• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APITI: ఏపీలో ఐటీఐ కోర్సు అడ్మిషన్లు-2024 

విజయవాడలోని ఏపీ ఉపాధి- శిక్షణ కమిషనర్‌ కార్యాలయం… 2024-2025 రెండో సెషన్‌కు గాను రాష్ట్రంలోని ప్రభుత్వ/ ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు జులై 24వ తేదీలోగా ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తులు డౌన్‌లోడ్‌ చేసుకొని పూరించి సంబంధిత కళాశాలలో అందజేయాలి.

ప్రకటన వివరాలు:

* ఐటీఐ కోర్సు (ఫేజ్‌-2) అడ్మిషన్లు

ట్రేడ్: కార్పెంటర్, సీవోపీఏ, డ్రాఫ్ట్స్‌మ్యాన్, ఎలక్ట్రీషియన్, ఫిట్టర్, ఫౌండ్రీమ్యాన్, మెషినిస్ట్, ప్లంబర్, టర్నర్, వెల్డర్, వైర్‌మ్యాన్ తదితరాలు.

అర్హత: 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 14 ఏళ్లు నిండి ఉండాలి. గరిష్ఠ వయోపరిమితి లేదు.

ఎంపిక: అకడమిక్ మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా సీటు కేటాయిస్తారు. 

దరఖాస్తు విధానం: అభ్యర్థులు ఆన్‌లైన్‌లో వ్యక్తిగత, విద్యార్హతతో పాటు ఐటీఐ/ ట్రేడ్‌ వివరాలను ప్రాధాన్య క్రమంలో నమోదు చేసుకోవాలి. ఆన్‌లైన్‌లో దరఖాస్తులు పూర్తి చేసే క్రమంలో ఎటువంటి తప్పులు లేకుండా చేయాలి. పూర్తి చేసిన దరఖాస్తులను, ఒరిజినల్‌ సర్టిఫికేట్లను దగ్గరలోని ప్రభుత్వ ఐటీఐలో పరిశీలన చేయించుకొని ఆయా ప్రిన్సిపల్స్‌తో అప్రూవల్‌ చేయించుకోవాల్సి ఉంటుంది. అలాంటి వారి పేర్లను మెరిట్‌ లిస్టులో పొందుపరుస్తారు.

ఆన్‌లైన్ దరఖాస్తు సమర్పణకు చివరి తేదీ: 24-07-2024.

ప్రభుత్వ ఐటీఐల్లో కౌన్సెలింగ్‌ తేదీ: 28-07-2024.

ప్రైవేట్‌ ఐటీఐల్లో కౌన్సెలింగ్‌ తేదీ: 29-07-2024.

మరింత సమాచారం... మీ కోసం!

‣ గ్రూపు-1 మెయిన్స్‌ 100 రోజుల వ్యూహాం!!

‣ అనువర్తన ధోరణిలో అధ్యయనం మేలు!

‣ జాగ్రఫీదే హవా!

‣ కేంద్ర శాఖల్లో 17,727 కొలువులు!

‣ ఆశావహ దృక్పథంతో ఆశయ సాధన!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Important Links

Posted Date: 02-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :