• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SILVER CET: కర్నూలు సిల్వర్ సెట్‌-2024 

కర్నూలులోని సిల్వర్ జూబ్లీ ప్రభుత్వ కళాశాల (కో ఎడ్యుకేషన్‌, అటానమస్)… 2024 విద్యా సంవత్సరానికి సంబంధించి ‘సిల్వర్‌ సెట్‌-2024’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. దీని ద్వారా వివిధ డిగ్రీ ఆనర్స్‌ కోర్సు(ఇంగ్లిష్ మీడియం)ల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఇంటర్‌ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన విద్యార్థులకు ఉచిత బోధన, భోజన, వసతి, శిక్షణ అందుతుంది.

పరీక్ష వివరాలు:

* సిల్వర్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్-2024

అందించే కోర్సులు:

1. బీకాం - జనరల్: 20 సీట్లు

2. బీకాం- కంప్యూటర్ అప్లికేషన్స్: 20 సీట్లు

3. బీఏ- హిస్టరీ, ఎకనామిక్స్: 20 సీట్లు

4. బీఏ- పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్: 20 సీట్లు

5. బీఎస్సీ- కంప్యూటర్ సైన్స్, మ్యాథ్స్: 20 సీట్లు

6. బీఎస్సీ- కంప్యూటర్ సైన్స్, ఫిజిక్స్: 20 సీట్లు

7. బీఎస్సీ- మ్యాథ్స్, కంప్యూటర్ సైన్స్: 25 సీట్లు

8. బీఎస్సీ- ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్: 25 సీట్లు

9. బీఎస్సీ- బోటనీ, కెమిస్ట్రీ: 20 సీట్లు

10. బీఎస్సీ- జువాలజీ, బయోటెక్నాలజీ: 20 సీట్లు

11. బీఎస్సీ- మైక్రోబయాలజీ, కెమిస్ట్రీ: 20 సీట్లు

12. బీఎస్సీ- కెమిస్ట్రీ, బయోకెమిస్ట్రీ: 20 సీట్లు

13. బీఎస్సీ- ఆర్గానిక్ కెమిస్ట్రీ, కంప్యూటర్ అప్లికేషన్: 25 సీట్లు

అర్హత: మార్చి-2024లో 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు అర్హులు. 

ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్ ప్రవేశ పరీక్ష, రూల్ ఆఫ్ రిజర్వేషన్, ప్రత్యేక కేటగిరీ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్‌ దరఖాస్తుకు చివరి తేదీ: 04.06.2024.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 04.06.2024.

హాల్ టికెట్/ అడ్మిట్ కార్డ్ డౌన్‌లోడ్: 10.06.2024.

కంప్యూటర్ ఆధారిత ప్రవేశ పరీక్ష తేదీ: 16.06.2024.



Some more information 
 

"From Classrooms to Boardrooms: Yasir M.'s Triumph"
   

 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 09-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :