• facebook
  • twitter
  • whatsapp
  • telegram

CECRI: సీఈసీఆర్‌ఐలో 36 అప్రెంటిస్‌ ఖాళీలు 

తమిళనాడు రాష్ట్రం కరైకుడిలోని సీఎస్ఐఆర్‌- సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒప్పంద ప్రాతిపదికన కింది 36 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది.
 

పోస్టులు - ఖాళీలు

* ట్రేడ్‌ (ఐటీఐ) అప్రెంటిస్‌- 29

* టెక్నిషియన్ (డిప్లొమా) అప్రెంటిస్‌- 05

* గ్రాడ్యుయేట్‌ (డిగ్రీ) అప్రెంటిస్‌- 02

మొత్తం ఖాళీల సంఖ్య: 36


ట్రేడులు: ఫిట్టర్‌, మెషినిస్ట్‌, ఎలక్ట్రీషియన్‌, వైర్‌మెన్, ఎలక్ట్రానిక్స్‌ మెకానిక్‌, వెల్డర్‌, కార్పెంటర్, ప్లంబర్‌, సివిల్ ఇంజినీరింగ్‌, మెకానికల్ ఇంజినీరింగ్‌, ఎలక్ట్రికల్ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ ఇంజినీరింగ్‌, గెస్ట్‌ హౌస్ అండ్‌ క్యాంటీన్ మెనేజ్‌మెంట్‌, ఆఫీస్‌ అసిస్టెంట్‌ తదితరాలు.


వ్యవధి: 1 సంవత్సరం.


అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ ఉత్తీర్ణత కలిగి ఉండాలి.


వయోపరిమితి: ఇంటర్వ్యూ తేదీ నాటికి ఐటీఐ (ట్రేడ్‌)కు కనీసం 14 ఏళ్లు, టెక్నీషియన్‌కు 18 నుంచి 24 ఏళ్లు, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు 21 నుంచి 26 ఏళ్లు ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్ల గరిష్ఠ వయో సడలింపు ఉంటుంది.


స్టైపెండ్: నెలకు ట్రేడ్‌ అప్రెంటిస్‌ పోస్టులకు రూ.8,050, టెక్నిషియన్ అప్రెంటిస్‌కు రూ.8,000, గ్రాడ్యుయేట్‌ అప్రెంటిస్‌కు రూ.9,000.


రిజిస్ట్రేషన్ ప్రక్రియ: ఐటీఐ (ట్రేడ్‌), డిప్లొమా(టెక్నీషియన్‌), డిగ్రీ (గ్రాడ్యుయేషన్) అప్రెంటిసెస్‌ అభ్యర్థులు సంబంధిత వెబ్‌సైట్‌లో రిజిస్ట్రర్‌ చేసుకోవాలి.


ఇంటర్వ్యూ తేదీలు: 30, 31-07-2024, 01-08-2024.


వేదిక: సీఎస్‌ఐఆర్‌- సెంట్రల్ ఎలక్ట్రోకెమికల్ రిసెర్చ్‌ ఇన్‌స్టిట్యూట్‌, కాలేజ్‌ రోడ్, కరైకుడి.


ముఖ్య విషయాలు: 

* ఒప్పంద ప్రాతిపదికన 36 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీ


* ఇంటర్వ్యూ తేదీలు: జులై 30, 31, ఆగస్టు 01


* ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హత ఉన్నవారికి అవకాశం ఉంటుంది.

Notification


Official Website


 

Published at : 25-07-2024 17:12:03

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :