స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) తాజాగా కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవల్(సీజీఎల్) పరీక్ష-2024కు సంబంధించిన ప్రకటన విడుదల చేసింది. ఈ పరీక్ష ద్వారా వివిధ కేంద్ర మంత్రిత్వ శాఖల్లోని గ్రూప్-బి, గ్రూప్-సి విభాగాల్లోని 17,727 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏదైనా డిగ్రీ విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో జులై 24లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. టైర్-1, టైర్-2 తదితర పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఖాళీల వివరాలు...
* ఖాళీల సంఖ్య: 17,727
భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు:
గ్రూప్-బి:
1. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
2. అసిస్టెంట్/ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్
3. ఇన్స్పెక్టర్
4. అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్
5. సబ్ ఇన్స్పెక్టర్
6. ఇన్స్పెక్టర్ పోస్ట్స్
7. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్
8. రిసెర్చ్ అసిస్టెంట్
9. డివిజనల్ అకౌంటెంట్
10. సబ్-ఇన్స్పెక్టర్/ జూనియర్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్
11. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్
గ్రూప్ సి:
12. ఇన్స్పెక్టర్ ఆఫ్ ఇన్‌కం టాక్స్
13. ఆడిటర్
14. అకౌంటెంట్
15. అకౌంటెంట్/ జూనియర్ అకౌంటెంట్
16. పోస్టల్ అసిస్టెంట్/ సార్టింగ్ అసిస్టెంట్
17. సీనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్/ అప్పర్ డివిజన్ క్లర్క్
18. సీనియర్ అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్
19. ట్యాక్స్ అసిస్టెంట్
20. సబ్-ఇన్స్పెక్టర్
మంత్రిత్వ శాఖలు: సెంట్రల్ సెక్రటేరియట్ సర్వీస్, ఇంటెలిజెన్స్ బ్యూరో, రైల్వే, విదేశీ వ్యవహారాలు, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డైరెక్టరేట్ ఆఫ్ ఎన్ఫోర్స్మెంట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్, పోస్ట్స్ డిపార్ట్మెంట్, సెంట్రల్ నార్కోటిక్స్ బ్యూరో, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, మిలిటరీ ఇంజినీరింగ్ సర్వీసెస్ తదితరాలు.
విద్యార్హతలు: పోస్టును అనుసరించి ఏదైనా డిగ్రీ, డిగ్రీ (మ్యాథ్స్ సబ్జెక్టుగా 12వ తరగతి) ఉత్తీర్ణులై ఉండాలి.
వయోపరిమితి: 01.08.2024 నాటికి ఖాళీలను అనుసరించి 18-27 ఏళ్లు, 20-30 ఏళ్లు, 18-30 ఏళ్లు, 18-32 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, ఎక్స్సర్వీస్మెన్లకు మూడేళ్ల పాటు వయో సడలింపు కల్పించారు. వీరితో పాటు దివ్యాంగులకు ప్రత్యేకంగా వయో సడలింపు ఇచ్చారు.
ఎంపిక విధానం: టైర్-1, టైర్-2 పరీక్షలు, డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్స్ మెజర్మెంట్స్, ఫిజికల్/ మెడికల్ టెస్టులు, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా ఎంపిక చేస్తారు.
టైర్-1 పరీక్ష విధానం: జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ (25 ప్రశ్నలు- 50 మార్కులు), జనరల్ అవేర్నెస్ (25 ప్రశ్నలు- 50 మార్కులు), క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ (25 ప్రశ్నలు- 50 మార్కులు), ఇంగ్లిష్ కాంప్రహెన్షన్ (25 ప్రశ్నలు- 50 మార్కులు).
పరీక్ష వ్యవధి: 1 గంట.
దరఖాస్తు విధానం: ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు సమయంలో రూ.100ను ఎగ్జామ్ ఫీజుగా చెల్లించాలి(ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.)
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్షా కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.
ముఖ్య తేదీలు:
ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 24-06-2024.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరితేది: 24-07-2024.
ఆన్లైన్ ఫీజు చెల్లింపు చివరితేది: 24-07-2024.
దరఖాస్తుల సవరణ తేదీలు: 10-08-2024 నుంచి 11-08-2024 వరకు.
టైర్-1 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): సెప్టెంబర్-అక్టోబర్, 2024.
టైర్-2 పరీక్ష తేదీ (కంప్యూటర్ ఆధారిత పరీక్ష): డిసెంబర్, 2024.
మరింత సమాచారం... మీ కోసం!
‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!
‣ డీవీసీలో జూనియర్ ఇంజినీర్ ఖాళీలు!
‣ అగ్రి బిజినెస్ మేనేజ్మెంట్తో అపార అవకాశాలు!
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.
HCL: హిందుస్థాన్ కాపర్ లిమిటెడ్‌లో 56 జూనియర్ మేనేజర్ పోస్టులు
NHB: నేషనల్ హౌసింగ్ బ్యాంకులో 48 అసిస్టెంట్/ డిప్యూటీ మేనేజర్ పోస్టులు
IDBI Bank: ఐడీబీఐలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ ఉద్యోగాలు
TG MHSRB: తెలంగాణలో 435 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు
NITA: నిట్ అగర్తలాలో నాన్ టీచింగ్ ఖాళీలు
RECPDCL: ఆర్ఈసీపీడీసీఎల్లో 25 డిప్యూటీ మేనేజర్ పోస్టులు
SSC: కేంద్ర విభాగాల్లో 8,326 ఎంటీఎస్, హవల్దార్ ఉద్యోగాలు
IIMJ: ఐఐఎం జమ్మూలో స్పెషలిస్ట్, యంగ్ ప్రొఫెషనల్ పోస్టులు
HAL: హిందుస్థాన్ ఏరోనాటిక్స్‌లో నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టులు
Navy: ఇండియన్ నేవీలో సెయిలర్ (స్పోర్ట్స్ కోటా ఎంట్రీ) పోస్టులు
UCSL: ఉడిపి కొచ్చిన్ షిప్‌యార్డులో సూపర్వైజర్ ఉద్యోగాలు
Indian Navy: ఇండియన్ నేవీలో అగ్నివీర్ (ఎంఆర్ మ్యుజీషియన్) పోస్టులు
NHAI: ఎన్హెచ్ఏఐలో 38 రోడ్ సేఫ్టీ ఎక్స్పర్ట్ ఉద్యోగాలు
AEES: ఏఈఈఎస్లో స్పెషల్ ఎడ్యుకేటర్ ఖాళీలు
ACTREC: ఏసీటీఆర్ఈసీలో సైంటిఫిక్ ఆఫీసర్ ఉద్యోగాలు
PMBI: పీఎంబీఐలో ఎగ్జిక్యూటివ్, అసిస్టెంట్ మేనేజర్ పోస్టులు
ICAR-CIRB: సీఐఆర్‌బీలో యంగ్ ప్రొపెషనల్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 168 క్రెడిట్ అనలిస్ట్, రిలేషన్షిప్ మేనేజర్ పోస్టులు
Bank of Baroda: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 459 సీనియర్ రిలేషన్షిప్ మేనేజర్, సీనియర్ మేనేజర్ పోస్టులు
IAF: భారత వాయుసేనలో అగ్నివీర్ వాయు ఉద్యోగాలు