నుంచి B కు నిర్వచింపగలిగిన ద్విగుణ ప్రమేయాల సంఖ్య: m!
 

స్థిరప్రమేయం: f : AB అనే ప్రమేయంలో f యొక్క వ్యాప్తి ఒక మూలకాన్ని మాత్రమే కలిగి ఉంటే అంటే కు f(x) = k అయ్యేవిధంగా B లో k అనే స్థిర మూలకం ఉంటే f ను స్థిరప్రమేయం అంటారు. 


గమనిక: (1): ఒక స్థిరప్రమేయం యొక్క సహప్రదేశం ఒకే ఒక మూలకం కలిగి ఉన్న సమితి అయితే ఆ స్థిర ప్రమేయం సంగ్రస్తం అవుతుంది. 
(2): ఒక స్థిర ప్రమేయం యొక్క ప్రదేశం ఒకే ఒక మూలకం కలిగి ఉన్న సమితి అయితే ఆ స్థిర ప్రమేయం అన్వేకం అవుతుంది.
 

తత్సమ ప్రమేయం: f : A A అనే ప్రమేయం f(x) = x గా నిర్వచితమైన ప్రమేయం, అంటే A లోని ప్రతీ మూలకానికి f మూలంగా అదే మూలకం ప్రతిబింబమైతే అప్పుడు f : AA ను తి పై తత్సమ ప్రమేయం అంటారు. దీన్ని IA (లేదా) I తో సూచిస్తారు.

సంయుక్త ప్రమేయం (లేదా) లబ్ధ ప్రమేయం:  f : AB మరియు g : B C అనేవి రెండు ప్రమేయాలైతే (gof)(a) = g[f(a)] గా నిర్వచితమైన gof : AC అనే ప్రమేయాన్ని f, g ల సంయుక్త ప్రమేయం అంటారు. 


బేసి ప్రమేయం: x కు f(-x) = - f(x) అయితే f(x) ను బేసి ప్రమేయం అంటారు. 


సరి ప్రమేయం: x కు f(-x) = f(x) అయితే f(x) ను సరి ప్రమేయం అంటారు. 


ఘాత ప్రమేయం: a > 0, a ≠ 1, a ∈ R అయితే f(x) = ax అనే ప్రమేయాన్ని ఘాత ప్రమేయం అంటారు.


సంవర్గమాన ప్రమేయం:  a > 0, a ≠ 1, a ∈ R అయితే f(x) = logax అనే ప్రమేయాన్ని సంవర్గమాన ప్రమేయం అంటారు.


సిగ్నమ్ ప్రమేయం: దీన్ని y = Sgn(x) తో సూచిస్తారు. దీన్ని కింది విధంగా నిర్వచిస్తారు. 
 


కొన్ని ప్రమేయాల ప్రదేశాలు, వ్యాప్తులు



భావనాత్మక సిద్ధాంతాలు
సిద్ధాంతం
1: f : A B  మరియు g : B C అనేవి రెండు అన్వేక ప్రమేయాలైతే gof : A C అనే ప్రమేయం అన్వేకం అవుతుందని నిరూపించండి.
నిరూపణ: ఇచ్చినది
f : A B మరియు g : B C  అనేవి రెండు అన్వేక ప్రమేయాలు. gof : A C అనేది కూడా అన్వేకం అని నిరూపిస్తాం

 a1, a2  ∈ A అనుకుందాం
 f(a1), f(a2) ∈ B మరియు g(f(a1)), g(f(a2)) ∈ C
           (gof)(a1), (gof)(a2) ∈ C
           ఇప్పుడు (gof)(a1) = (gof)(a2)
           g[f(a1)] = g[f(a2)]
                    f(a1) = f(a2) [...   g అన్వేకం]
           
a1 = a2 [ f అన్వేకం]
     కాబట్టి
gof: A C అనేది అన్వేక ప్రమేయం.

2: f : A B, g : B C  అనేవి రెండు సంగ్రస్త ప్రమేయాలైతే gof : A C అనేది కూడా సంగ్రస్తం అవుతుందని నిరూపించండి.
నిరూపణ: ఇచ్చినది
f : A B, g : B C అనేవి రెండు సంగ్రస్త ప్రమేయాలు gof : A C కూడా సంగ్రస్తం అని నిరూపిస్తాం 
               

 a ∈ A, b ∈ B, c ∈ C
 g : B C సంగ్రస్త ప్రమేయం కాబట్టి .
g(b) = c అయ్యేవిధంగా b ∈ B అనేది వ్యవస్థితమవుతుంది.
f : A B సంగ్రస్త ప్రమేయం కాబట్టి.
 f(a) = b అయ్యేవిధంగా a ∈ A అనేది వ్యవస్థితమవుతుంది. 
ఇప్పుడు
g(b) = c
 g[f(a)] = c
 (gof)(a) = c
కాబట్టి ఏదైనా మూలకం c ∈ C కు, (gof)(a) = c అయ్యేవిధంగా  a ∈ A అనేది వ్యవస్థితమవుతుంది.
కాబట్టి,
gof : A C అనేది సంగ్రస్తం.

Posted Date : 07-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌