• facebook
  • twitter
  • whatsapp
  • telegram

JNV Selection Test: జవహర్ నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలు 

దేశవ్యాప్తంగా 653 జవహర్‌ నవోదయ విద్యాలయ (జేఎన్‌వీ)లో ఆరో తరగతిలో ప్రవేశాలకు సంబంధించి కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025 దరఖాస్తుకు సెప్టెంబర్‌ 16 వరకు ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించింది. హిందీ, ఇంగ్లిష్‌, తెలుగు మూడు భాషల్లోనూ విద్యార్థుల్లో సామర్థ్యం పెంపు, వలస విద్యా విధానం ద్వారా జాతీయ సమైక్యత పెంపొందించడం జేఎన్‌వీ ముఖ్య ఉద్దేశం. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 జేఎన్‌వీలు ఉన్నాయి. ఏటా నిర్వహించే ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.

పరీక్ష వివరాలు

* జవహర్ నవోదయ విద్యాలయ ఎంపిక పరీక్ష-2025

అర్హత: ప్రవేశానికి అర్హత పొందాలంటే విద్యార్థి తప్పనిసరిగా జవహర్ నవోదయ విద్యాలయం ఉన్న సంబంధిత జిల్లాల్లో నివాసి అయి ఉండాలి. విద్యార్థులు 2024-25 విద్యా సంవత్సరంలో ఆయా జిల్లాల్లోని ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతుండాలి. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. వారు 3, 4, 5 తరగతులు గ్రామీణ ప్రాంత పాఠశాలల్లోనే చదివి ఉండాలి. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. 

వయసు: దరఖాస్తు చేసుకునే విద్యార్థులు 01-05-2013 నుంచి 31-07-2015 మధ్యలో జన్మించిన వారై ఉండాలి. 

ప్రవేశ పరీక్ష: జవహర్‌ నవోదయ ప్రవేశానికి నిర్వహించే రాత పరీక్షలో వచ్చే మార్కులు ఆధారంగా విద్యార్థుల ఎంపిక ఉంటుంది. ప్రవేశ పరీక్ష ప్రశ్నపత్రంలో మూడు విభాగాలు(మెంటల్‌ ఎబిలిటీ, అరిథ్‌మెటిక్‌, లాంగ్వేజ్‌) ఉంటాయి. మొత్తం 80 ప్రశ్నలు 100 మార్కులకు 2 గంటల సమయంలో ప్రవేశ పరీక్ష ఉంటుంది. ఏపీలో తెలుగు/ ఆంగ్లం/ హిందీ/ మరాఠీ/ ఉర్దూ/ ఒరియా/ కన్నడ మాధ్యమంలో, తెలంగాణలో తెలుగు/ ఆంగ్లం/ హిందీ/ మరాఠీ/ ఉర్దూ/ కన్నడ మాధ్యమంలో ప్రవేశ పరీక్ష రాయవచ్చు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకొనేందుకు అభ్యర్థులు నిర్ణీత ఫార్మాట్‌లో అభ్యర్థి వివరాలను పేర్కొంటూ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ధ్రువీకరించిన సర్టిఫికెట్‌ సాఫ్ట్‌ కాపీని అప్‌లోడ్‌ చేయడం తప్పనిసరిని. దీంతో పాటు అభ్యర్థి ఫొటో, అభ్యర్థి, తల్లిదండ్రుల సంతకాలు, ఆధార్‌ వివరాలు/ నివాస ధ్రువపత్రాల అవసరం ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ: ప్రవేశ పరీక్ష ఆధారంగా సీటు కేటాయిస్తారు.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభం: 16-07-2024.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 16-09-2024

ప్రవేశ పరీక్ష తేదీ: 18-01-2025.

సమయం: ఉదయం 11.30 నుంచి 1.30 గంటల వరకు సంబంధిత జిల్లాలో ఎంపిక చేసిన అన్ని కేంద్రాల్లో నిర్వహిస్తారు. 

ఫలితాల వెల్లడి: 2025, మార్చి.

 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పాఠాలు అర్థం కావడం లేదా?

‣ సరైన జవాబులిస్తే ఐటీ కొలువు మీదే!

‣ స్వీయ అవగాహన ఎందుకంత ముఖ్యం?

‣ పరిజ్ఞానం ఉంటే.. ఆంగ్లం ఇబ్బంది కాదు!

‣ గిరికోనల్లో... చదువుల మెరుపు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 18-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

నోటిఫికేష‌న్స్‌ :