• facebook
  • twitter
  • whatsapp
  • telegram

SSC: కేంద్ర విభాగాల్లో 8,326 ఎంటీఎస్‌, హవల్దార్ ఉద్యోగాలు 

స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్‌ఎస్‌సీ)… కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు/ కార్యాలయాల్లో మల్టీ-టాస్కింగ్ స్టాఫ్, హవల్దార్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. పదో తరగతి ఉత్తీర్ణులైన అభ్యర్థులు జులై 31లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

కేంద్ర మంత్రిత్వ శాఖలు/ విభాగాలు: జనరల్ సెంట్రల్ సర్వీస్, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇన్‌డైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ నార్కోటిక్స్.

ఖాళీల వివరాలు:

1. మల్టీ-టాస్కింగ్ (నాన్-టెక్నికల్) స్టాఫ్(గ్రూప్‌-సి నాన్‌ గెజిటెడ్‌, నాన్‌మినిస్టీరియల్‌): 4,887 పోస్టులు

2. హవల్దార్(గ్రూప్‌-సి నాన్‌ గెజిటెడ్‌, నాన్‌ మినిస్టీరియల్‌): 3,439 పోస్టులు

మొత్తం ఖాళీల సంఖ్య: 8,326.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు నుంచి పదో తరగతి/ మెట్రిక్యులేషన్ లేదా తత్సమానం ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 01-08-2024 నాటికి పోస్టులను అనుసరించి 18-25, 18-27 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు, దివ్యాంగులకు పదేళ్ల సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఎంటీఎస్‌ ఖాళీలకు సెషన్-1, 2 కంప్యూటర్ ఆధారిత పరీక్షలు, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా. హవల్దార్ ఖాళీలకు కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఆధారంగా ఎంపిక చేస్తారు. 

కంప్యూటర్ ఆధారిత పరీక్ష:

సెషన్-I: న్యూమరికల్ అండ్‌ మ్యాథమెటికల్ ఎబిలిటీ (20 ప్రశ్నలు/ 60 మార్కులు), రీజనింగ్ ఎబిలిటీ అండ్‌ ప్రాబ్లమ్ సాల్వింగ్ (20 ప్రశ్నలు/ 60 మార్కులు).

సెషన్-II: జనరల్ అవేర్‌నెస్ (25 ప్రశ్నలు/ 75 మార్కులు), ఇంగ్లిష్ లాంగ్వేజ్ అండ్ కాంప్రహెన్షన్ (25 ప్రశ్నలు/ 75 మార్కులు).

సీబీటీ వ్యవధి: ప్రతి సెషన్ 45 నిమిషాలు.

దరఖాస్తు రుసుము: రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మాజీ సైనికులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమహేంద్రవరం, తిరుపతి, విజయనగరం, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, కరీంనగర్, వరంగల్.

ముఖ్య తేదీలు...

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 27-06-2024 నుంచి 31-07-2024 వరకు.

ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 31-07-2024.

ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు చివరి తేదీ: 01-08-2024.

దరఖాస్తు సవరణ తేదీలు: 16-08-2024 నుంచి 17-08-2024 వరకు.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష పరీక్షల నిర్వహణ: అక్టోబర్‌/ నవంబర్‌, 2024.


 

మరింత సమాచారం... మీ కోసం!

‣ వాయుసేనలో అగ్నివీరులవుతారా?

‣ బెల్‌లో ఉద్యోగాలు!

‣ డిప్లొమాతో ఉద్యోగాలకు బాటలు!

‣ డీవీసీలో జూనియర్‌ ఇంజినీర్‌ ఖాళీలు!

‣ అగ్రి బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌తో అపార అవకాశాలు!


Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.,Whatsapp Channel.,Telegram Channel.

Important Links

Posted Date: 28-06-2024

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి

 

నోటిఫికేష‌న్స్‌ :