• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ప‌దార్థం - ఉష్ణ‌ ధ‌ర్మాలు

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

1. చతురస్రాకారపు లోహపు పళ్లెం మధ్యలో ఒక గుండ్రటి రంధ్రం ఉంది. ఆ పళ్లేన్ని వేడిచేస్తే అందులోని రంధ్రపు వ్యాసం ఎలా మారుతుంది?
జ: రంధ్రపు వ్యాసం ఎక్కువవుతుంది. ఎందుకంటే, రంధ్రం అంతే వ్యాసం ఉన్న గుండ్రటి బిళ్లలా ప్రవర్తిస్తుంది.


2. ఒక ఇత్తడి బిళ్లలోని రంధ్రంలో ఒక స్టీలు కడ్డీని బిగుతుగా అమర్చారు. స్టీలు కడ్డీని సులువుగా బయటకు తీయాలంటే, ఆ వ్యవస్థను వేడిచేయాలా లేక చల్లార్చాలా?
జ: ఆ వ్యవస్థను చల్లార్చాలి ఎందుకంటే స్టీలు దీర్ఘవ్యాకోచ గుణకం ఇత్తడి వ్యాకోచ గుణకం కంటే తక్కువ.


3. ఒక వస్తువును వేడిచేస్తే దాని సాంద్రత విలువలు ఎలా మార్పు చెందుతాయి?
జ: సాంద్రత తగ్గుతుంది.


4. గాజును సీల్ చేయాలంటే ప్లాటినమ్‌నే ఎందుకు వాడతారు?
జ: గాజు, ప్లాటినమ్‌ల దీర్ఘ వ్యాకోచ గుణకాల విలువ చాలా వరకు సమానం కాబట్టి


5. ద్విలోహాత్మక పట్టీ అంటే ఏమిటి?
జ: రెండు వేర్వేరు లోహపు పట్టీలను ఒకటిగా అతికిస్తే ఆ సంయుక్త పట్టీ ద్విలోహాత్మక 'థర్మోస్టాట్‌గా పనిచేస్తుంది. 

6. L1, L2 పొడవులుగా,  లు దీర్ఘ వ్యాకోచ గుణకాలుగా ఉన్న రెండు వేర్వేరు లోహాల వ్యాకోచాలు అన్ని ఉష్ణోగ్రతల వద్ద సమానంగా ఉండాలంటే కావలసిన నిబంధనలను తెలపండి.


7. ఒక ద్రవపు దృశ్య వ్యాకోచ గుణకం అది ఉండే పాత్ర పదార్థపు ఘనపరిమాణ వ్యాకోచ గుణకానికి  నాలుగింతలు ఉంటే, ఆ ద్రవపు నిజ వ్యాకోచ గుణకం r కు ఎన్ని రెట్లుంటుంది?
జ:  


     

8. ఒక శీతల దేశంలోని పరిసరాల ఉష్ణోగ్రత -10oC ఉంటే. అక్కడి సరస్సులో లోతైన ప్రదేశంలోని ఉష్ణోగ్రత ఎంత ఉంటుంది?
జ:
4oC  లేక  277  కెల్విన్లు


9. నీటి గరిష్ఠ సాంద్రతను కనుక్కోవడానికి ఉపయోగించే సాధనం పేరేమిటి?
జ: డైలటో మీటర్


10. 4oC వద్ద ఉన్న నీటిని వేడిచేస్తే దాని సాంద్రత విలువ ఏమవుతుంది?
జ: తగ్గుతుంది.


11. శీతాకాలంలో సరస్సుల ఉపరితలాలు ముందుగా ఘనీభవించడానికి కారణం ఏమిటి?
జ: నీటికి ఉండే అసంగత వ్యాకోచ ధర్మం. 

12. కెల్విన్ స్కేలులో కనిష్ఠ ఉష్ణోగ్రత స్థానం విలువ ఎంత?
జ:
 -273oC  లేదా  O K


13. ఒక ఆదర్శ వాయువు P X V లబ్ధం ఏ కారకాలపై ఆధారపడి ఉంటుంది?
జ: వాయువు ద్రవ్యరాశి, ఉష్ణోగ్రతలపై ఆధారపడి ఉంటుంది.


14. టైర్లలోని గాలి పీడనాన్ని కొలిచే పరికరం శూన్య విలువను సూచిస్తే, టైరులోని గాలి పీడనం ఎంత?
జ: వాతావరణ పీడనానికి సమానం.


15. పదార్థాల భౌతిక ధర్మాలపై ఆధారపడని ఉష్ణోగ్రతా స్కేలు ఏది?
జ: కెల్విన్ లేదా పరమోష్ణోగ్రతా స్కేలు.


16. మూడు వేర్వేరు ఘన పదార్థాల దీర్ఘ, వైశాల్య, ఘనపరిమాణ వ్యాకోచ గుణకాల నిష్పత్తి 1 : 6 : 18 అయితే, వాటి దీర్ఘవ్యాకోచ గుణకాల నిష్పత్తి ఎంత?

17. అన్ని ఉష్ణోగ్రతల వద్ద రెండు ఇనుప, రాగి కడ్డీల పొడవుల్లో తేడాలు 0.25 మీటర్లు ఉండాలంటే, 0జీ ది వద్ద వాటి పొడవుల విలువ ఎంత ఉండాలి?

జ: ఇనుము  విలువ రాగి  విలువ కంటే తక్కువ కాబట్టి 0oC వద్ద ఇనుప కడ్డీ పొడవు (Liron), రాగి కడ్డీ పొడవు (Lcopper) కంటే ఎక్కువ.
Liron - Lcopper = 25 సెం.మీ.
అన్ని ఉష్ణోగ్రతల వద్ద ఆ కడ్డీల పొడవుల తేడా స్థిరంగా ఉండాలంటే, నిబంధన


18. ఒక ద్రవ సాంద్రత 0oవద్ద ఉన్న విలువ కంటే ఏ ఉష్ణోగ్రత వద్ద అందులో 10 శాతం తక్కువగా ఉంటుంది? ద్రవ నిజ వ్యాకోచ గుణకం. 
జ: do = 100 అనుకోండి అపుడు d1 = 90 అవుతుంది.
    

19. కొంత ద్రవ్యరాశి ఉన్న స్థిరపీడనంలోని ఆదర్శ వాయువు సాంద్రత పరమోష్ణోగ్రత లబ్ధం స్థిరాంకమని చూపండి.
జ: చార్లెస్ నియమం ప్రకారం (స్థిరపీడనం వద్ద)  
v = KT, K అనుపాత స్థిరాంకం ఎందుకంటే m ద్రవ్యరాశి ఇచ్చిన వాయువుకు స్థిరంగా ఉంటుంది.

Posted Date : 27-11-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌