• facebook
  • twitter
  • whatsapp
  • telegram

RBI: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో 94 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టులు

ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్‌ బోర్డు… దేశవ్యాప్తంగా ఆర్‌బీఐ శాఖల్లో ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీకి ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 94 ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. 

అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది.
 

పోస్టుల వారీగా ఖాళీలు:

1. ఆఫీసర్ గ్రేడ్‌ బి (డీఆర్‌)- జనరల్- 66

2. ఆఫీసర్ ఇన్ గ్రేడ్‌ బి (డీఆర్‌)- డీఈపీఆర్‌- 21

3. ఆఫీసర్ ఇన్ గ్రేడ్‌ బి (డీఆర్‌)- డీఎస్‌ఐఎం- 07

మొత్తం పోస్టుల సంఖ్య: 94.

అర్హత: సంబంధిత విభాగంలో డిగ్రీ/ ఎంఏ/ పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

వయోపరిమితి: 01-07-2024 నాటికి 21 30 ఏళ్ల మధ్య ఉండాలి.

బేసిక్ పే స్కేల్: నెలకు రూ.55,200 నుంచి రూ.99750.

ఎంపిక ప్రక్రియ: ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు, ఇంటర్వ్యూ, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 25-07-2024 నుంచి 16-08-2024 వరకు.

ముఖ్యాంశాలు:

* రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI)- ఆర్‌బీఐ శాఖల్లో 94 ఆఫీసర్ గ్రేడ్-బి పోస్టుల భర్తీ చేస్తోంది. 

* అర్హులైన అభ్యర్థులు ఆగస్టు 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. 

* ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థుల ఎంపికవుతారు.

* దేశవ్యాప్తంగా ఉన్న ఆర్‌బీఐ శాఖల్లో ఎంపికైన అభ్యర్థులను నియమిస్తారు.


Notification

Official Website

Online application

 

Updated at : 26-07-2024 17:24:27

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :