• facebook
  • twitter
  • whatsapp
  • telegram

APSCHE: ఏపీలో జనరల్‌ డిగ్రీ కోర్సు ప్రవేశాలు 

ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్… 2024-25 విద్యా సంవత్సరానికి ప్రభుత్వ/ ఎయిడెడ్/ ప్రైవేట్ అన్ ఎయిడెడ్/ అటానమస్ డిగ్రీ కళాశాలల్లో జనరల్ యూజీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ‘ఓఏఎండీసీ 2024-25’ నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఇంటర్మీడియట్‌ ఉత్తీర్ణులైన విద్యార్థులు ఆన్‌లైన్‌లో జులై 2 నుంచి 10వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలి. ఎన్‌సీసీ, దివ్యాంగులు, మాజీ సైనికోద్యోగులు, క్రీడాకారులు ధ్రువపత్రాల పరిశీలనకు ఎస్‌ఆర్‌ఆర్‌ కళాశాల(విజయవాడ), డాక్టర్‌ వీఎస్‌ కృష్ణ కళాశాల(విశాఖపట్నం), ఎస్వీ విశ్వవిద్యాలయం (తిరుపతి)లో సహాయ కేంద్రాలకు హాజరుకావాల్సి ఉంటుంది. 

ప్రకటన వివరాలు:

జనరల్‌ యూజీ ప్రోగ్రామ్‌

కోర్సులు: బీఏ, బీఎస్సీ, బీకాం, బీబీఏ, బీ.ఒకేషనల్‌, బీసీఏ, బీబీఏ, బీఎఫ్‌ఏ, అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌

అర్హత: ఇంటర్మీడియట్ ఉత్తీర్ణులై ఉండాలి. 

ప్రాసెసింగ్ ఫీజు: ఓసీ అభ్యర్థులకు రూ.400, బీసీ అభ్యర్థులకు రూ.300, ఎస్సీ/ ఎస్టీ అభ్యర్థులకు రూ.200.

ముఖ్య తేదీలు… 

ఆన్‌లైన్‌ దరఖాస్తు తేదీలు: 02-07-2024 నుంచి 10-07-2024 వరకు.

ప్రత్యేక కేటగిరీ అభ్యర్థుల ధ్రువపత్రాల పరిశీలన తేదీలు: 04.07.2024 నుంచి 06.07.2024 వరకు.

హెల్ప్‌లైన్‌ సెంటర్లలో ధ్రువపత్రాల పరిశీలన ప్రారంభం: 05.07.2024.

వెబ్ ఆప్షన్ల నమోదు తేదీలు: 11.07.2024 నుంచి 15.07.2024 వరకు.

సీట్ల కేటాయింపు: 19.07.2024.

కళాశాలల్లో రిపోర్టింగ్‌, తరగతుల ప్రారంభం: 20.07.2024 నుంచి 22.07.2024 వరకు.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ పవర్‌ గ్రిడ్‌లో 435 ఇంజినీర్‌ ట్రెయినీ ఉద్యోగాలు

‣ తీర రక్షక దళంలో నావిక్‌, యాంత్రిక్‌ కొలువులు

‣ క్లౌడ్‌ కంప్యూటింగ్‌తో అపార అవకాశాలు

‣ పరీక్ష లేకుండానే ఫార్మా కొలువులు


 


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 02-07-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :