• facebook
  • twitter
  • whatsapp
  • telegram

కర్బన రసాయనశాస్త్రం

ప్ర‌శ్న‌లు - జ‌వాబులు

ఇంటర్ పబ్లిక్ పరీక్షలో కర్బన రసాయనశాస్త్రం నుంచి 10 మార్కుల ప్రశ్నలు వస్తున్నాయి. ముఖ్యంగా ఆల్కేన్‌లు, ఆల్కీన్‌లు, ఆల్కైన్‌లు, బెంజీన్ వివిధ తయారీ పద్ధతులు, వాటి రసాయన ధర్మాలు, సాదృశ్యాల్లో రకాలు, పేరుతో ఉన్న చర్యలు, IUPAC నియమాల నుంచే ఎక్కువ ప్రశ్నలు వస్తున్నాయి. ఇంకా కర్బన సమ్మేళనాలను శుద్ధి చేసే విధానాలు, గుణాత్మక, పరిమాణాత్మక విశ్లేషణలు, రసాయన చర్యల్లో రకాలు, చర్యా సంవిధానాలు, ఎలక్ట్రాన్‌ల స్థానభ్రంశం - ప్రభావాలు, ప్రమేయ సమూహాల స్థాన నిర్దేశికతలను నేర్చుకోవాలి.

4 మార్కుల ప్రశ్నలు

1. కిందివాటిని ఒక్కొక్క ఉదాహరణతో వివరించండి.

ఎ) ఉర్ట్‌జ్ చర్య బి) ఫ్రిడెల్-క్రాఫ్ట్ ఆల్కైలీకరణం

జ: ఎ) ఆల్కైల్ హాలైడ్‌లు పొడి ఈథర్ సమక్షంలో సోడియంతో చర్య జరిపి ఆల్కైల్ హాలైడ్‌ల కంటే రెండు రెట్లు ఎక్కువ కార్బన్‌లున్న హైడ్రోకార్బన్‌ను ఏర్పరిచే చర్య.

ఉదా:

బి) బెంజీన్‌ను తేమలేని AlCl3 సమక్షంలో ఆల్కైల్ హాలైడ్‌తో చర్య జరిపి ఆల్కైల్ బెంజీన్‌ను ఏర్పరిచే చర్య.

ఉదా:

2. ఎ) స్థాన సాదృశ్యం బి) ప్రమేయ సమూహ సాదృశ్యాలను ఒక్కొక్క ఉదాహరణతో వివరించండి.

జ: ఎ) కర్బన శృంఖలం మీద ఉండే ప్రతిక్షేపకం లేదా ప్రమేయ సమూహం లేదా ద్వి, త్రిక బంధాల స్థానాల్లో వచ్చిన భేదాల వల్ల ఏర్పడే సాదృశ్యం.

ఉదా:    

బి) రెండు లేదా ఎక్కువ సమ్మేళనాలు ఒకే అణు సంకేతాన్ని, వేర్వేరు ప్రమేయ సమూహాలను కలిగి ఉండటం వల్ల ఏర్పడే సాదృశ్యం.

ఉదా:  

3. క్షేత్రసాదృశ్యం అంటే ఏమిటి? బ్యూటీన్ - 2 క్షేత్రసాదృశ్యాలను వివరించండి.

జ: ద్విబంధ కార్బన్ చుట్టూ ఉన్న పరమాణువులు, సమూహాలను విభిన్న ప్రాదేశిక అమరికలు చేస్తే ఏర్పడే సాదృశ్యాన్ని క్షేత్రసాదృశ్యం అంటారు. ఒకే సమూహాలను కార్బన్ పరమాణువులకు ఒకేవైపు అమరిస్తే దాన్ని ''సిస్ సాదృశ్యం" అని, కార్బన్ పరమాణులను రెండు వైపులా అమరిస్తే దాన్ని ''ట్రాన్స్ సాదృశ్యం" అని అంటారు.

                          

          సిస్ - 2 - బ్యూటీన్                  ట్రాన్స్ - 2 - బ్యూటీన్

4. మార్కోనికాఫ్ నియ‌మం, ఖరాష్ ప్రభావాలను వివరించండి.

జ‌: మార్కోనికాఫ్ నియ‌మం: ఒక కార‌కంలో ఉండే రుణావేశ భాగం, త‌క్కువ సంఖ్యలో Hలున్న ద్విబంధ కార్బన్ పై సంక‌ల‌నం చెందుతుంది.      

ఖరాష్ ప్రభావం (వ్యతిరేక మార్కొనికాఫ్ నియమం): పెరాక్సైడ్ సమక్షంలో, ఒక కారకంలో ఉండే రుణావేశ భాగం, ఎక్కువ సంఖ్యలో H లున్న ద్విబంధ కార్బన్‌పై సంకలనం చెందుతుంది.

5. ఎసిటలీన్‌ను తయారు చేయడానికి రెండు పద్ధతులను తెలపండి.

జ: 1.కాల్షియం కార్బైడ్‌ను జలవిశ్లేషణ చేయడం ద్వారా ఎసిటలీన్‌ను పారిశ్రామికంగా తయారుచేస్తారు.

              

2. విసినాల్ డై హాలైడ్‌లను ముందుగా ఆల్కహాలిక్ KOH తో, తర్వాత సోడామైడ్‌తో చర్య జరిపితే ఎసిటలీన్ ఏర్పడుతుంది.

6. బెంజీన్‌ను తయారు చేసే 2 పద్ధతులను తెలపండి

జ: సోడియం బెంజోయేట్‌ని సోడాలైమ్‌తో (NaOH + CaO) వేడిచేస్తే బెంజీన్ ఏర్పడుతుంది.

 

 

 ఫీనాల్‌ని జింకుతో స్వేదనం చేస్తే బెంజీన్ ఏర్పడుతుంది.

      

   

2 మార్కుల ప్రశ్నలు

1. C3H6O అణుఫార్ములాతో వచ్చే ప్రమేయ సమూహ సాదృశ్యాలను రాయండి.

జ: ప్రొపనోన్ 2 (CH3 CO CH3)

ప్రొపనాల్ (CH3 CH2 CHO)

2.   ల IUPAC పేర్లను రాయండి.

జ: ఎ) 2 - పెంటనోన్ బి) 1, 3 - బ్యుటాడైఈన్

3. కిందివాటి నిర్మాణాలను రాయండి.

ఎ) ట్రైక్లోరో ఇథనోయిక్ ఆమ్లం, బి) నియోపెంటేన్

జ:

4. CHCl = CFBr అణువుకు E, Z విన్యాసాలను రాయండి.
 

        

(వృత్తంలో ఉన్న పరమాణువుకు అధిక పరమాణు సంఖ్య ఉంటుంది.)

5 'కార్సినోజెనిటీ' అంటే ఏమిటి? రెండు ఉదాహరణలు ఇవ్వండి.

జ: పొగాకు, బొగ్గు, పెట్రోలియం లాంటి పదార్థాలు అసంపూర్తిగా దహనం చెందినప్పుడు ఏర్పడే బహుకేంద్రక బెంజీన్ వలయాలు (2 కంటే ఎక్కువ) కేన్సర్ కలిగించడాన్ని 'కార్సినోజెనిటీ' అంటారు.

ఉదా: 1, 2 బెంజ్ పైరీన్, 1, 2 బెంజాంథ్రసీన్

6. ప్రేరేపక ప్రభావం అంటే ఏమిటి?

జ: ఒక సంతృప్త కర్బన సమ్మేళనంలో సిగ్మా బంధంలో ఉండే ఎలక్ట్రాన్‌లు ఎక్కువ రుణ విద్యుదాత్మకత ఉన్న పరమాణువు వైపు స్థానభ్రంశం చెంది ధ్రువ సమయోజనీయ బంధాన్ని ఏర్పరచడం.

ఉదా:

           

Posted Date : 26-11-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

ప్రత్యేక కథనాలు

మరిన్ని

విద్యా ఉద్యోగ సమాచారం

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌