• facebook
  • whatsapp
  • telegram

కేంద్ర సంస్థల్లో స్టెనోలు!

దరఖాస్తులకు ఆహ్వానం

కేంద్రప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-సి, స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-డి పోస్టుల భర్తీ జరగబోతోంది. వీటికి సంబంధించి అర్హులైన అభ్యర్థుల నుంచి స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ ఆన్‌లైన్‌లో దరఖాస్తులు కోరుతోంది. గ్రేడ్‌-డి పోస్టులకు పురుషులే దరఖాస్తు చేయాలి. 

కేంద్ర ప్రభుత్వ శాఖల్లో ఏర్పడే ఖాళీలను బట్టి పోస్టుల సంఖ్యను ప్రకటిస్తారు. ప్రకటించిన పోస్టులకు ఇంటర్మీడియట్‌/ తత్సమాన పరీక్ష పాసైనవారు అర్హులు. స్టెనోగ్రఫీలో నైపుణ్యం ఉన్న అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేయాలి. 

01.01.2022 నాటికి స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-సి పోస్టులకు 18-30 ఏళ్లు, గ్రేడ్‌-డి పోస్టులకు 18-27 ఏళ్లు మించకూడదు. ఎస్సీ/ఎస్టీలకు గరిష్ఠ వయఃపరిమితిలో 5 ఏళ్లు, ఓబీసీలకు 3 ఏళ్లు, మాజీ సైనికోద్యోగులకు 3 ఏళ్ల మినహాయింపు ఉంటుంది. 

ఎంపిక: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష, స్టెనోగ్రఫీ స్కిల్‌ టెస్ట్‌ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌లో జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌; జనరల్‌ అవేర్‌నెస్‌లలో ఒక్కోదానిలో 50 ప్రశ్నలకు 50 చొప్పున మార్కులుంటాయి. ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌లో 100 ప్రశ్నలకు 100 మార్కులు కేటాయించారు. పరీక్షా సమయం 2 గంటల 40 నిమిషాలు. 

పరీక్షలో ఏం ఉంటాయి?

జనరల్‌ ఇంటెలిజెన్స్‌ అండ్‌ రీజనింగ్‌: వెర్బల్, నాన్‌-వెర్బల్, ఎనాలిజీస్, సిమిలారిటీస్‌ అండ్‌ డిఫరెన్సెస్, స్పేస్‌ విజువలైజేషన్, ప్రాబ్లమ్‌ సాల్వింగ్, ఎనలిటిక్స్, జడ్జిమెంట్, డిసిషన్‌ మేకింగ్, విజువల్‌ మెమొరీ, డిస్క్రిమినేటింగ్‌ అబ్జర్వేషన్, రిలేషన్‌షిప్‌ కాన్సెప్ట్స్, అరిథ్‌మెటికల్, రీజనింగ్, వెర్బల్‌ అండ్‌ ఫిగర్‌ క్లాసిఫికేషన్, అరిథ్‌మెటికల్‌ నంబర్‌ సిరీస్, నాన్‌-వెర్బల్‌ సిరీస్‌ మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి. అంతేకాకుండా అబ్‌స్ట్రాక్ట్‌ ఐడియాస్‌ అండ్‌ సింబల్స్‌ అండ్‌ దెయిర్‌ రిలేషన్‌షిప్స్, అరిథ్‌మెటికల్‌ కాంప్యుటేషన్‌ అండ్‌ అదర్‌ ఎనలిటికల్‌ ఫంక్షన్స్‌ మొదలైన అంశాల్లో అభ్యర్థికి ఉండే అవగాహనను పరీక్షించే విధంగానూ ప్రశ్నలు ఇస్తారు.

జనరల్‌ అవేర్‌నెస్‌: అభ్యర్థికి ఉండే సామాజిక అవగాహనను పరీక్షించే విధంగా ప్రశ్నలు ఉంటాయి. భారతదేశ చరిత్ర, క్రీడలు, సంస్కృతి, భౌగోళిక, ఆర్థిక పరిస్థితులు, రాజనీతి, భారత రాజ్యాంగం, శాస్త్ర పరిశోధనలు.. మొదలైన అంశాల నుంచి ప్రశ్నలు అడుగుతారు.

ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌ అండ్‌ కాంప్రహెన్షన్‌: ఒకాబ్యులరీ, గ్రామర్, సెంటెన్స్‌ స్ట్రక్చర్, సిననిమ్స్, యాంటనిమ్స్‌లోనూ, రాత నైపుణ్యాన్ని పరీక్షించటంలోనూ ప్రశ్నలు వస్తాయి. 

స్కిల్‌ టెస్ట్‌: కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష పాసైన అభ్యర్థులు స్టెనోగ్రఫీలో స్కిల్‌ టెస్ట్‌కు హాజరుకావాలి. ఇంగ్లిష్‌ లేదా హిందీ భాష (ఆన్‌లైన్‌ దరఖాస్తులో అభ్యర్థులు ఎంచుకున్న భాష)లో 10 నిమిషాల వ్యవధిలో డిక్టేషన్‌ ఇస్తారు.  

స్టెనోగ్రాఫర్‌ గ్రేడ్‌-సి అభ్యర్థులకు నిమిషానికి 100 పదాలను రాయగల నైపుణ్యం, గ్రేడ్‌-డి అభ్యర్థులు నిమిషానికి 80 పదాలను రాయగలగాలి. డిక్టేషన్‌ తీసుకున్న మేటర్‌ను ఆ తర్వాత కంప్యూటర్‌పైన లాంగ్‌ హ్యాండ్‌లో టైప్‌ చేయగలగాలి. హిందీలో స్టెనోగ్రఫీ పరీక్ష రాసిన అభ్యర్థులు కూడా ఆ తర్వాత ఇంగ్లిష్‌ స్టెనోగ్రఫీ నేర్చుకోవాలి. అవసరం మేరకు అభ్యర్థులు ఇంగ్లిష్‌/హిందీ స్టెనోగ్రాఫర్స్‌గా పనిచేయాలి. 

టైమ్‌టేబుల్, పరీక్ష కేంద్రాల వివరాలను పరీక్షకు 15 రోజుల ముందే కమిషన్‌ రీజనల్‌/ సబ్‌ రీజనల్‌ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచుతారు. ఈ విషయంలో ఏమైనా సందేహాలుంటే అభ్యర్థులు రిజిస్ట్రేషన్‌ ఐడీ, రిజిస్టర్డ్‌ ఈమెయిల్‌ ఐడీ, మొబైల్‌ నంబర్లతో మాత్రమే సంప్రదించాలి. 

కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో అన్‌రిజర్వ్‌డ్‌ అభ్యర్థులు 30 శాతం, ఓబీసీ/ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులు 25 శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 20 శాతం మార్కులు సాధించాలి. ఈ మార్కుల ఆధారంగానే అభ్యర్థులను స్కిల్‌ టెస్ట్‌కు ఎంపికచేస్తారు. కంప్యూటర్‌ ఆధారిత పరీక్షలో చూపిన ప్రతిభ, ఎంపిక చేసుకున్న శాఖలు/ విభాగాల ఆధారంగా అభ్యర్థుల నియామకం జరుగుతుంది.  

దరఖాస్తులకు చివరి తేదీ: 05.09.2022 

ఆన్‌లైన్‌ ఫీజు చెల్లించడానికి చివరి తేదీ: 06.09.2022

దిద్దుబాటు/ మార్పులు చేసుకోవాల్సిన తేదీ: 07.09.2022

కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష: నవంబరు, 2022

పరీక్ష కేంద్రాలు

తెలంగాణ: హైదరాబాద్, వరంగల్‌

ఆంధ్రప్రదేశ్‌: గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం.

వెబ్‌సైట్‌: https://ssc.nic.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ వ్యవసాయ, ఉద్యాన వర్సిటీల్లో ఎన్‌ఆర్‌ఐ కోటా!

‣ కొలువుకు భరోసా.. కమ్యూనిటీ సైన్స్‌ డిగ్రీ

‣ ఆలస్యంగా వీసాలు.. ఏం చేస్తే మేలు?

‣ ఆటోక్యాడ్‌తో అనేక అవకాశాలు

‣ అవుతారా...ఆహార సలహాదారులు?

‣ ప్ర‌తికూల‌ ఆలోచ‌న‌ల‌ను ప‌క్క‌కు నెట్టేయండి!

Posted Date : 24-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

ప్రత్యేక కథనాలు

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌