• facebook
  • whatsapp
  • telegram

లెఫ్టినెంట్‌ అవుతారా? 

ఆర్మీలో టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సు 

ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారినీ, ఆఖరి సంవత్సరం చదువుతున్నవారినీ టెక్నికల్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సుల్లోకి ఇండియన్‌ ఆర్మీ ఆహ్వానిస్తోంది. సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూలతో నియామకాలు చేపడతారు. ఈ విధానంలో అర్హత సాధించినవారికి స్టైపెండ్‌తో కూడిన శిక్షణ అందిస్తారు. అనంతరం లెఫ్టినెంట్‌ హోదాతో విధుల్లోకి తీసుకుంటారు. 

వచ్చిన దరఖాస్తులను బీటెక్‌ మార్కుల మెరిట్‌ ప్రకారం షార్ట్‌లిస్టు చేస్తారు. వీరికి సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డు (ఎస్‌ఎస్‌బీ) బెంగళూరులో ఐదు రోజులుపాటు రెండు దశల్లో సైకలాజికల్‌ పరీక్షలు, గ్రూప్‌ పరీక్షలు, ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంది. వీటిని సైకాలజిస్ట్, గ్రూప్‌ టెస్టింగ్‌ ఆఫీసర్, ఇంటర్వ్యూయింగ్‌ ఆఫీసర్‌ ఆధ్వర్యంలో చేపడతారు. తొలిరోజు స్టేజ్‌-1 స్క్రీనింగ్‌ (ఇంటలిజెన్స్‌) పరీక్షలు ఉంటాయి. ఇందులో అర్హత సాధించినవారిని స్టేజ్‌-2కి ఎంపిక చేస్తారు. వీరికి నాలుగు రోజులపాటు పలు విభాగాల్లో పరీక్షించి, అందులో రాణించినవారికి వైద్య పరీక్షలు నిర్వహించి శిక్షణకు తీసుకుంటారు.

శిక్షణ

కోర్సులోకి ఎంపికైనవారికి ఇండియన్‌ మిలటరీ అకాడెమీ, దేహ్రాదూన్‌లో జనవరి, 2023 నుంచి 49 వారాలపాటు శిక్షణ ఉంటుంది. ఈ సమయంలో ప్రతి నెలా రూ.56,100 స్టైపెండ్‌ చెల్లిస్తారు. విజయవంతంగా శిక్షణ పూర్తిచేసుకున్నవారిని లెఫ్టినెంట్‌ హోదాతో శాశ్వత ప్రాతిపదికన విధుల్లోకి తీసుకుంటారు. ఉద్యోగంలో చేరిన తర్వాత రూ.56,100 మూలవేతనంతోపాటు రూ.15,500 మిలటరీ సర్వీస్‌ పే అందుతాయి. వీటికి డీఏ, ఇతర ప్రోత్సాహకాలు అదనం. అందువల్ల తొలి నెల నుంచే సుమారు రూ.లక్షకుపైగా వేతనం అందుకోవచ్చు. తక్కువ వ్యవధిలోనే ఉన్నత స్థాయి హోదాలు సొంతం చేసుకోవచ్చు. రెండేళ్ల సర్వీస్‌తో కెప్టెన్, ఆరేళ్లు కొనసాగితే మేజర్, 13 ఏళ్ల సేవలతో లెఫ్టినెంట్‌ కల్నల్‌ కావచ్చు.  

మొత్తం ఖాళీలు: 40

విభాగాలవారీ.. సివిల్‌ పరిధిలో 9, ఆర్కిటెక్చర్‌ 1, మెకానికల్‌ 6, ఎలక్ట్రికల్‌/ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ 3, కంప్యూటర్‌ సైన్స్‌ 8, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ 3, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ టెలికమ్యూనికేషన్‌ 1, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ 3, ఏరోనాటికల్‌/ ఏరోస్పేస్‌ 1, ఎలక్ట్రానిక్స్‌ 1, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ 1, ప్రొడక్షన్‌ 1, ఇండస్ట్రియల్‌ 1, ఆటోమొబైల్‌ 1. 

అర్హత: నిర్దేశిత/ అనుబంధ బ్రాంచీల్లో ఇంజినీరింగ్‌ పూర్తిచేసుకున్నవారు, ప్రస్తుతం ఆఖరు సంవత్సరం కోర్సుల్లో ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టులకు అవివాహిత పురుషులే అర్హులు.

వయసు: జనవరి 1, 2023 నాటికి 20 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. అంటే జనవరి 2, 1996; జనవరి 1, 2003 మధ్య జన్మించాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులు: జూన్‌ 9 మధ్యాహ్నం 3 వరకు స్వీకరిస్తారు. 

వెబ్‌సైట్‌: https://joinindianarmy.nic.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ పట్టపగ్గాల్లేని రాజకీయ ఫిరాయింపులు

‣ సుదృఢ బంధమే ఉభయతారకం

‣ ఉచిత యాప్‌లతో చదివేసుకోండి!

‣ హైదరాబాద్‌ ట్రిపుల్‌ఐటీలో ఎంఎస్‌ఐటీ

‣ రివిజన్‌కు సొంత నోట్సు

‣ బీటెక్‌ చదివినా.. గెలుపు ఆర్ట్స్‌తోనే!

‣ మార్పు అనివార్యం!

Posted Date : 31-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌