• facebook
  • twitter
  • whatsapp
  • telegram

ANU CDE: ఏఎన్‌యూ దూరవిద్యలో యూజీ, పీజీ ప్రోగ్రాం 

గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం, సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్… దూర విద్య విధానంలో క్యాలెండర్ ఇయర్ 2024-25 కింద యూజీ, పీజీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశానికి దరఖాస్తులు కోరుతోంది. అర్హులైన అభ్యర్థులు జులై 31వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ప్రోగ్రామ్‌ వివరాలు:

I. పీజీ ఆర్ట్స్ ప్రోగ్రాం: రెండేళ్లు (4 సెమిస్టర్లు)

ఎంఏ: ఇంగ్లిష్, తెలుగు, హిందీ, సంస్కృతం, ఎకనామిక్స్, చరిత్ర, పొలిటికల్ సైన్స్, సోషియాలజీ, మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్, జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్, హ్యూమన్‌ రిసోర్స్‌ మేనేజ్‌మెంట్‌.

II. పీజీ కామర్స్ అండ్‌ మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం: రెండేళ్లు (4 సెమిస్టర్లు)

ఎంకాం: అకౌంటెన్సీ, బ్యాంకింగ్

III. యూజీ ఆర్ట్స్ ప్రోగ్రాం: మూడేళ్లు(6 సెమిస్టర్లు)

బీఏ: ఎకనామిక్స్, హిస్టరీ, పాలిటిక్స్/ ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్/ ఎకనామిక్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ/ ఎకనామిక్స్, హిస్టరీ, సోషియాలజీ/ ఎకనామిక్స్, పాలిటిక్స్‌, సోషియాలజీ/ హిస్టరీ, పాలిటిక్స్‌, సోషియాలజీ/ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, పాలిటిక్స్‌, హిస్టరీ/ స్పెషల్‌ ఇంగ్లిష్‌, హిస్టరీ, స్పెషల్‌ తెలుగు/ ఎకనామిక్స్, బ్యాంకింగ్, కంప్యూటర్ అప్లికేషన్స్.

IV. యూజీ కామర్స్, మేనేజ్‌మెంట్ ప్రోగ్రాం: మూడేళ్లు(6 సెమిస్టర్లు)

1. బీకాం: జనరల్, కంప్యూటర్ అప్లికేషన్స్.

2. బీబీఏ: బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్

V. లైబ్రరీ ప్రోగ్రాం: ఏడాది (2 సెమిస్టర్లు)

1. బీఎల్‌ఐఎస్సీ (బ్యాచిలర్ ఆఫ్ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్ సైన్స్)

2. ఎంఎల్‌ఐఎస్సీ (మాస్టర్ ఆఫ్ లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్ సైన్స్)

6. సర్టిఫికేట్/ డిప్లొమా ప్రోగ్రాం: ఏడాది

1. సర్టిఫికేట్ కోర్సు ఇన్‌ హెచ్‌ఐవీ ఎయిడ్స్‌ కౌన్సెలింగ్‌

2. సర్టిఫికేట్ కోర్సు ఇన్‌ హోటల్ అండ్‌ హాస్పిటల్ మేనేజ్‌మెంట్‌

3. డిప్లొమా(ఫుడ్‌ ప్రొడక్షన్‌) 

4. డిప్లొమా (సైకలాజికల్ గైడెన్స్ అండ్ కౌన్సెలింగ్)

అర్హత: కోర్సును బట్టి పదో తరగతి, ఐటీఐ, ఇంటర్మీడియట్, డిప్లొమా, బ్యాచిలర్స్ డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి. 

కోర్సు మాధ్యమం: కోర్సును అనుసరించి తెలుగు, ఇంగ్లిష్‌, సంస్కృతం, హిందీ.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 31-07-2024.


మరింత సమాచారం... మీ కోసం!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!

‣ బీటెక్‌, బీఎస్సీ అర్హతతో కొలువులు!

‣ క్రీడల్లో కోచ్‌లుగా రాణించాలుకుంటున్నారా?!

‣ వినూత్న కెరియర్‌కు.. మాలిక్యులర్‌ జెనెటిక్స్‌!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 21-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :