• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SVPISTM: సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ టెక్స్‌టైల్స్‌ స్కూల్‌లో యూజీ, పీజీ కోర్సులు

కేంద్ర జౌళి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో నడుస్తున్న కేంద్ర ప్రభుత్వ కళాశాలైన ‘సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ ఇంటర్నేషనల్‌ స్కూల్‌ ఆఫ్‌ టెక్స్‌టైల్స్‌ అండ్‌ మేనేజ్‌మెంట్ (కోయంబత్తూరు)లో 2024-25లో యూజీ, పీజీ, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

యూజీ ప్రోగ్రామ్‌, కాల వ్యవధి వివరాలు:

1. బీఎస్సీ టెక్స్‌టైల్స్ - మూడేళ్లు

2. బీఎస్సీ టెక్నికల్ టెక్స్‌టైల్స్- మూడేళ్లు

3. బీబీఏ టెక్స్‌టైల్ బిజినెస్ అనలిటిక్స్- మూడేళ్లు

4. బీఎస్సీ టెక్స్‌టైల్ అండ్‌ అపెరల్ డిజైన్- మూడేళ్లు / నాలుగేళ్లు

అర్హత: కోర్సును అనుసరించి ఏదైనా విభాగంలో ప్లస్ టూ ఉత్తీర్ణత లేదా సైన్స్ విభాగంలో ప్లస్ టూ (ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లేదా బయాలజీ) పరీక్ష ఉత్తీర్ణత.
పీజీ ప్రోగ్రామ్‌లు (రెండేళ్లు):

1. ఎంబీఏ- టెక్స్‌టైల్ మేనేజ్‌మెంట్

2. ఎంబీఏ- అపెరల్ మేనేజ్‌మెంట్

3. ఎంబీఏ- రిటైల్ మేనేజ్‌మెంట్

4. ఎంబీఏ- టెక్నికల్ టెక్స్‌టైల్ మేనేజ్‌మెంట్

5. ఎంబీఏ- టెక్స్‌టైల్ బిజినెస్ అనలిటిక్స్

అర్హత: ఏదైనా విభాగం నుంచి గ్రాడ్యుయేషన్‌ ఉత్తీర్ణత.

షార్ట్‌టర్మ్‌ సర్టిఫికెట్ కోర్సులు: మెడికల్ టెక్స్‌టైల్ మేనేజ్‌మెంట్, నాన్‌వోవెన్ టెక్స్‌టైల్ మేనేజ్‌మెంట్, బ్లాక్‌చెయిన్ టెక్నాలజీ అప్లికేషన్ ఇన్‌ టెక్స్‌టైల్ ఇండస్ట్రీ.

కోర్సు వ్యవధి: 30 గంటలు

అర్హత: ఏదైనా డిగ్రీతో పాటు టెక్స్‌టైల్, అనుబంధ విభాగాల్లో విద్యార్హత, పరిజ్ఞానం, పని అనుభవం కలిగి ఉండాలి.

ప్రవేశ విధానం: యూజీ కోర్సులకు హయ్యర్ సెకండరీ పరీక్ష మార్కులు, సీయూఈటీ యూజీ లేదా ఎస్వీపీఈటీ ప్రవేశ పరీక్ష ఆధారంగా. పీజీ కోర్సులకు సీయూఈటీ పీజీ/ ఎస్వీపీఈటీ లేదా ఏదైనా ఇతర మేనేజ్‌మెంట్ ప్రవేశ పరీక్ష ఆధారంగా.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ అభ్యర్థులు రూ.500. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 31-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ అందుకుందాం ఐటీ ఉద్యోగం!

‣ కొచ్చిన్‌ షిప్‌యార్డ్‌లో ప్రాజెక్ట్‌ ఆఫీసర్ ఉద్యోగాలు!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 07-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :