• facebook
  • twitter
  • whatsapp
  • telegram

TTWRAFPA: అశోక్‌నగర్ గిరిజన గురుకులంలో డిగ్రీ కోర్సులు 

తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ నిర్వహిస్తున్న వరంగల్‌ జిల్లా అశోక్‌నగర్‌లోని తెలంగాణ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్ ప్రిపరేటరీ అకాడమీ ఫర్ మెన్… 2024-25 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సులో ప్రవేశానికి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ప్రోగ్రామ్‌ వ్యవధి మూడేళ్లు. ఆంగ్ల మాధ్యమంలో బోధన ఉంటుంది. తెలంగాణకు చెందిన ఎస్టీ, ఎస్సీ, బీసీ, ఓసీ ఇతర కేటగిరీకి చెందిన పురుష అభ్యర్థులు దరఖాస్తుకు అర్హులు.

ప్రోగ్రామ్ పేరు, సీట్లు:

1. బీఎస్సీ(ఎంపీసీ): 40 సీట్లు

2. బీఏ(హెచ్‌ఈపీ): 40 సీట్లు

మొత్తం సీట్ల సంఖ్య: 80.

కోర్సు వ్యవధి: మూడేళ్లు.

అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు నుంచి 60% మార్కులతో 2023, 2024 విద్యా సంవత్సరంలో ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన పురుష విద్యార్థులు అర్హులు. విద్యార్థి తల్లిదండ్రుల వార్షిక ఆదాయం రూ.2,00,000 (పట్టణ ప్రాంతం), రూ.1,50,000 (గ్రామీణ ప్రాంతం) మించకూడదు. అభ్యర్థులు కనీస ఎత్తు 152 సెం.మీ. కంటే ఎక్కువ ఉండాలి.

వయోపరిమితి: 01-07-2024 నాటికి 16 ఏళ్లు నిండి ఉండాలి.

దరఖాస్తు రుసుము: రూ.100.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష, ఫిజికల్ ఫిట్‌నెస్ టెస్ట్‌, మెడికల్ టెస్ట్‌, లెక్చరట్, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.

ముఖ్య తేదీ...

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: 10.05.2024

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.05.2024.



 

Some more information 
 
"Celebrating Excellence: Yasir M.'s Extraordinary Achievement"
 

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 11-05-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :