షెడ్యూల్డ్ కులాలకు చెందిన పేద విద్యార్థులకు ఉన్నత చదువులు చదివేందుకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తోంది. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో 2023-24 ఏడాదికి గాను అర్హులైన ఎస్సీ విద్యార్థులకు ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పేరిట సాయమందిస్తోంది. తొమ్మిది, పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రూ.3,500 నుంచి రూ.7,000 వరకు ఉపకార వేతనాన్ని ఇస్తోంది. దివ్యాంగ విద్యార్థులకు 10% అదనపు భత్యం అందుతుంది.
వివరాలు...
ఎస్సీ విద్యార్థుల ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం 2023-24
అర్హతలు: గుర్తింపు పొందిన విద్యా సంస్థల్లో తొమ్మిది, పదో తగరగతి చదువుతున్న విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. వీటిని ఎస్సీ కేటగిరీకి చెందిన వారికి అందిస్తారు. అందులోనూ కుటుంబ వార్షిక ఆదాయం రూ.2.5 లక్షలు మించకూడదు. భారతదేశంలో చదివే పిల్లలకే ఈ స్కాలర్‌షిప్ వర్తిస్తుంది. దరఖాస్తుల పరిశీలన, ఎంపిక బాధ్యత రాష్ట్రాలపైనే ఉంటుంది. విద్యార్థులు ప్రవేశం పొందే సంస్థలకు ప్రభుత్వ గుర్తింపు ఉండాలి.
దరఖాస్తు విధానం: అర్హులైన విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
మరింత సమాచారం... మీ కోసం!
‣నెహ్రూ గ్రామ భారతి వర్సిటీలో పీహెచ్‌డీ ప్రోగ్రామ్
‣డాక్టర్ వైఎస్సార్ యూహెచ్‌ఎస్‌లో బీఎస్సీ (నర్సింగ్) కోర్సు
‣ఎన్‌హెచ్‌ఐటీలో 51 వివిధ పోస్టులు
‣ Read Latest jobs, Latest notifications and Latest govt jobs
‣ Follow us on Facebook, Twitter, Koo, Share chat, Google News Subscribe our Youtube Channel.
CBSE SGCS: సింగిల్ గర్ల్ చైల్డ్ స్కాలర్‌షిప్ 2023
Santoor: సంతూర్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్ 2023-24
Scholarship: పేద ఎస్సీ విద్యార్థులకు పోస్ట్ మెట్రిక్ స్కాలర్‌షిప్ పథకం